గడువు ముగిసె.. పనులు మిగిలె

(3 Jul) అధికారుల తీరు మారలేదు. గుత్తేదారులతో సకాలంలో పుష్కర పనులు పూర్తిచేయించలేకపోయారు. మనతో పాటే పొరుగు జిల్లాల్లో మొదలైన పుష్కరఘాట్ల న...

gaduvu
mugise.. panulu migile
(3 Jul) అధికారుల తీరు మారలేదు. గుత్తేదారులతో సకాలంలో పుష్కర పనులు పూర్తిచేయించలేకపోయారు. మనతో పాటే పొరుగు జిల్లాల్లో మొదలైన పుష్కరఘాట్ల నిర్మాణాలు పూర్తయినా.. జిల్లాలో మాత్రం ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. కాగితాలపైన తప్పుడు ప్రగతి నివేదికలతో ఉన్నతాధికారులను పక్కదారి పట్టించారు. వీటిని నమ్మి వారు అభాసు పాలయ్యారు. తీరా సమయానికి సాకులు చూపించి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. పన్నెండేళ్లకోసారి వచ్చే గోదావరి పుష్కరాలు ఈ నెల 14వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరగనున్నాయి. ఇక మిగిలింది 12 రోజులే.. నదిలో పుణ్యస్నానం ఆచరించడానికి భక్తులు భారీగా తరలి వస్తారు. భక్తుల సౌకర్యార్థం జిల్లాలో 1346 మీటర్ల పొడవున 27పుష్కరఘాట్ల నిర్మాణానికి రూ.27.12కోట్లను కేటాయించారు. నీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఘాట్ల నిర్మాణ పనులు దక్కించుకున్న గుత్తేదారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వాస్తవానికి ఈ పనులను గత నెల 15వ తేదీనాటికే పూర్తిచేయాలి. కానీ.. అప్పటికీ పూర్తికాకపోవడంతో మరో పదిహేను రోజుల పాటు గడువు పెంచారు. పెంచిన గడువు కూడా పూర్తయింది. అయినా.. ఇప్పటికీ పూర్తిస్థాయిలో ఒక్క పుష్కరఘాట్‌ పని కూడా పూర్తికాకపోవడం అధికారుల పనితీరుకు గీటురాయిగా మారింది. జిల్లా సరిహద్దులో ఉన్న కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో దాదాపు ఘాట్ల నిర్మాణాలు పూర్తయినా.. ఇక్కడ మాత్రం పూర్తికాలేదు. కరీంనగర్‌ జిల్లాలో మన కంటే ఎక్కువే (36) ఘాట్ల పనులు చేపట్టినా దాదాపు అన్ని ఘాట్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఇంద్రకరణ్‌రెడ్డి సొంత జిల్లాలోనే పనులు పూర్తిచేయకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది. పుష్కరఘాట్ల నిర్మాణ పనుల తీరు ఆది నుంచి విమర్శలకు తావిస్తూనే ఉంది. పనులను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ గుత్తేదారులతో వేగంగా పనులు చేయించాల్సిన అధికారులే తప్పుడు ప్రగతి నివేదికలు తయారు చేశారు. వాటినే ఉన్నతాధికారులకు పంపిస్తూ గొప్పలకు పోయారు. తప్పుడు ప్రగతి నివేదికల గురించి 'ఈనాడు' వెలుగులోకి తీసుకొచ్చింది. పనులు నత్తనడకన సాగుతున్న తీరుపైన సంబంధిత శాఖల అధికారులను జిల్లా పాలనాధికారి ప్రశ్నించారు. ఆయనను సైతం బురడీ కొట్టించే యత్నమే చేశారు. ఇప్పుడు సమయం మించిపోవడంతో పాలనాధికారి జగన్మోహన్‌ స్వయంగా రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. లోపాలను