లండన్, జూన్ 22: బ్రిటన్ కొత్త ఇమ్మిగ్రేషన్ చట్టం భారతీయ నర్సులకు కష్టాలు తెచ్చిపెట్టింది. ఈ చట్టం వల్ల బ్రిటన్ జాతీయ ఆరోగ్య సేవల పథకం ...
లండన్, జూన్ 22: బ్రిటన్ కొత్త ఇమ్మిగ్రేషన్ చట్టం భారతీయ నర్సులకు కష్టాలు తెచ్చిపెట్టింది. ఈ చట్టం వల్ల బ్రిటన్ జాతీయ ఆరోగ్య సేవల పథకం (ఎన్హెచ్ఎస్) కింద పని చేస్తున్న భారత్, యూరప్యేతర దేశాలకు చెందిన 30 వేల మందికి పైగా నర్సులు వారి స్వదేశాలకు తరలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. నర్సులు వేతనాలు పెంచాలని డిమాండ్ చేయడంతో విదేశీ నర్సుల నియామకంపై కఠిన చట్టం తేవాలని ప్రభుత్వం భావిస్తున్నదని యూకే రాయల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ జనరల్ సెక్రటరీ పీటర్ కార్టర్ తెలిపారు. ఈ చట్టం 2017 నుంచి అమలులోకి రానున్నది.
