మహబూబ్నగర్: ధన్వాడ మండలంలో మధ్యాహ్న భోజనం ఎజెన్సీలు ఆడిందే ఆట పాడిందే పాటగా కోనసాగుతున్న అధికారుల నిర్లక్షం కారణంగా ప్రభుత్వం విద్యార్థు...
మహబూబ్నగర్: ధన్వాడ మండలంలో మధ్యాహ్న భోజనం ఎజెన్సీలు ఆడిందే ఆట పాడిందే పాటగా కోనసాగుతున్న అధికారుల నిర్లక్షం కారణంగా ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న భోజనం పథకం నీరుగారిపోతుంది. సోమవారం ధన్వాడ లో ప్రభుత్వ పాఠశాలలో ఎజెన్సీల నిర్లక్షం కారణంతో విద్యార్ధులకు కారం పోడితో భోజనం వడ్డించారు. గతంలో కూడా ఇలాగే చెయ్యడంతో అధికారుల అండలతో వారు విద్యార్థులతో చెలగాటం ఆడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు సన్నబువ్వ పెట్టి వారికి రోజు మెను ప్రకారం కూరగాయలు చెసి పెట్టాలి కాని ఎక్కడ కూడా మెను ప్రకారం విద్యార్థులకు భోజనం అందివ్వడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అధికారులు ఎజెన్సీలను మార్చకుండా పాత వారితో పాఠశాలల ఉపాధ్యాయులు, అధికారులు కుమ్ముకై విద్యార్థుల కడుపు మాడుస్తున్నారు. గతంలో సన్నబియ్యం బదులు విద్యార్ధులకు దోడ్డు బియ్యం పెట్టారని, పాఠశాలల్లో విద్యార్థులకు కూరగాయలు పెట్టకుండా కారం పోడి తో భోజనం పెట్టడంతో అందుకు ఆగ్రహించిన విద్యార్థులు సోమవారం ధన్వాడ ్రప్రధాన రాహదారిపై గంట పాటు రాస్తారోకో కార్యక్రమన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మట్లాడుతూ అధికారుల నిర్లక్షం కారణంగా సగం కడుపుకు అన్నం తింటున్నమని మెను ప్రకారం కురగాయలు వండడం లేదని ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోకపోవడంతో రాస్తారోకో చెస్తున్నమని విద్యార్థులు కంటనీరు పెట్టారు. రాస్తారోకో చెయ్యడం వలన ప్రయణికులకు ఇబ్బందులు కలగడంతో పోలీసులు చోరువ తీసుకోని రాస్తారోకోను విరమింప చేశారు.