-సీఎం కేసీఆర్ ముక్కుసూటి తనానికి తలవంచుతున్నా -ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు తీరుపై మండిపాటు -ట్విట్టర్లో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్...
-ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు తీరుపై మండిపాటు
-ట్విట్టర్లో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌వర్మ సంచలన వ్యాఖ్యలు
ముంబై, జూన్ 16: ఓటుకు నోటు కుంభకోణంలో ఏపీ సీఎం చంద్రబాబు తీరుతో తాను ఆంధ్రా పౌరుడినని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నానని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమకాలీన పరిస్థితులపై సందర్భోచితంగా సోషల్ మీడియాలో కుండబద్దలు కొట్టే వర్మ తాజాగా ట్విట్టర్లో చంద్రబాబుపై విమర్శల పరంపరను కొనసాగించారు. జాతీయస్థాయిలో ఆంధ్రా ప్రజలను అవమానించారని ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ఠను ఏపీ సీఎం చంద్రబాబు దిగజార్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ముక్కుసూటితనానికి తలవంచుతున్నాను అని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఓటుకు నోటు స్కాంలో రేవంత్‌రెడ్డి దాడి చేయడం, ముక్కుసూటిగా వ్యవహరించడం నాకు ముచ్చటేసింది. కానీ చంద్రబాబు తప్పించుకొనే విధంగా ప్రవర్తించడం చికాకు పెట్టింది అని మరో ట్వీట్ చేశారు. ఒక ప్రదేశంలో ఉండి మరో ప్రాంతాన్ని గురించి మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు. కానీ నా ప్రాంతీయ భావన, కేసీఆర్ ప్రాంతీయవాదం కంటే తన ప్రాంతీయవాదమే గొప్ప అనే భావన చంద్రబాబులో ఉన్నట్లు కనిపిస్తుంది అని వర్మ ఇంకో ట్వీట్లో పేర్కొన్నారు.