(3 Jul) మసీద్‌లో ప్రార్థనలు చేస్తున్న పిల్లలు, పెద్దలపై ఒక్కసారిగా బుల్లెట్ల వర్షం నైజీరియా: బోకోహారంకు చెందిన తీవ్రవాదులు గడిచిన రాత్రి ...
(3 Jul) మసీద్‌లో ప్రార్థనలు చేస్తున్న పిల్లలు, పెద్దలపై ఒక్కసారిగా బుల్లెట్ల వర్షం నైజీరియా: బోకోహారంకు చెందిన తీవ్రవాదులు గడిచిన రాత్రి ఈశాన్య నైజీరియాలోని గ్రామాల్లోకి చొరబడి దాదాపు 150 మందిని చంపారు. మసీద్‌లో ప్రార్థనలు చేస్తున్న పిల్లలు, పెద్దలపై ఒక్కసారిగా బుల్లెట్ల వర్షం కురిపించారు. పదుల సంఖ్యలో మిలిటెంట్లు బోర్నో రాష్ట్రంలోని మూడు గ్రామాలపై పడి ఈ విధ్వంసం సృష్టించారు. ఇండ్లకు నిప్పుపెట్టడం, విచక్షణారహితంగా వ్యక్తులను హతమార్చడం, మహిళలను, బాలికలను బందీలుగా తీసుకెళ్లి అత్యాచారాలకు పాల్పడటం. వీరి ద్వారా ఇస్లామిక్ మిలిటెంట్ల కొత్త తరాన్ని తయారు చేయాలనుకోవడం వంటి వికృత చేష్టలను బోకోహారం తీవ్రవాదులు కొనసాగిస్తూనే ఉన్నారు.