డబ్బులు పోగొట్టుకోవడానికి సినిమాలు ఎందుకు తీయాలి?

సినిమా అనే కళాత్మక వ్యాపారంలో ఆడియెన్స్ పల్స్ తెలుసుకోవడం అంత తేలికైన విషయం కాదు. ప్రేక్షకుల అభిరుచుల్ని అర్థం చేసుకొని వాటికి అనుగుణ...


dilraju

సినిమా అనే కళాత్మక వ్యాపారంలో ఆడియెన్స్ పల్స్ తెలుసుకోవడం అంత తేలికైన విషయం కాదు. ప్రేక్షకుల అభిరుచుల్ని అర్థం చేసుకొని వాటికి అనుగుణంగా సినిమాల్ని నిర్మించడం అందరికీ సాధ్యమయ్యే పనికాదు. కానీ అగ్ర నిర్మాత దిల్‌రాజును ఇందుకు మినహాయింపుగా చెప్పుకోవచ్చు. ప్రేక్షకుల నాడీని ఖచ్చితంగా అంచనా వేస్తారని ఆయనకు పరిశ్రమలో పేరుంది. సినిమా విషయంలో దిల్‌రాజు జడ్జిమెంట్‌కు తిరుగుండదని చెబుతారు. ఈ లక్షణాలే ఆయన్ని తెలుగు చిత్ర సీమలో అగ్ర నిర్మాతగా నిలిపాయి. పన్నేండేళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఆయన సంస్థ నుంచి జనరంజకమైన చిత్రాలెన్నో వచ్చాయి. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకొని చిత్రసీమలో విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు దిల్‌రాజు. ఆయన నిర్మించిన తాజా చిత్రం కేరింత ఇటీవలే ప్రేక్షకులముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఆయన నమస్తే తెలంగాణతో ప్రత్యేకంగా ముచ్చటించారు. సమకాలీన తెలుగు సినిమా తీరుతెన్నులపై, నిర్మాణపరమైన సాధకబాధకాలపై తనదైన శైలిలో స్పందించారు.

చాలాకాలం విరామం తర్వాత మీ అభిరుచికి తగిన యూత్‌ఫుల్ కథాంశంతో కేరింత చిత్రాన్ని తీశారు. కమర్షియల్‌గా ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తోంది?

కొత్తవాళ్లతో సినిమా తీసేటప్పుడు నేను స్క్రిప్ట్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాను. కేరింత సినిమా ప్రివ్యూ చూసినప్పుడే విజయంపై నమ్మకం కలిగింది. అయితే సినిమా విడుదలైన తొలిరోజు సరైన ఓపెనింగ్స్ రాలేదు. దాంతో కొంత అప్‌సెట్ అయ్యాను. ఇప్పటివరకు మా సంస్థ నిర్మించిన చిత్రాల్లో తొలిరోజు తక్కువ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమా ఇదే. దాంతో నాలో ఓ సంఘర్షణ మొదలైంది. మొదటిరోజు హైదరాబాద్ మెయిన్ థియేటర్‌లో సినిమా చూడటానికి వెళ్లాను. విరామం మధ్యలో బయటకు వచ్చి మెట్లపై నిల్చుని ఆలోచిస్తుంటే ఎన్నో ప్రశ్నలు చుట్టుముట్టాయి. ఎందుకిలా జరిగింది? చిన్న సినిమాల్ని జనాలు చూడరా? నాలాంటి నిర్మాత సినిమా తీస్తేనే జనాలు థియేటర్లకు రాలేదంటే, ఇక మామూలు నిర్మాతల పరిస్థితి ఏమిటి? చిన్న సినిమా తీయడం తప్పా? ఇక భవిష్యత్తులో తీయకూడదా? అన్న ప్రశ్నలు వెంటాడాయి. సినిమా చూసి బయటకు వచ్చిన వారు మాత్రం బాగుందని ప్రశంసించారు. అదే రోజు మధ్యాహ్నం వైజాగ్ నుంచి మా మేనేజర్ ఫోన్ చేసి సార్...మార్నింగ్ షో డల్‌గా వున్నా, మ్యాట్నీకి హౌస్‌ఫుల్ అయిపోయింది అని చెప్పాడు. దాంతో టెన్షన్ నుంచి రిలీఫ్ లభించినైట్లెంది. మార్నింగ్ షోతోనే సినిమా ప్రేక్షకులకు రీచ్ అయింది. తప్పకుండా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఏర్పడింది. 

అంతా కొత్తవాళ్లతో సినిమా తీయాలనుకున్నప్పుడు రిస్క్ చేస్తున్నానేమో అనిపించలేదా?

