: ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి హైదరాబాద్ : ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి విస్తరించి ఉందని, దీని...
: ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి
హైదరాబాద్ : ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఉష్ణోగ్రతలు ఉదయం పూట 36 డిగ్రీలు, రాత్రివేళ్లల్లో 26 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు. సోమవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో ఖమ్మం, నల్లగొండ జిల్లాలలో గరిష్ఠంగా 39 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, మహబూబ్‌నగర్ జిల్లాలో 38 డిగ్రీలు, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, వరంగల్ తదితర జిల్లాల్లో 37 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో 36 డిగ్రీలు నమోదైంది. రాష్ట్రంలో కనిష్ఠంగా మెదక్ జిల్లాలో 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వివరించింది.