శాంతినగర్: రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా నెలరోజులుగా చేపట్టిన కఠోర ఉపవాసాలను విరమించి ముస్లింలు జిల్లావ్యాప్తంగా రంజాన్ పండగను శనివారం ...
శాంతినగర్: రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా నెలరోజులుగా చేపట్టిన కఠోర ఉపవాసాలను విరమించి ముస్లింలు జిల్లావ్యాప్తంగా రంజాన్ పండగను శనివారం ఘనంగా జరుపుకొన్నారు. జిల్లాకేంద్రంలోని భుక్తాపూర్లో గల ఈద్గామైదానంలో ప్రార్థనలకు ముస్లింలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఉదయం 9 గంటలకు జామామసీద్ ఇమాం మౌలానా జమీర్ రంజాన్ పవిత్రతను వివరించి ముస్లింలతో నమాజు చేయించారు. భైంసా, నిర్మల్, మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్నగర్తో పాటు ఇతర అన్ని పట్టణాలు, గ్రామాల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అన్ని చోట్ల రంజాన్ సందడి కనిపించింది.