(28 Jun) వేర్వేరు హత్యకేసుల్లో నిందితుల అరెస్ట సజావుగా సాగుతున్న కాపురాల్లో వివాహేతర సంబంధాలు చిచ్చు రేపాయి. చివరకు ప్రాణాలు తీసేలా చేశాయి...
(28 Jun) వేర్వేరు హత్యకేసుల్లో నిందితుల అరెస్ట సజావుగా సాగుతున్న కాపురాల్లో వివాహేతర సంబంధాలు చిచ్చు రేపాయి. చివరకు ప్రాణాలు తీసేలా చేశాయి. భార్య ప్రవర్తన సరిగా లేదని భర్త మట్టుబెట్టాడు. మరో చోట తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని మిత్రుడిని కడతేర్చారు. రెండు కేసుల్లో నలుగురు వ్యక్తులు జైలు పాలయ్యారు. ఎమ్మిగనూరు, మంత్రాలయం మండలాల్లో వేర్వురు ప్రాంతాల్లో జరిగిన రెండు హత్యలకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసుల విచారణలో నిర్ధారణ అయింది. నిందితులను శనివారం అరెస్ట్ చేసి కేసుల వివరాలను డీఎస్పీ బీఆర్ శ్రీనివాసులు వివరించారు. - ఎమ్మిగనూరు రూరల్ భార్యను చంపేశాడు మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామంలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మహిళ కేసు మిస్టరీ వీడింది. వేరే వ్యక్తితో తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానంతో హత్య చేసిన భర్త, అందుకు సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం స్థానిక సీఐ కార్యాలయంలో కేసు వివరాలను డీఎస్పీ వివరించారు. గ్రామానికి చెందిన బోయ హనుమంతుకు పెద్దకడుబూరు మండలం హెచ్. మురవణి గ్రామానికి చెందిన శంకరమ్మతో పదకొండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు, కుమారుడు. అదే గ్రామానికి చెందిన బోయ రామలింగడి, శంకరమ్మ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. భార్యను హనుమంతు చాలా సార్లు మందలించినా ప్రవర్తన మార్చుకోలేదు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రరి 2వ తేదీన భార్యతో హనుమంతు గొడవపడ్డాడు. అదే రోజు తన అన్న కుమారుడు రవిచంద్ర సహయంతో హనుమతు తన భార్యను గొంతు నలిపి హత్య చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని బావిలో పడేసి ఆత్మహత్యకు పాల్పడినట్లు నమ్మించే ప్రయత్నం చేశారు. పోలీసుల విచారణలో హత్యకు పాల్పడింది తామేనని నిందితులు ఒప్పుకోవడంతో అరెస్ట్ చేశారు. సమావేశంలో ఎమ్మిగనూరు, మంత్రాలయం సీఐలు శ్రీనివాసమూర్తి, నాగేశ్వరరావు, రూరల్ ఎస్ఐ వేణుగోపాల్, సిబ్బంది పాల్గొన్నారు. బంధం చెదిరింది ఎమ్మిగనూరు మండలం సిరాలదొడ్డి గ్రామంలో మూడు రోజుల క్రితం చిన్న హనుమంతు హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. భీమన్నస్వామి, చిన్నహనుమంతు స్వలింగ సంపర్కులు. ఈ విషయం తెలిసి హనుమంతు భార్య సరోజ భర్తను మందలించింది. అప్పటి నుంచి హనుమంతు దూరంగా ఉండటంతో భీమన్నస్వామి మనస్తాపం చెంది గతంలో పురుగుల మందుతాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. కొన్నాళ్ల తర్వాత మళ్లీ వారి బంధాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో భీమన్న స్వామి భార్య, చిన్న హనుమంతు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. కొన్ని నెలల క్రితం ఆమెకు మగ శిశువు చిన్న హనుమంతు పోలికలతో జన్మించాడు. దీంతో భీమన్న స్వామి తన మిత్రుడిపై కక్ష పెంచుకుని హత్యకు కుట్ర పన్నాడు. మరో మిత్రుడు రామలింగడు సహాయంతో ఈ నెల 23వ తేదీన గ్రామం బయట ఉన్న ఎల్లమ్మ దేవాయలం వద్ద చిన్నహనుమంతు వరిభీజాలపై కొట్టి హత్య చేశారు. గ్రామస్తులు నిందితులకు దేహశుద్ధి చేసి పోలీసులకు పట్టించారు. పోలీసుల విచారణలో భీమన్నస్వామి, రామలింగడు తామే హత్య చేసినట్లు ఒప్పుకోవటంతో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు.