సికింద్రాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు పార్సీగుట్టకు యూనిట్‌కు వెళ్లనున్నారు. గత నెల నిర్వహించిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో ఆయన పార్స...
సికింద్రాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు పార్సీగుట్టకు యూనిట్‌కు వెళ్లనున్నారు. గత నెల నిర్వహించిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో ఆయన పార్సీగుట్ట యూనిట్‌కు ఇన్‌చార్జీగా ఉన్న విషయం తెలిసిందే. అప్పుడు సీఎం అక్కడి ప్రజలతో సమావేశమై సమస్యలు తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం పూర్తయి నెల రోజులవుతున్న సందర్భంగా పనుల పురగతిని పరిశీలించడానికి ఆయన మళ్లీ పార్సీగుట్టకు వెళ్తున్నారు. మధురానగర్‌లోని రాఘవ గార్డెన్లో ఉదయం 11గంటలకు ప్రజలతో సమావేశం కానున్నారు. సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా నాలా పరివాహక ప్రాంత ప్రజలతో సమావేశమై వారికి డబుల్‌బెడ్ రూం ఇళ్ల విషయమై చర్చించనున్నట్లు సమాచారం.