(5 Jul) మిలటరీ దుస్తుల్లో ఆయుధాలతో దిగినగ్రూప్ ఫొటోను స్థానికులు నిఘా బృందాలకు పంపించారు మార్చి, ఏప్రిల్ వరకు కొండల్లో మంచు విపరీతంగా నిం...
(5 Jul) మిలటరీ దుస్తుల్లో ఆయుధాలతో దిగినగ్రూప్ ఫొటోను స్థానికులు నిఘా బృందాలకు పంపించారు మార్చి, ఏప్రిల్ వరకు కొండల్లో మంచు విపరీతంగా నిండిపోవడం వల్ల ఉగ్రవాదులు ఈ మార్గాన భారత దేశ సరిహద్దులోకి అక్రమంగా చొరబడేందుకు ఆటంకం ఏర్పడుతుంది. మే నుంచి మంచు తగ్గడంతో గిరిజన ప్రాంతాల నుంచి దేశ సరిహద్దుల్లోకి ప్రవేశిస్తుంటారు. దీంతో సైన్యం నిరంతరం అప్రమత్తంగా ఉంటుంది. ఇటీవల మూడు, నాలుగు ఉగ్రవాదుల బృందాలను సైన్యం పట్టుకున్నది. అమర్నాథ్ యాత్ర ప్రారంభానికి ముందురోజు 11మంది సరిహద్దులోని గిరిజన ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరిగినట్లు ఆర్మీకి సమాచారం అందింది. వీరు మిలటరీ దుస్తుల్లో ఆయుధాలతో దిగినగ్రూప్ ఫొటోను స్థానికులు నిఘా బృందాలకు పంపించారు. దీంతో భద్రత బలగాలు అప్రమత్తమై వారి కోసం గాలిస్తున్నాయి. 11 మందిని ఇండియన్ ముజాహిదీన్ సంస్థకు చెందిన వారుగా నిఘా వర్గాలు గుర్తించినట్లు తెలిసింది. వీరిలో తొమ్మిది మంది ఆప్ఘనిస్థాన్‌కు, మిగతా ఇద్దరు జమ్ముకశ్మీర్ ప్రాంతానికి చెందిన వారుగా అనుమానిస్తున్నారు. ఫొటోలు స్థానికులకు చూపించి ఉగ్రవాదుల కదలికల సమాచారంపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే బలగాలు ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఉగ్రవాదుల చొరబాటును అధికారికంగా ధ్రువీకరించని బలగాలు యాత్రకు ఎలాంటి ఆటంకం కలుగదని భరోసా ఇస్తున్నాయి.