సినిమా అంటేనే తప్పకుండా రిస్క్ వుంటుంది. కేరింత సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ కాలేజీలో జరిగిన కార్యక్రమానికి దేవీశ్రీప్రసాద్ అతిథిగా వచ్చాడు. ఈ సినిమాకోసం నేను పడ్డ ఇబ్బందుల్ని దేవీతో చెప్పగానే సార్..మీరు చిన్న సినిమాలు తీయడం మానేస్తానంటే ఎలా? ఆర్య సినిమా తీసినప్పుడు అల్లు అర్జున్, సుకుమార్‌లకు పెద్ద పేరేంలేదు కదా? బొమ్మరిల్లు టైంలో హీరో సిద్ధార్థ్, దర్శకుడు భాస్కర్ ఎంతమందికి తెలుసు. కథను నమ్మి ఆ సినిమాలు తీయడం వల్లే మాలాంటి వాళ్లం పైకొచ్చాం. ఓపెనింగ్స్ లేవని బాధపడొద్దు. మీరు మంచి సినిమా తీశారు. తప్పకుండా సక్సెస్ అవుతుంది అని నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేశాడు. దేవీశ్రీప్రసాద్ మాటలతో కేరింత సినిమాపై నేను పెట్టుకున్న అపోహలన్ని తొలగిపోయాయి.

స్టార్‌హీరోలతో మీరు తీసిన కమర్షియల్ సినిమాల విజయాలకు, కేరింత విజయానికున్న తేడా ఏమిటి?

కేరింత అనేది దిల్‌రాజు ఫిల్మ్. ఎందుకంటే అప్‌కమింగ్ దర్శకుణ్ణి పెట్టుకొని కొత్తవాళ్లతో ఈ సినిమా తీశాను. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని స్వయంగా పర్యవేక్షించాను. అందుకే ఈ సినిమా విజయం నాకు ప్రత్యేకమైనది. చిన్న, పెద్దా అనే తేడాలేకుండా ఏ సినిమా తీసినా నేను సక్సెస్ గురించే ఆలోచిస్తాను. అయితే కేరింతలాంటి చిన్న సినిమా సక్సెస్‌కావడం నిర్మాతలోని కాన్ఫిడెంట్‌ను పెంచుతుంది. స్క్రిప్ట్‌మీద శ్రద్ధ పెడితే మంచి సినిమాలు తీయొచ్చనే విశ్వాసాన్ని కలిగిస్తుంది.

గతంలో వరుసగా స్టార్‌హీరోలతో సినిమాలు చేసిన మీరు కొత్తవాళ్లతో కేరింత సినిమా తీయడానికి ప్రత్యేకమైన కారణాలున్నాయా?

దిల్ నుంచి కొత్త బంగారులోకం వరకు నేను అప్‌కమింగ్ హీరోలతోనే సినిమాలు చేశాను. ఆ తర్వాత నా దృక్పథంలో మార్పు వచ్చింది. స్టార్స్‌తో సినిమాలు తీయడం మొదలుపెట్టాను. మిస్టర్ పర్‌ఫెక్ట్ బృందావనం రామయ్య వస్తావయ్యా సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు ఎవడు సినిమాలన్నింటినీ పెద్ద స్టార్స్‌తో చేశాను. వరుసగా పెద్ద సినిమాలే చేస్తుండటం వల్ల ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తే బాగుంటుందనిపించింది. అందులో భాగంగానే కేరింత తీశాను. 

తెలుగు చిత్రసీమలో అగ్రనిర్మాతగా కొనసాగుతున్న మీరు కేరింత సినిమా విషయంలో ఇబ్బందులు పడ్డానని చెప్పారు. మరి ఇండస్ట్రీలోని మామూలు నిర్మాతల పరిస్థితి ఎలా వుందనుకోవచ్చు?

మామూలు నిర్మాత చిన్న సినిమా తీస్తే ఆడదు. ఇది నా స్టేట్‌మెంట్. కథ బాగున్నా ప్రేక్షకుల్ని థియేటర్ వద్దకు రప్పించగలిగినప్పుడే ఏ సినిమా అయినా ఆడుతుంది. కేరింత సినిమా కథ బాగుంది. ప్రతి విషయాన్ని ప్లానింగ్ ప్రకారం చేశాను. అయినా నాకు ఇబ్బందులు తప్పలేదు. కొత్త నిర్మాతలు సినిమాలు తీయొద్దని నేను చెప్పడం లేదు. ఎవరైనా సినిమా తీసే ముందు యాభై రూపాయలు పెట్టి ఫ్యామిలీతో కలిసి నేను ఈ సినిమా చూడగలనా? ఇందులో యాభై రూపాయలు వెచ్చించడానికి ఏముంది? అని ఆత్మవిమర్శ చేసుకోవాలి. సామాన్యప్రేక్షకుల ధృక్కోణం నుంచి ఆలోచించి సినిమాలు తీయాలి. చిత్ర నిర్మాణానికి సంబంధించిన ప్రతి విషయంలో అవగాహన, స్పష్టత వుండాలి. అప్పుడే ఎవరైనా మంచి సినిమాలు తీయొచ్చు.

