(26 Jun) చిల్డ్రన్స్ ఆర్ కలర్‌ఫుల్. అందుకే వారంటే నాకెంతో ఇష్టం అని అన్నారు సినీ నటుడు మహేష్‌బాబు. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు...
(26 Jun) చిల్డ్రన్స్ ఆర్ కలర్‌ఫుల్. అందుకే వారంటే నాకెంతో ఇష్టం అని అన్నారు సినీ నటుడు మహేష్‌బాబు. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు ప్రచారకర్తగా నియమితులయ్యారాయన. ఈ విషయాన్ని తెలియ జేయటానికి బంజారాహిల్స్‌లోని ఓ హోటల్లో గురువారం ఏర్పాటుచేసిన సమావేశంలో రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ చైర్మన్ రమేష్ కంచర్ల, డైరెక్టర్ దినేష్‌కుమార్ చీర్లతో కలిసి పాల్గొన్నారాయన. ఈ సందర్భంగా మహి మాట్లాడుతూ 'రెయిన్బో హాస్పిటల్‌తో నా ప్రయాణం 8 సంవత్సరాల క్రితం ప్రారంభమయింది. మా అబ్బాయి గౌతమ్ నెలలు నిండకుండానే జన్మించాడు. అప్పుడు రెయిన్బో హాస్పిటల్‌లోని డాక్టర్లు చూపిన శ్రద్ధ నన్నెంతగానో ఆకట్టుకుంది. వారి ఇన్వాల్వ్మెంట్ ఎమేజింగ్. నా ఉద్దేశ్యంలో అత్యుత్తమ చిన్నపిల్లల హాస్పిటల్ ఇది' అని అన్నారు. తన కుమార్తె కూడా ఈ హాస్పిటల్లోనే పుట్టిందన్న ఆయన ఈ హాస్పిటల్‌తో తన అనుబంధం కంటిన్యూ అవుతూనే ఉందన్నారు. ఇతరుల జీవితాలపై ప్రభావం చూపించే సత్తా స్టార్లకి ఉందని తాను నమ్ముతున్నానన్న మహేష్, ఇటీవల తన జీవితంలో ఎదుర్కొన్న ఓ సంఘటనని ఉదహరించారు. 8 ఏళ్ల అబ్బాయికి జబ్బు చేసి రెయిన్బో హాస్పిటల్లోనే చికిత్స చేయించు కుంటుండగా డా.దినేష్ నన్ను పిలిచి, మీ అభిమాని అయిన ఓ అబ్బాయికి కాస్త క్రిటికల్ కండీషన్. మీరు ఓసారి అతనితో మాట్లాడితే ఛేంజ్ రావొచ్చన్నారు. దీంతో నేను ఆ అబ్బాయిని కలిశాను. చాలా త్వరగా రికవర్ అయ్యాడాబ్బాయి. స్టార్లప్రభావం ఉంటుందని నాకు గట్టిగా నమ్మకం కలిగిన సంఘటన అది అని అన్నారు. ఈ క్రమంలోనే ఓ డాక్టర్ అడిగిన ప్రశ్నకి స్పందిస్తూ తండ్రిగా గౌతమ్‌ని చూసిన ప్పుడు పొందిన అనుభూతులను మాటల్లో వర్ణించలేనని, అది ఓ తండ్రికి మాత్రమే తెలుస్తుం దన్నారు. రోడ్డు ప్రమాదాల పట్ల అవగాహన కలిగించ డానికి తన వంతు ప్రయత్నం చేయడానికి తాను సిద్ధమేనని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో భాగంగా దీపాంజలి నృత్య కళాశాల విద్యార్థులు చేసిన నృత్యాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.