గుర్తించి సంబంధిత అధికారులను హెచ్చరించారు. సకాలంలో పనులు చేయించలేని కొందరు అధికారులు గుత్తేదారులకే వత్తాసు పలుకుతున్నారు. ఈ ఏడాదిలో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడం వల్ల పనులు చేసుకునే వెసులుబాటు కూడా కలిగింది. అయితే వర్షాలు ఎక్కువగా కురవడం వల్ల పనులు జరపలేకపోయినట్లు గుత్తేదారులు పేర్కొంటూ అదనంగా గడువు పెంచాలని డిమాండు చేస్తున్నారు. సకాలంలో ఘాట్ల గుర్తింపు జరపలేదని.. భూసేకరణలోనూ జాప్యం జరిగడం వల్ల సకాలంలో పనులు మొదలు పెట్టలేకపోయినట్లు కుంటిసాకులు చెబుతున్నారు. వాస్తవాలకు భిన్నంగా గుత్తేదారులు వ్యవహరిస్తున్నా.. వారిపైన చర్య తీసుకోవాల్సిన అధికారులే వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. పుష్కరాల సమయం దగ్గరపడుతున్నా.. పనులు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. పుష్కరఘాట్ల నిర్మాణ పనుల పురోగతిపైన నీటిపారుదలశాఖ ఎస్‌ఈ భగవంతరావును 'ఈనాడు' వివరణ కోరగా.. అన్ని పుష్కరఘాట్ల పనులు పూర్తయ్యాయని చెప్పారు. కానీ.. ఆయన చెప్పిన మాటలకు వాస్తవ పరిస్థితులకు మాత్రం పొంతన లేదు. భక్తులు అధికంగా వచ్చే బాసరలోనే ఇంకా ఘాట్ల నిర్మాణ పనులు పూర్తికాలేదు. 490మీటర్లకు 440మీటర్లే పూర్తయింది. ముథోల్‌ మండలంలో బాసర మినహా మూడు పుష్కరఘాట్ల పనులు మొదలైనా ఇప్పటికీ ఒక్క ఘాట్‌ పని కూడా పూర్తికాలేదు. పనులు ఆలస్యంగా మొదలు పెట్టడం వల్లే సకాలంలో పూర్తిచేయలేని దుస్థితి నెలకొంది. ఆష్టా, కౌట్ల ఘాట్‌ పనులు ఒకే గుత్తేదారుకి వచ్చాయి. కౌట పనులే తీవ్ర జాప్యం చేస్తుండటంతో ఆష్టా పనులను వేరొక గుత్తేదారుకి కట్టబెట్టినా పనులు ఏ మాత్రం వేగం పుంజుకోలేదు. నిర్మల్‌ మండలంలో రెండు ఘాట్ల నిర్మాణ పనులు చివరిదశకు వచ్చినా ఒక్కటీ పూర్తికాలేదు. లోకేశ్వరం మండలంలో ఒక ఘాట్‌ మంజూరైనా ఇంకా పూర్తికాలేదు. పనులు పూర్తికావడానికి ఇంకో వారం రోజులకు పైనే సమయం పట్టేలా ఉంది. లక్ష్మణచాందా మండలంలో పుష్కరఘాట్ల పనులు కొనసాగుతూనే ఉన్నాయి. జన్నారం మండలంలో రెండు ఘాట్ల పనులు ఇంకా పూర్తికాలేదు. రెండింటిని ఒకే దక్కించుకున్నా.. రాంపూర్‌లో పనులు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. పనులను ఉప గుత్తేదారుకు అప్పగించడంతో పనులకు తీవ్ర జాప్యం వాటిల్లుతోంది. లక్సెట్టిపేట, చెన్నూరు, జైపూర్‌, మంచిర్యాల మండలాల్లో పుష్కరఘాట్‌ పనులు ఇప్పటికీ పూర్తికాలేదు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పనులకు ఆటంకంగా మారే పరిస్థితులున్నాయి. పనులు చేసుకునేలా వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు గుత్తేదారులు వేగంగా చేయలేదు. భారీగా వర్షాలు కురిస్తే పనులు నిలిపివేయక తప్పదు. మరో వైపు పుష్కరాల గడువు సమీపిస్తోంది. పనుల్లో వేగం పెంచకున్నా.. వర్షాలు కురిసి పనులు ఆగిపోయినా.. అసంపూర్తి పుష్కరఘాట్లల్లోనే పుణ్యస్నానాలు చేయాల్సిన దుస్థితి. