జంగోనిగూడలో మాయరోగం కాదు.. వాస్తవాలను వక్రీకరిస్తూ కల్లు వ్యాపారుల నాటకం పాలమూరు పొలిమేరల్లో పక్కజిల్లా కాంట్రాక్టర్ కల్లు దందా కప...
జంగోనిగూడలో మాయరోగం కాదు..
వాస్తవాలను వక్రీకరిస్తూ కల్లు వ్యాపారుల నాటకం
పాలమూరు పొలిమేరల్లో పక్కజిల్లా కాంట్రాక్టర్ కల్లు దందా
కప్పి పుచ్చుకునేందుకే కట్టుకథల అల్లికలు
జంగోనిగూడ మాయరోగ మరణాలపై అసలు సిత్రాలు
గత పది రోజులుగా సంభవిస్తున్న ఆకస్మిక మరణాలపై వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ నెల 18వ తేదీ నుండి నేటి వరకు ఆకస్మికంగా మృతి చెందిన గ్రామస్థులు జంగశివమ్మ, లక్ష్మమ్మ, జంగమ్మ, జంగ నారాయణ, బారతమ్మ, సాయిలు వ్యవహారంలో గ్రామంలో తీవ్ర అపోహలు నెలకొన్నాయి. గ్రామానికి దెయ్యం పట్టిందని మూఢ నమ్మకాల ముసుగులో వారం రోజులకు పైగా గ్రామీ ణులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీశారు. ఈ మొత్తం తతంగం వెనుక అసలు సూత్రదారులు కల్లు వ్యాపారులే అని తేటతెల్లమవు తుంది.
వాస్తవం తెలిస్తే ఎక్కడ ఇరుక్కుంటామోనన్న భయంతో కొంత మంది గ్రామస్థుల సహకారంతో లేనిపోని అపోహలు సృష్టించి ప్రజలను మూడ నమ్మకాల వైపు మళ్ళించి గ్రామంలో మృతి చెందిన వ్యక్తుల వ్యవహారంలో పెద్ద నాటకమే ఆడారు. వాస్తవానికి గ్రామంలో కల్లు వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా చలామని అవు తుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లికి చెందిన కొందరు కల్లు కాంట్రాక్టర్లు కొత్తూర్, నందిగామ తదితర ప్రాంతాల్లో కల్లు అమ్ముకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగానే జంగోనిగూడెంలో కూడా సంబందిత కల్లు వ్యాపారులు లైసెన్స్‌లేని కల్లు దుకాణాన్ని నిర్వహిస్తున్నారు.
గత కొంత కాలంగా కల్లులో రసాయనాలు అత్యధికంగా వాడుతుండటం ముఖ్యంగా కృత్రిమ కల్లుతో దందా చేస్తుండటం పరిపాటిగా మారింది. గత పది రోజులుగా కల్లు సేవిస్తున్న వారిలో వయస్సుపైబడ్డ వారు ఈ కల్లును త్రాగి చనిపోతున్నట్లు ఆనోటా.. ఈ నోటా రహస్యం బయటికి వస్తుంది. కల్లు వ్యాపారుల తతంగం ఎక్కడ భయటపడుతుందోనని ముందుగానే గ్రామంలో అలజడి సృష్టించారు. కృత్రిమ కల్లును సేవిస్తున్న వారు ఆక స్మిక మరణాలకు గురయ్యారు. ఈ కల్తీ కల్లును సేవిస్తూ చాలా మంది ఒక్కరోజు తాగకపోతే పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తుండే వారని తెలిసింది.
అసలేంజరిగిందంటే.. ?
ఈ నెల 18వ తేది నుండి గ్రామంలో సంభవించిన మరణాల వెనుక అసలు కథను పరిశీలిస్తే గ్రామంలో ఒక ఇంటి ముందు బహిరంగంగా కల్లు వ్యాపారం నిర్వహిస్తున్నారు. ముందుగా ఆ గ్రామంలో జంగ శివమ్మ అనే వృద్ద మహిళ కల్లు సేవించిన అనంతరం ఇంటికి వచ్చి భోజనం చేస్తూ మరణించింది. కల్లులో మత్తు పదార్థాలు ఎక్కువ కావడం వాటిని భరించలేని స్థితిలో అన్నంతింటూ గొంతులో ఇరుక్కొని చనిపోయింది. అచ్చం ఇలాగే భారతమ్మ, జంగమ్మ, లక్ష్మమ్మ, జంగ నారా యణలు మరణించారు. ఇక చివరగా సాయిలు పరిస్థితిని పరిశీ లిస్తే గతకొంత కాలంగా సాయిలు క్యాన్సర్‌తో భాదపడుతున్నట్లు తెలిసింది. సాయిలును చికిత్స నిమిత్తం హైద్రాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆయన మరణించారు. అయితే వీరి