డబ్బులిచ్చి జబ్బులు కొనుక్కునేలా నేడు నిర్మాతల పరిస్థితి తయారైందంటున్నారు. అందుకు ఎవరు కారణమనుకుంటున్నారు?

హండ్రెడ్ పర్సెంట్ దానికి కారణం నిర్మాతలే. కొందరు నిర్మాతలు కాంబినేషన్‌లను నమ్ముకొని సినిమాలు తీస్తారు. పెద్ద హీరోతో సినిమా అనగానే ఎక్సైట్‌మెంట్‌లో ప్రాజెక్ట్ కుదుర్చుకుంటారు. కానీ సినిమా నిర్మాణంలో, విడుదలయ్యే ముందు వచ్చే సమస్యల గురించి ఏ మాత్రం ఆలోచించరు. కాంబినేషన్ సెట్ చేసుకోగానే సరిపోదు. అనుకున్నవి సక్రమంగా జరగక పోతే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో అంచనా వేయగలగాలి. సినిమా విడుదలయ్యేలోపు ఎలాంటి పరిస్థితైనా ఎదురుకావొచ్చు. అది మన చేతిలో వుండదు. ఇక కొందరు నిర్మాతలు తాము పాషన్‌తో సినీరంగంలోకి వస్తున్నామని చెబుతారు. రెండుకోట్లు పోతేపోనీ..సినిమా మాత్రం తీయాలి అనే ధీమాతో నిర్మాతలుగా మారేవారు చాలామంది వున్నారు. డబ్బులు పోగొట్టుకోవడానికి సినిమా ఎందుకు తీయాలి? ఇలాంటి ఆలోచనా ధోరణి కలిగిన నిర్మాతల వల్లే మంచి సినిమాలు రావడం లేదు. 

చిత్ర నిర్మాణంలో సుదీర్ఘ అనుభవమున్న మీరు కొన్ని పెద్ద చిత్రాల విషయంలో ఒత్తిడికి లోనయ్యారని చెబుతారు?

పెద్ద సినిమా తీసేటప్పుడు ప్రతి ఒక్క నిర్మాతపై ఒత్తిడి వుంటుంది. పెద్ద ప్రాజెక్ట్ నిర్మాణంలో ఒక్క నెల ఆలస్యం జరిగినా ఆ చిత్ర నిర్మాతకు యాభైలక్షల వడ్డీ భారం పడుతుంది. గతంలో మా సంస్థ తీసిన కొన్ని చిత్రాలు నిర్మాణంలో ఆలస్యమవడం వల్ల నాలుగైదుకోట్లు నష్టపోవాల్సి వచ్చింది. దాంతో తప్పేమిటో తెలుసుకున్నాను. ఆ అనుభవాలతో ప్రస్తుతం నిర్మాణంలో వున్న సినిమాల విషయంలో పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాను.

సీనియర్ నిర్మాతగా కథాంశాల ఎంపికలో మీరు ఏ అంశాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు?

వినోదం కోసమే ప్రేక్షకులు సినిమాలు చూస్తారు. దైనందిన జీవితంలోని సమస్యల్ని మర్చిపోయి హాయిగా నవ్వుకుందామని సినిమాకొస్తాడు. అయితే నా దృష్టిలో ఒక్క వినోదం మాత్రమే సరిపోదు. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు హృదయాల్ని కదిలించే సన్నివేశాలుండాలి. అవి కథలో అంతర్భాగంగా వుండాలి. అలాంటి చిత్రాలే ప్రేక్షకాదరణ పొందుతాయి.

ఇటీవల పరిశ్రమలోని నిర్మాతలు కొందరు కలిసి సిండికేట్‌గా ఏర్పడ్డారు. వ్యయాల్ని అదుపులో వుంచుకునే భాగంలో పబ్లిసిటీపై కూడా పరిమితులు విధించారు. ఆ నిర్మాతల సిండికేట్‌లో మీరు ఒక సభ్యులుగా వున్నారు. సిండికేట్‌గా ఏర్పడడానికి ప్రధాన ఉద్ధేశ్యమేమిటి?