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా జరుగుతున్న పుష్కరాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా.. అధికారులు గుత్తేదారుల నిర్లక్ష్యం కారణంగా లక్ష్యం నెరవేరని దుస్థితి నెలకొంది. పుష్కరాల పనుల గడువు ముగిసింది..పనులు ఇంకా కొనసా..గుతూనే ఉన్నాయి. ఇప్పటికీ వందశాతం పనులు ఎక్కడా పూర్తికాలేదు. పుష్కర సమయం దగ్గరపడుతుండటంతో పుష్కరఘాట్లు, రహదారుల నిర్మాణాలను వేగిరం చేస్తున్నారు. మిగితా పనులైన మంచినీటి పైప్‌లైన్ల నిర్మాణాలు, మరుగుదొడ్లు, విద్యుత్తు పనులు, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో చేపట్టే పనులు నత్తతో పోటీపడుతున్నాయి. జిల్లాలోని గోదావరి తీరంలో నిర్మించిన పుష్కరఘాట్ల వద్ద తాగునీటి వసతి, శాశ్వత, తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టనున్నారు. బాసర మినహాయిస్తే మిగితా పుష్కరఘాట్ల వద్ద రూ. 4.75 లక్షలతో ఈ పనులు చేపట్టాల్సి ఉంది. పనులన్నీ జూన్‌ 30లోగా పూర్తి కావాల్సి ఉన్నా బాసర, సోన్‌ మినహా ఎక్కడా ప్రారంభం కాలేవు. ప్రతి పుష్కరఘాట్‌ వద్ద 10 మరుగుదొడ్ల నిర్మాణాలు, నీటి శుద్ధ ప్లాంటు ఏర్పాటు ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఇంకా ప్రారంభింలేదు. సోన్‌ పుష్కరఘాట్‌ వద్ద వంద మరుగుదొడ్లు నిర్మాణం చేయాల్సి ఉన్నా నాలుగైదు రోజుల క్రితం పనులు ప్రారంభించారు. మంచినీటి పైప్‌లైన్‌ పనులు కొనసాగుతున్నాయి. నీటి శుద్ధ పాంట్లు పనులు మొదలుకాలేవు. బాసరలో 800 మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉంది. ఇప్పటికీ 350 పూర్తి చేశారు. నాలుగు నీటి శుద్ధి యంత్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇక్కడ మంచినీటి పైప్‌లైన్‌ పనులు జరుగుతున్నాయి. పంచాయితీరాజ్‌ శాఖ అన్ని పుష్కరఘాట్ల వరకు రహదారులను నిర్మించాల్సి ఉంది. అయితే మొదటి విడతలో మంజూరైన రహదారుల పనులు దాదాపు పూర్తిదశలో ఉన్నాయి. మంచిర్యాల పట్టణంలో రహదారి పనులు ఇంకా కొనసా..గుతూనే ఉన్నాయి. లోకేశ్వరం మండలం వాస్తాపూర్‌ నుంచి బ్రహ్మేశ్వరం పుష్కరఘాట్‌ వరకు నిర్మించే రహదారి పనులు ఇంకా పూర్తి కాలేదు. రెండో విడత మంజూరైన 12 రహదారుల నిర్మాణాలు ఇంకా ప్రారంభమే కాలేదు.. ఈ పనులు రేయింబవళ్లు నాణ్యతతో వేగిరంగా చేయిస్తేనే ప్రయోజనం ఉంటుంది. లేదంటే 2003లో జరిగిన పుష్కరాల్లో మాదిరిగానే భక్తులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. రెండో విడత కింద 12 రహదారుల నిర్మాణాలకు 2.33 కోట్లు మంజూరు చేసింది. అయితే పుష్కరాలకు తక్కువ రోజుల సమయం మాత్రమే ఉండటంతో పనులు జరుగుతాయో లేదోనన్న భావన అధికారుల్లో వ్యక్తమవుతోంది. బాసర, ముథోల్‌, లక్ష్మణచాంద, మామడ, కడెం, జన్నారం మండలాల్లోని గోదావరి తీరాల్లో నిర్మించిన పుష్కరఘాట్ల వరకు రహదారుల పనులు చేపట్టాల్సి ఉంది. పుష్కర పండగలో విద్యుత్‌ వెలుగులే ఆకర్షణగా నిలుస్తాయి. పుష్కర సమయంలో తెల్లవారుజామున సూర్యోదయం కాకముందు, సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత వేల సంఖ్యలో భక్తులు పుష్కర స్నానాలు ఆచరిస్తారు. ఆ సమయాల్లో విద్యుత్‌ వెలుగులు అత్యవసరం. