(26 Jun) యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఉదయం 4 గంటలకే పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. 4 గంటలకు సుప్రభాతం, 4.30గంటలకు తిరు...
(26 Jun) యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఉదయం 4 గంటలకే పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. 4 గంటలకు సుప్రభాతం, 4.30గంటలకు తిరువారాధన, 5గంటలకు బాలభోగం, 5.30గంటలకు గర్భాలయంలోని మూలవర్యులకు నిజాభిషేకం, ఉదయం 6.15గంటలకు తులసీఅర్చన, 7గంటల నుంచి ఉభయ దర్శనాలు మొదలవుతాయి. 8.30గంటలకు నిత్యకల్యాణం, మధ్యాహ్నం 12గంటలకు నివేదన, సాయంత్రం 5గంటలకు నిత్యాలంకర తిరువీధి సేవ, రాత్రి 7 గంటలకు ఆరాధన, 7.30గంటలకు తులసీకుంకుమార్చనలు, ఆంజనేయస్వామి వారికి సహస్రనామార్చనలు, 9గంటలకు ఆరగింపు, 9.45 గంటలకు శయనోత్సవం జరుగుతాయి. కొండపైన గల శ్రీ పర్వతవర్థినీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉదయం 5గంటలకు నుంచి రాత్రి 8గంటలకు వరకు పూజలు కొనసాగుతాయి. పాతగుట్ట గుడిలో... పాతగుట్ట ఆలయంలో నిత్యపూజలు యధావిధిగా కొనసాగుతాయి. ఉదయం 5గంటలకు సుప్రభాతం, 5.45గంటలకు బిందె తీర్థం, 6.15 గంటలకు ఆరాధన, ఉదయం 7గంటల నుంచి 8గంటల వరకు దైవదర్శనాలు, 8గంటలకు అభిషేకం, 8.30 గంటలకు అర్చన, మధ్యాహ్నం 12గంటలకు ఆరగింపు, ఉదయం 9.30గంటలకు, 11గంటలకు, సాయంత్రం 4.30 గంటలకు శ్రీ సత్యనారాయణస్వా మి వ్రతాలు కొనసాగుతాయి. సాయంత్రం 5.30 గంటలకు అలంకార సేవలు, రాత్రి 7.30 గంటలకు నివేదన, 8గంటలకు ఆలయ బంధనం జరుగుతుంది.