రెగ్యులర్‌గా సినిమాలు తీసే నిర్మాతలకే పరిశ్రమలోని కష్టాలు ఏమిటో తెలుస్తాయి. ఎప్పుడో ఒక సినిమా తీసే వాళ్లకు ఇబ్బందులు తెలియవు. ప్రస్తుతం ఒక సినిమా పబ్లిసిటీకి రెండుకోట్లు ఖర్చుచేయాల్సి వస్తోంది. నాలుగేళ్ల కిత్రం ఈ పరిస్థితి లేదు. అప్పుడు కౌన్సిల్ ద్వారా రెండు, మూడు ఛానళ్లకు మాత్రమే పబ్లిసిటీ ఇచ్చేవాళ్లం. 40లక్షల్లో పబ్లిసిటీ మొత్తం పూర్తయ్యేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పబ్లిసిటీకి కోటిన్నర అదనపు భారాన్ని మోయాల్సివస్తోంది. సినిమా విడుదలయ్యే సమయానికి నిర్మాతలు ఆర్థిక ఇబ్బందుల్లో వుంటున్నారు. ఆ సమయంలో పబ్లిసిటీకి వెచ్చించే డబ్బులు వారికి భారంగా మారుతున్నాయి. ఇలాంటి అనవసరపు వ్యయాల్ని తగ్గించుకొని సినిమా నిర్మాణాన్ని, విడుదలను సరళం చేసుకోవాలనే ఉద్ధేశ్యంతో రెగ్యులర్‌గా సినిమాలు తీసే కొంతమంది నిర్మాతలు కలిసి సిండికేట్‌గా ఏర్పడ్డాం. ఒక్క పబ్లిసిటీ విషయం మాత్రమే కాదు...నిర్మాణపరమైన ఇబ్బందుల్ని పరిష్కరించుకోవడం, విడుదల తేదీల విషయంలో పరస్పరం సమన్వయంతో సహకరించుకోవడం...ఇలా పలు అంశాల ప్రాతిపదికన సిండికేట్ ఏర్పడింది. తక్కువ డబ్బు ఖర్చుపెట్టి ఎక్కువ మందికి చేరువకావాలనే ఉద్ధేశ్యంతోనే పబ్లిసిటీ విషయంలో పరిమితుల్ని పాటిస్తున్నాం. అంతేకాని ఈ సిండికేట్ ఏ మీడియా సంస్థకు వ్యతిరేకం కాదు. మాకు ఎవరిమీద వివక్ష లేదు. త్వరలో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసి మా ఉద్ధేశ్యాల్ని స్పష్టం చేస్తాం. అపోహల్ని తొలగించే ప్రయత్నం చేస్తాం.

నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవాలంటే స్టార్ హీరోల, దర్శకుల పారితోషికాలపై దృష్టిపెట్టవచ్చు కదా? ఈ రోజు సినిమా బడ్జెట్‌లో సగభాగం వారి పారితోషికాలకే వెళ్తుందనే విమర్శలొస్తున్నాయి?

స్టార్‌హీరోల, డైరెక్టర్ల రెమ్యునరేషన్‌ను కంట్రోల్ చేసే దమ్ము ఏ నిర్మాతకు లేదు. ఈ విషయంలో నిర్మాతలదే తప్పని నా అభిప్రాయం. కాంబినేషన్ కుదరగానే భారీ పారితోషికాల్ని ఆఫర్ చేస్తున్నారు. కానీ ఆ సినిమా పూర్తయి, విడుదలయ్యే ముందు వచ్చే సమస్యల గురించి ఎవరూ ఆలోచించడం లేదు. ఇటీవలకాలంలో ఎన్నో పెద్ద చిత్రాలు విడుదలలో ఇబ్బందుల్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. రెండు సినిమాల్ని నేనే దగ్గరుండి విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 

బాహుబలి చిత్రాన్ని నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దాదాపు 100కోట్లకు పైగా బడ్జెట్‌తో ఆ సినిమా తీశారు. తెలుగు సినిమా మార్కెట్‌కు అంత మొత్తాన్ని తిరిగి రాబట్టుకునే సత్తా వుందనుకుంటున్నారా?

