జీహెచ్ఎంసీలోని పారిశుద్ధ్య కార్మికులకు రూ.4వేలు,డ్రైవర్లకు రూ.4800 పెంచుతూ కేసీఆర్ నిర్ణయం24వేల వుంది కార్మికులకు వర్తింపుఈ నెల నుంచే ప...
జీహెచ్ఎంసీలోని పారిశుద్ధ్య కార్మికులకు రూ.4వేలు,డ్రైవర్లకు రూ.4800 పెంచుతూ కేసీఆర్ నిర్ణయం24వేల వుంది కార్మికులకు వర్తింపుఈ నెల నుంచే పెరుగుదలగురువారానికల్లా విధుల్లో చేరిన వారికే వర్తింపుచేరని వారిని తొలగించాలని ఆదేశం - హైదరాబాద్ మహానగరపాలిక (జీహెచ్ఎంసీ) పరిధిలోని పొరుగుసేవల(ఔట్సోర్సింగ్) కార్మికుల వేతనాలను భారీగా పెంచాలని తెలంగాణ ప్రభుత్వం గురువారం సాయంత్రం నిర్ణయించింది. ఈమేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతో ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదలచేసింది. స్వచ్ఛహైదరాబాద్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు వేతనాలను 47.05 శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రకటనతో హైదరాబాద్ మహానగరపాలిక పరిధిలో సుమారు 24వేలమంది కార్మికులకు లబ్ధిచేకూరనుంది. పారిశుద్ధ్య కార్మికులకు ప్రస్తుతం రూ.8500, డ్రైవర్లకు రూ.10,200 వేతనం లభిస్తోంది. పెరిగినదాని ప్రకారం కార్మికులకు రూ.12,500 (పెరుగుదల రూ.4వేలు), డ్రైవర్లకు రూ.15,000 (పెరుగుదల రూ.4800) వేతనం వస్తుంది. పారిశుద్ధ్య కార్మికుల పనితీరును మెచ్చి, స్వచ్ఛ హైదరాబాద్‌లో ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.నేతలమనేవారిని మేపకండి..కొంతమంది నాయకులమంటూ ఒక్కో కార్మికుడు, ఉద్యోగి నుంచి రూ.వెయ్యి చొప్పున వసూలుచేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇకపై ఎవరైనా అలాచేస్తే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కార్మికులు ఎవ్వరికీ పైసాకూడా ఇవ్వవద్దని చెప్పారు. ప్రభుత్వ పిలుపునకు స్పందించి, గురువారానికల్లా సమ్మెవిరమించి, విధుల్లో చేరినవారికే వేతనాల పెంపు వర్తిస్తుందని, పెంపు ఈనెల నుంచే అమలవుతుందని పేర్కొన్నారు. విధుల్లో చేరని కార్మికులను తక్షణమే తొలగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. సమ్మె సందర్భంగా హింసాత్మక ఘటనలకు పాల్పడినవారిని, అనుచితంగా ప్రవర్తించినవారిని విధుల నుంచి తొలగించాలని ఆయన ఆదేశాల్లో స్పష్టంచేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులకు 43శాతం, ఆర్టీసీ కార్మికులకు 44శాతం వేతనాలు/జీతాలు పెంచామని, ఇప్పుడు జీహెచ్ఎంసీ కార్మికులపై ఉన్న సానుభూతితోనే వారికి ఏకంగా 47శాతం మేర వేతనాలు పెంచామని సీఎం పేర్కొన్నారు.సమ్మె విరమించినట్లేనా..?11రోజులుగా సమ్మెచేస్తున్న కార్మికులు గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనతో ఇక పూర్తిస్థాయిలో విధుల్లోకి వచ్చే అవకాశముంది. ముఖ్యమంత్రి ప్రకటనలో జీహెచ్ఎంసీ పరిధిలోని కార్మికుల గురించే ప్రస్తావించారు. రాష్ట్రవ్యాప్తంగా మిగతా నగర/పురపాలక సంఘాల్లో కూడా సమ్మె జరుగుతోంది. దీనిపై ప్రభుత్వం నుంచి గురువారం అర్థరాత్రి వరకు ఎలాంటి ప్రకటనా రాలేదు. ముఖ్యమంత్రి ప్రకటన చేసినందున అదే మిగిలిన మున్సిపాలిటీలకూ వర్తిస్తుందా లేదా అన్నది తెలియలేదని, శుక్రవారం దీనిపై స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు.