(3 Jul) ఏటా వ్యాధులతో ప్రాణాలు కోల్పోతున్న ఏజెన్సీ గిరిజనులకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాటుచ...
(3 Jul) ఏటా వ్యాధులతో ప్రాణాలు కోల్పోతున్న ఏజెన్సీ గిరిజనులకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాటుచేసిన బయోమెట్రిక్ యంత్రాలు, సీసీ కెమెరాలను అటకెక్కించారు. ఉద్యోగులు సమయ పాలన పాటించేలా చూసేందుకు ప్రభుత్వం ఉట్నూర్ ఏజెన్సీలోని 31 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రూ.25 లక్షలకు పైగా ఐఏపీ నిధులు వెచ్చించి ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ పరికరాలతో పాటు సీసీ కెమెరాలు మూలన పడ్డాయి. దీంతో పీహెచ్సీలో పని చేసే వైద్యులతోపాటు సిబ్బంది సైతం తమ ఇష్టారీతిన విధులకు హాజరవుతున్నారు. ఉట్నూర్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల తదితర పట్టణ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తుస్తున్నారు. సమయానికి రాకపోవడంతో చికిత్స కోసం పీహెచ్సీ లకు వచ్చే వేలాది మంది గిరిజనులకు సమయానికి వైద్యం అందక ఇబ్బంది పడుతున్నారు. ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని 31 పీహెచ్సీల్ల్లో ఈ పరికరాలను ఏర్పాటు చేశారు. వీటిని ఏర్పాటు చేసిన కంపెనీ బిల్లులను తీసుకొని వెళ్ళారు. వీటి గురించి పట్టించుకోవడంలేదు. పీహెచ్సీలో సిబ్బంది హాజరును క్రమబద్ధీకరించేందుకు బయోమెట్రిక్ (వేలిముద్రల నమోదు)హాజరు యంత్రాలను అందుబాటులోకి తీసుకు వచ్చారు. వాటిని పీహెచ్సీల వారీగా బిగించిన సంబంధిత కంపెనీవారు అవసరమైన సాప్ట్వేర్ వేయలేదు. ఈ యంత్రాల వాడకంపై శ్రద్ధలేని అధికారవర్గాలు కూడా స్పందించక పోవడంతో ఈ యంత్రాలు మూలనపడ్డాయి. వీటిన వినియోగంలోకి తీసుకొస్తే హాజరు శాతం, సమయపాలన పాటింపజేయడంలో కొంత మేరకు ఫలితం సాధించవచ్చు. ఉట్నూర్ ఏజెన్సీ పరిధిలోని 31 పీహెచ్సీలో పని చేస్తున్న వైద్యులు ఆధునిక, సాంకేతిక పరికరాలు అందుబాటులో ఉన్నా ఉపయోగించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. వీటిని ఉపయోగంలోకి తెస్తే తాము సమయపాలన పాటించాల్సి వస్తుందనే భావనతో వీటిని మూలన పడేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైద్యుల నిర్లక్ష్యానికి సిబ్బంది సైతం వత్తాసుపకడంతో ఈ వ్యవహారం మూడేళ్లుగా ఇలాగే కొనసాగుతోంది. పీహెచ్సీలలో ఎంతో ఖర్చు చేసీ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సంబంధిత వైద్యాధికారులు వీటిని మూలన పడేశారు. దీంతోపాటు రోగుల సంఖ్య బయటపడుతుందని, తాము తరుచూ పీహెచ్సీలను వదలిపోయే పరిస్థితి ఉండదనే ఈ సీసీ కెమెరాలు కావాలని నిరుపయోగంగా ఉంచినట్లు తెలుస్తోంది. ఏజెన్సీలోని 31 పీహెచ్సీలో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ పరికరాలను బిగించేందుకు ఒప్పందం చేసుకున్న కంపెనీవారు ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఏజెన్సీ అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈ పరికరాల పనితీరుపై కంపెనీ వారిని చరవాణిలో అడిగేందుకు ప్రయత్నం చేయగా వారు చరవాణి తీయడం లేదన్నారు. ఇప్పటి వరకు బయోమెట్రిక్ సాప్ట్వేర్లు బిగించలేదని తెలిపారు.