Gmail లో మనం పంపే మెయిల్స్ schedule చేసుకొని పంపుకోవచ్చు .దీనికోసం ఒక చిన్న Gmail Extension వుంది Boomerang ,దానిని మన క్రోమ్ బ్రౌజరు ల...

Gmail లో మనం పంపే మెయిల్స్ schedule చేసుకొని పంపుకోవచ్చు .దీనికోసం ఒక చిన్న Gmail Extension వుంది Boomerang ,దానిని మన క్రోమ్ బ్రౌజరు లో ఇన్స్టాల్ చేసుకొని మనం , ఏ రోజున , ఏ టైం కి మెయిల్ పంపాలో ముందుగా schedule చేసుకొని పంపుకోవచ్చు . క్రోమ్ లోనే కాదు , Firefox,safari వంటి బ్రౌజరు లో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు .
గూగుల్ క్రోమ్ లో ఇన్స్టాల్ అయిన తర్వాత , ఎలా set చేసుకోవాలో చూద్దామా ....?
ముందు గా క్రింద ఇవ్వబడిన లింక్ క్లిక్ చేయడం ద్వారా వెబ్సైటు కు వెళ్లి Extension install చేసుకోవాలి .

తర్వాత gmail open చేసి మెయిల్ compose చేసి , Recipients దగ్గర ఎవరికి మెయిల్ పంపాలో address టైపు చేసి క్రింది ఉన్న Send Later బటన్ పైన క్లిక్ చేస్తే ఒక popup విండో వస్తుంది ... అక్కడ ఎప్పుడు , ఏ time లో మెయిల్ పంపాలో మన schedule ప్రకారం set చేసుకోవాలి , క్యాలెండరు icon ని వుపయోగించి కూడా set చేసుకోవచ్చు .
క్రింది ఇమేజ్ గమనించండి

క్రింద ఉన్న Boomerand this ఆప్షన్ గమనించండి , ఎ ఆప్షన్స్ ద్వారా మనము పంపిన మెయిల్ , ఎవరికి పంపామో వాళ్ళు చూడకుంటే ( ఉదాహరణకి 2 రోజులు మెయిల్ చూడకుంటే ) మనకు వాళ్ళు మెయిల్ చూడలేదు అన్న విషయం తెలియజేస్తుంది ( పంపిన మెయిల్ ను Inbox లో Top లోకి పంపబడుతుంది ... దీనిని బట్టి మెయిల్ చూడలేదు అన్న విషయం మనము తెలుసుకోవచ్చు) .
క్రింది ఇమేజ్ లో right side చివర ఉన్న cover icon క్లిక్ చేయడం ద్వార , మనం పంపిన మెయిల్ Read అయినదో లేదో మనకు Notification మెయిల్ వస్తుంది . cover icon క్లిక్ చేసిన వెంటనే మనము మెయిల్ compose చేసే విండో లో ( ) లైన్ Insert చేయబడుతుంది .

దీనిని వుపయోగించి Month కు 10 మెయిల్స్ కి పైన చెప్పిన సర్వీస్ లు ఉపయోగించుకోవచ్చు . Unlimted services కావాలంటే purchase చేసుకోవాల్సి వుంటుంది .