హైదరాబాద్ : ఎల్.బి.నగర్ చౌరస్తాలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. రెడ్ సిగ్నల్ వున్నప్పటికీ అలాగే ముందుకు దూసుకెళ్లింది. ఆగివున్న వాహనదా...
హైదరాబాద్ : ఎల్.బి.నగర్ చౌరస్తాలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. రెడ్ సిగ్నల్ వున్నప్పటికీ అలాగే ముందుకు దూసుకెళ్లింది. ఆగివున్న వాహనదారులను బెంబేలెత్తించింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి మృత్యువాతకు గురయ్యాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. దిల్షుక్నగర్లోని ఓ కళాశాలలో చేర్పించేందుకు లక్ష్మణరావు మనవరాలితో ఇంటి నుంచి స్కూటీపై బయలుదేరారు. ఎల్.బి.నగర్ చౌరస్తాలో రెడ్ సిగ్నల్ పడటంతో ఆగారు. ఇంతలో లారీ అమాంతం మీదకు దూసుకొచ్చింది. ఈ ఘటనలో లక్ష్మణరావు అక్కడికక్కడే మృతిచెందగా మనవరాలికి గాయాలయ్యాయి.