హైదరాబాద్ : ఇతరులకు పంపించిన మెయిల్‌ను తిరిగి పొందే సౌకర్యాన్ని జీ-మెయిల్ సంస్థ పరిచయం చేసింది. ఇప్పటి వరకు మన మెయిల్ ఐటి నుండి ఇతరులకు...

హైదరాబాద్ : ఇతరులకు పంపించిన మెయిల్‌ను తిరిగి పొందే సౌకర్యాన్ని జీ-మెయిల్ సంస్థ పరిచయం చేసింది. ఇప్పటి వరకు మన మెయిల్ ఐటి నుండి ఇతరులకు మెయిల్ పంపినట్లయితే దాన్ని తిరిగి పొందలేం. ఇలాంటి నేపథ్యంలో జి మెయిల్ సంస్థ అత్యాధునిక సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీనిద్వారా మనం పంపిన మెయిల్‌ను తిరిగి తీసుకునే సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది. ఎవరికైనా పొరపాటున మెయిల్ చేసినా ఇక నుండి దాన్ని తిరిగి పొందవచ్చు. పంపిన మెయిల్‌ను అన్‌సెండ్ చేయదలుచుకుంటే మొదట జి మెయిల్లోకి వెళ్లాలి. తర్వాతా అందులోని సెట్టింగ్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. అందులో ఉన్న ల్యాప్స్ ఆప్షన్‌ను క్లిక్ చేసి, లోపలికి వెళ్లిన వెంటనే అన్డుసెండ్ అనే విభాగానికి వెళ్లి, అక్కడ అన్ సౌకర్యాన్ని ఎనేబుల్ చేయాలి. అనంతరం సేవ్ ఛేంజెస్ బటన్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీరు ఎవరికైనా మెయిల్ చేసినట్లైతే ఒక బాక్స్ వస్తుంది. అందులో అన్‌సెండ్ అనే సౌకర్యం 30 సెకన్ల పాటు మానిటర్‌పై కనిపిస్తుంది. ఆ సమయంలో మీరు పంపిన మెయిల్‌ను తిరిగి పొందాలనుకుంటే వెంటనే అన్‌సెండ్ ఆప్షన్‌ను క్లిక్‌చేసి తిరిగి పొందవచ్చును.