నాథులా పాస్ మీదుగా చైనాలో తొలి బృందం అడుగు నాయిదౌలా (టిబెట్), జూన్ 22: కైలాశ్ మానస సరోవర్ యాత్రలో కొత్త చరి త్ర నమోదైంది. సిక్కిం న...
నాథులా పాస్ మీదుగా చైనాలో తొలి బృందం అడుగు
నాయిదౌలా (టిబెట్), జూన్ 22: కైలాశ్ మానస సరోవర్ యాత్రలో కొత్త చరి త్ర నమోదైంది. సిక్కిం నుంచి సరిహద్దుల్లోని నాథులా పాస్ మీదుగా చైనా భూభాగంలోకి భారత యాత్రికుల తొలి బృందం అడుగుపెట్టింది. ఒకవైపు ఎముకలు కొరికే చలి.. మరోవైపు చైనా మిలిటరీ, పౌర అధికారుల పర్యవేక్షణ మధ్య 70 ఏండ్ల వృద్ధులు మొదలు 27 ఏండ్ల యువకుల వరకు 43 మంది యాత్రికుల బృందం.. ఆనందోత్సాహాలతో చైనా స్వతంత్ర ప్రతిపత్తి ప్రాంతం టిబెట్‌లోని నాయిదౌలాలో సోమవారం అడుగు పెట్టింది. స్థానిక టిబెట్ మహిళలు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. 2013లో వరదల వల్ల ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ పాస్ మార్గం దెబ్బ తిన్నది.
ఈ నేపథ్యంలో నాథులా పాస్ మీదుగా మానస సరోవర్ యాత్రకు వెళ్లేందుకు యాత్రికులకు అనుమతినిస్తామని గత సెప్టెంబర్‌లో భారత్‌లో పర్యటించిన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. లిపులేఖ్ పాస్ మీదుగా వారం పాటు పర్వతారోహణకే సరిపోతుందని ఏడోసారి యాత్రలో పాల్గొన్న ఢిల్లీవాసి మనోజ్ అగర్వాల్ చెప్పారు. ఆరుసార్లు స్వర్గానికి వెళ్లొచ్చినట్లయిందన్నాడు. ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ పాస్ మీదుగా యాత్ర పూర్తి చేయడానికి ఒక్కొక్కరికి రూ.1.80 లక్షలు ఖర్చయ్యేది. నాథులా మార్గంలో రూ.30 వేల ఖర్చుతో యాత్ర పూర్తి అవుతుందని యాత్రికులు అంటున్నారు.