(7 Jul) ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐ దర్యాప్తు నిర్వహించాలిఓటుకి నోటులో తప్పొప్పులు న్యాయస్థానాలు నిర్ణయిస్తాయిబాధ్యతగల నేతలు నోరు పారేసుకోవద...
(7 Jul) ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐ దర్యాప్తు నిర్వహించాలిఓటుకి నోటులో తప్పొప్పులు న్యాయస్థానాలు నిర్ణయిస్తాయిబాధ్యతగల నేతలు నోరు పారేసుకోవద్దుసీమాంధ్రకు ప్రత్యేక హోదా ఏమైంది?నీతినిజాయతీలు సమకాలీన రాజకీయాల్లో అసాధ్యమేమో?అవసరమైతే విభజన చట్టానికి సవరణలు చేసుకోవచ్చుజనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలుఈనాడు - హైదరాబాద్తెలుగు జాతి సమగ్రతను కాపాడేలా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు మొదలుపెడుతూ యాదాద్రిలో తొలి అడుగువేశారు. విజయనగరం జిల్లాకు చెందిన ఆనంద్‌సాయిని యాదాద్రికి ప్రధాన రూపశిల్పిగా నియమించడం గర్వించదగ్గ విషయం.దరాబాద్‌లో సెక్షన్ 8 అమలు చేయడం మంచిది కాదనీ, అందుకు తాను వ్యతిరేకమని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ప్రకటించారు. సెక్షన్ 8ను అమలులోకి తీసుకువచ్చి తెలంగాణ ఇచ్చిన ఆనందాన్ని తీసేయొద్దని సూచించారు. ఆ పేరుతో మరోసారి కేంద్రానికి అధికారం కట్టబెడతారా అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ చాలా తీవ్రమైన అంశమని, ఓ ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్‌కు గురవడం సరికాదన్నారు. దీనిపై వెంటనే సీబీఐ దర్యాప్తు చేపట్టాలని సూచించారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో పవన్‌కల్యాణ్ విలేకర్లతో మాట్లాడుతూ రెండు రాష్ట్రాల మధ్య అంతర్యుద్ధ పరిస్థితులు ఉంటేనో, హైదరాబాద్ పరిధిలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తినప్పుడో ఆ సెక్షన్‌ను అమలు చేయవచ్చన్నారు. అంతే తప్ప ఏపీ సీఎం మీద కేసు పెట్టినప్పుడో మరొకప్పుడో కాదన్నారు. ఒక కంట్లో వెన్న... మరో కంట్లో సున్నం అన్న చందాన యూపీఏ, ఎన్డీఏలు రాష్ట్రాన్ని విభజించడం వల్ల సీమాంధ్ర నష్టపోయిందన్నారు. సీమాంధ్రకు ఇస్తామన్న ప్రత్యేక హోదా ఏమైందని ప్రశ్నించారు. దీనిపై సీమాంధ్ర ఎంపీలు ఎందుకు పోరాడటం లేదని పవన్ నిలదీశారు. ''రాష్ట్రం విడిపోయిన తరవాత అందరూ బాధ్యతగా మాట్లాడాలి. నోరు పారేసుకుంటే ప్రజలకు అనర్థాలు కలుగుతాయి. బాధ్యతగల నేతలు నోరుపారేసుకోవద్దు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అహ్మదాబాద్‌లో కలిశా. విభజన తరవాత ప్రజల మధ్య అంతర్యుద్ధాలు వస్తాయేమో అనే భయాన్ని వ్యక్తం చేశాను. అప్పుడాయన 'తెలుగుజాతి ఐక్యత దేశసమగ్రతలో భాగం' అన్నారు. సమగ్రతను కాపాడేలా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు మొదలుపెడుతూ యాదాద్రిలో తొలి అడుగువేశారు. విజయనగరం జిల్లాకు చెందిన ఆనంద్‌సాయిని యాదాద్రికి ప్రధాన రూపశిల్పిగా నియమించడం గర్వించదగ్గ విషయం. ఉద్యమ సమయంలో ఆంధ్రోళ్లు, సెటిలర్లు అంటూ మాట్లాడారు. ఇప్పుడు కూడా అలా మాట్లాడటం సరికాదు. ఆంధ్రోళ్లు అనే మాటను తరచూ మంత్రి హరీష్‌రావు వాడుతున్నారు. ఆంధ్రోళ్లు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడో, తెలుగుదేశం పార్టీయో కాదు. ఎన్నో కులాలు, మతాలు, జాతుల సమ్మేళనమే ఆంధ్రోళ్లు. అంతే తప్ప చంద్రబాబు సామాజిక వర్గమే ఆంధ్రోళ్లు కాదు. హైదరాబాద్, తెలంగాణలు భారతదేశంలో అంతర్భాగాలే అనే భావన ప్రజల్లోకి తీసుకువెళ్లాలి.