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. ఈ పనులు కూడా చాలా మందగమనంలో సాగుతున్నాయి. ఒక్క బాసరలో మాత్రమే విద్యుత్‌ స్తంభాలు బిగించి వదిలేశారు. ఇంకా పుష్కరఘాట్ల వద్ద ప్రత్యేక నియంత్రికలు, విద్యుత్‌ తీగలు (లైన్లు) ఏర్పాటు చేయాల్సి ఉంది. ముథోల్‌ మండలం కౌఠ గ్రామం నుంచి పుష్కరఘాట్‌ వరకు విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటుచేసి తీగలను బిగించారు. వీధి దీపాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. మిగితా పుష్కరఘాట్ల వద్ద విద్యుత్‌ పనులు ఇంకా ప్రారంభమే కాలేదు. * దేవాదాయశాఖ: జిల్లాలోని బాసర, బ్రహ్మేశ్వరం, సోన్‌, గూడెం, చెన్నూరు, వేలాల ప్రాంతాల్లో ఉన్న ఆలయాలను ముస్తాబు చేయనున్నారు. ఈ పనులు రెండు రోజుల క్రితమే ప్రారంభమయ్యాయి. కేశఖండనశాల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. బారికేడ్ల నిర్మాణాలు మొదలుకాలేదు. కేవలం 20 మంది అర్చకులు మాత్రమే ఉన్నారు. మరో 300 మంది అర్చకులను మెదక్‌, నల్గొండ, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల నుంచి రప్పిస్తున్నారు. 500 మంది పురోహితులు అవసరమని గుర్తించారు. వీరిని ఎంపిక చేయాల్సి ఉంది. 200 మంది నాయీబ్రాహ్మణులను నియమించారు. అయితే ఆలయాలు ఉన్న పుష్కరఘాట్ల వద్ద హరికథ, బుర్రకథ, ఇతరత్రా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే వీటికి సంబంధించి ఎక్కడా కూడా ప్రత్యేక ఏర్పాట్లు ప్రారంభించలేదు.

COMMENTS

పేరు

Adilabad AUDIO RELEASES ENTERTAINMENT GOSSIPS Health HYDERABAD INTERNATIONAL Job Search Jobs KARIMNAGAR KHAMMAM MAHABOOBNAGAR MEDAK MOVIE REVEWS NALGONDA NATIONAL NIZAMABAD Rangareddy SINGARENI NEWS TECHNOLOGY TELANGANA NEWS VIDEO SONGS WARANGAL worldcup2015
false
ltr
item
Tdaily.In - Telangana News: గడువు ముగిసె.. పనులు మిగిలె
గడువు ముగిసె.. పనులు మిగిలె
http://acdn.newshunt.com/fetchdata5/20150702/eena/adilabad/images/350x350_IMAGE41450504.png
Tdaily.In - Telangana News
https://telugunewvideos.blogspot.com/2015/07/blog-post_13.html
https://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/2015/07/blog-post_13.html
true
2091677902228022841
UTF-8
Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS CONTENT IS PREMIUM Please share to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy