వనపర్తి : మహబూబ్నగర్ జిల్లా వనపర్తి సమీపంలోని మర్రికుంట శివారులో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర అధ్యాపకులు డాక్టర్ సదాశివయ్...
వనపర్తి : మహబూబ్నగర్ జిల్లా వనపర్తి సమీపంలోని మర్రికుంట శివారులో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర అధ్యాపకులు డాక్టర్ సదాశివయ్య బృందం అరుదైన బొయిగా ట్రైగోనటా (ఇండియన్ క్యాట్స్నేక్) సర్పజాతిని మంగళవారం గుర్తించింది. ఈ సందర్భంగా సదాశివయ్య మాట్లాడుతూ 1963లో నల్లగొండ జిల్లాలో శాస్త్రవేత్త బీ నాథ్ బొయిగా ట్రైగోనటాను గుర్తించారని తెలిపారు. దీని తల త్రిభుజాకారంలో ఉండి, తలపై వై ఆకారపు గుర్తు ఉంటుంది. దీని కంటిపాప నిలువుగా ఉంటుందని, శరీరం గోధుమరంగులో ఉండి ముదురురంగు చారలు జిగ్జాగ్ ఆకారంలో ఉంటాయి. ఇది సుమారు 130 సెం.మీ వరకు పెరుగుతుంది. ఇది రాత్రివేళ మాత్రమే సంచరించి కీటకాలు, పక్షులు, బల్లులను ఆహారంగా తీసుకుంటుంది. పెద్ద జంతువులు, మనుషులపై దీని విషం ప్రభావం చూపదన్నారు. ఈ సర్పాన్ని తిరుమలయ్యగుట్ట అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాం అని సదాశివయ్య చెప్పారు.