ఎంపీలూ..చేతకాకపోతే రాజీనామాలు చేయండి: తెలంగాణ ఎంపీల మాదిరి సీమాంధ్ర ఎంపీలు పోరాడరు, సీమాంధ్ర ఎంపీలు వారి సొంత వ్యాపారాలే చూసుకొంటారని ఉత్తరాది ఎంపీ చెప్పారు. విజయవాడ ఎంపీ సీటు కోసం కేశినేని నాని ఎంతో పోరాడారు. గెలిచి ఏం చేస్తున్నారు? ఆయనతోపాటు మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి, ఎంపీలు తోట నరసింహం, అవంతి శ్రీనివాస్, రాయపాటి సాంబశివరావు, భాజపా ఎంపీలు గోకరాజు గంగరాజు, హరిబాబు... వీళ్లంతా ఏం చేస్తున్నారు. ప్రత్యేక హోదా సాధించడం చేతకాకపోతే రాజీనామాలు చేయండి. ఆ మధ్య కొందరు విద్యార్థుల దగ్గర ఓ నినాదం విన్నా... 'తిడితే కేసీఆర్‌లా తిట్టాలి... పడితే పౌరుషం లేని ఆంధ్ర ఎంపీల్లా పడాలి' అని. మన ఎంపీలకు పౌరుషం, ఆత్మగౌరవం లేవా? ప్రధానమంత్రి మోదీ ఆంధ్రప్రదేశ్‌కి తగిన న్యాయం చేయాలి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ మీడియా స్వేచ్ఛను హరించకూడదు.అన్ని పార్టీల కళ్లలో దూలాలుఓటుకి నోటు కేసులో నేను మాట్లాడటం లేదని కాంగ్రెస్‌వాళ్లు అంటున్నారు. మన కళ్లలో దూలాలు పెట్టుకొని ఎదుటివాడి కంట్లో నలుసు గురించి మాట్లాడారన్న సామెతలా ఉంది. సమకాలీన రాజకీయాల్లో నీతినిజాయతీలు అసాధ్యమేమో? రేవంత్‌రెడ్డికి సంబంధించిన కేసు న్యాయస్థానం పరిధిలో ఉంది. తప్పొప్పులు న్యాయస్థానమే నిర్ణయిస్తుంది. ఓటుకు నోటు వ్యవహారాన్ని రెండు రాష్ట్రాలూ రాజకీయ క్రీడగా మార్చేశాయి.సనత్‌నగర్ ప్రజల ఆలోచనలు మార్చగలరా?రాజకీయాల్లో భాగంగా తెదేపాలో గెలిచినవాళ్లను తెరాస తమలో చేర్చుకొంటోంది. తలసాని శ్రీనివాసయాదవ్‌ని పార్టీలోకి తీసుకురాగలరుగానీ సనత్‌నగర్ ప్రజల ఆలోచనలు, మనసులు మార్చగలరా? ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని నిర్మాణమయ్యే వరకూ తెలంగాణ ప్రభుత్వం ఇబ్బందిపెట్టకూడదు. హైదరాబాద్ ఎప్పటికీ తెలంగాణదే. పదేళ్లపాటు ఇది ఉమ్మడి రాజధాని మాత్రమే. ఏపీలో కొత్త రాజధాని నిర్మాణం, పాలనపై దృష్టిపెట్టాలి. వీటి కోసం భాజపా, కాంగ్రెస్ ఎంపీలతో కమిటీ వేయాలి. అలాగే పీఎంఓ పర్యవేక్షణలో ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి. అవసరమనుకొంటే విభజన చట్టానికి సవరణలు చేసుకోవచ్చు'' అని పవన్‌కల్యాణ్ అన్నారు. చివర్లో ఓటుకు నోటు కేసు, ఆంధ్రోళ్లనే హరీష్‌రావు వ్యాఖ్యలపై విలేకర్లు ప్రశ్నలు కురిపించారు. ఆయన సమాధానం చెబుతుండగానే గందరగోళం నెలకొంది. పవన్ ఏం చెబుతున్నారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. అనంతరం ఆయన అక్కడి నుంచి నిష్క్రమించారు.