బాహుబలి స్పెషల్ మూవీ. దానికి హద్దులు లేవు. మగధీర సినిమా మాదిరిగా తొలిరోజే హిట్ టాక్ సొంతం చేసుకుంటే మనం ఆశ్చర్యపోయే కలెక్షన్స్ వస్తాయి. అందరికి తెలియని విషయం ఏమిటంటే...మన జనాభాలో థియేటర్‌కు వచ్చి సినిమా చూసేవాళ్లు 12 నుంచి 18శాతం మధ్యలో వుంటారు. వీరిలో ఐదుశాతం పెరిగినా లెక్కలన్నీ మారిపోతాయి. బాహుబలిలాంటి సినిమా వచ్చినప్పుడు మ్యాజిక్‌లు జరుగుతాయి. మగధీరకు వచ్చినట్లు మార్నింగ్‌షోతోనే హిట్ టాక్ వస్తే బాహుబలి చరిత్ర సృష్టిస్తుంది.

కొందరు నిర్మాతలు ఎక్కువ సెంటర్లలో తమ సినిమాల్ని విడుదల చేసుకోవాలని తాపత్రయ పడుతున్నారు. ప్రేక్షకులకు రీచ్ అయ్యే కంటెంట్ సినిమాలో లేనప్పుడు ఎన్ని థియేటర్లలో విడుదల చేసినా ప్రయోజనం వుండదు. బిజినెస్‌కంటే ఎక్కువగా సినిమాను ప్రేమించి, నిర్మాణ వ్యవహారాల పట్ల సమగ్రమైన అవగాహన వున్న వారే మంచి సినిమాల్ని అందించగలుగుతారు.

LED


ఇప్పుడు వెళ్తున్న ఏ విధానంలో నిర్మాత డబ్బు సంపాదించే ఛాన్సే లేదు. ఈ విషయాన్ని నేను రాసిస్తాను. నిర్మాతలు తాము చేస్తున్నది తప్పని మనస్ఫూర్తిగా తెలుసుకొని రియలైజ్ అయిన రోజున పరిశ్రమలో మార్పు వస్తుంది. సినిమా కోసం ఎంత ఖర్చు పెడుతున్నాం? ఎంత లాభాలు వచ్చాయి? అనేది నిర్మాతల మనస్సాక్షికే తెలుస్తుంది. పెద్ద హీరోలు, డైరెక్టర్లతో సినిమాలు చేయడం తప్పు కాదు. కానీ ఆ సినిమాల్ని ఓ ప్రణాళిక ప్రకారం ఎగ్జిక్యూట్ చేయాలి. పెద్ద హీరో సినిమాకు ఎంత ఖర్చు పెడుతున్నాం? విడుదలైన తర్వాత నిర్మాతకు ఎంత మిగులుతుంది? అనే వాటిపై అవగాహన వుండాలి.

చాలా మంది సేఫ్ అయితే చాలు సినిమాలు తీస్తామంటున్నారు. అసలు సేఫవడమేంటి? నిర్మాతకు ఎంతో కొంత మిగిలితేనే కదా మరో సినిమా తీయగలుగుతాడు. ఇలాంటి విషయాల్ని ఆలోచించి చిత్ర నిర్మాణంలోకి రావాలి.
అందరికి తెలియని విషయం ఏమిటంటే...మన జనాభాలో థియేటర్‌కు వచ్చి సినిమా చూసేవాళ్లు 12 నుంచి 18శాతం మధ్యలో వుంటారు. వీరిలో ఐదుశాతం పెరిగినా కలెక్షన్స్ లెక్కలన్నీ మారిపోతాయి.
Key Tags
Producer Dil raju ,youthful movie Kerintha, loss of producer, film industry, Allu Arjun , Sukumar ,

COMMENTS

పేరు

Adilabad AUDIO RELEASES ENTERTAINMENT GOSSIPS Health HYDERABAD INTERNATIONAL Job Search Jobs KARIMNAGAR KHAMMAM MAHABOOBNAGAR MEDAK MOVIE REVEWS NALGONDA NATIONAL NIZAMABAD Rangareddy SINGARENI NEWS TECHNOLOGY TELANGANA NEWS VIDEO SONGS WARANGAL worldcup2015
false
ltr
item
Tdaily.In - Telangana News: డబ్బులు పోగొట్టుకోవడానికి సినిమాలు ఎందుకు తీయాలి?
డబ్బులు పోగొట్టుకోవడానికి సినిమాలు ఎందుకు తీయాలి?
http://namasthetelangaana.com/updates/2015/june/24/dilraju.jpg
Tdaily.In - Telangana News
https://telugunewvideos.blogspot.com/2015/06/blog-post_8.html
https://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/2015/06/blog-post_8.html
true
2091677902228022841
UTF-8
Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS CONTENT IS PREMIUM Please share to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy