గోదావరి పుష్కరాలు మొదలై మూడు రోజులైంది. పుష్కర స్నానాలకు వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జిల్లాలోని బాసర, సోన్, ఖానాపూర్, గూడెం...
గోదావరి పుష్కరాలు మొదలై మూడు రోజులైంది. పుష్కర స్నానాలకు వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జిల్లాలోని బాసర, సోన్, ఖానాపూర్, గూడెం, మంచిర్యాల, చెన్నూరు పుష్కర ఘాట్ల్లలో భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. స్నానం ఆచరించడానికి గోదావరిలో అనువుగా ఉన్న ప్రదేశాల్లోకి వెళ్లి స్నానాలు ఆచరిస్తున్నారు. శుక్రవారం నుంచి మూడు రోజులపాటు సెలవులు ఉండటంతో ఇప్పుడు వస్తున్న జనం కంటే రెట్టింపు సంఖ్యలో వచ్చే అవకాశాలున్నట్లు అధికార వర్గాల వారు భావిస్తున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించడానికి అధికారులు ఏర్పాట్లుచేశారు. జిల్లాలో గురువారం సాయంత్రం మూడు గంటల వరకు 80 వేల మంది భక్తులు గోదావరిలో స్నానాలు చేసినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. 45 వేల మంది దేవాలయాలను సందర్శించుకున్నారు. బాసరకు ఉదయం దాదాపు 20 వేల మంది వచ్చినా.. ఆ తర్వాత సాయంత్రం వేళల్లో రద్దీ పెరిగింది. ప్రధానంగా బాసరతో పాటు నిర్మల్, చెన్నూరు, మంచిర్యాల, ఖానాపూర్ ఘాట్ల వద్ద భక్తుల తాకిడి ఎక్కువగా కనిపించింది. భారీగానే పెరిగింది. తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచి భక్తులుతరలివచ్చారు. భక్తుల రద్దీ పెరగడంతో ప్రస్తుతం ఘాట్ల వద్దనే కాకుండా గోదావరికి అవతలి ఒడ్డుకు వెళ్లి పుణ్యస్నానం చేస్తున్నారు. వేకువజాము నుంచే పుష్కర స్నానం మొదలవుతోంది. పుణ్యస్నానాలు ముగించుకుని భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ మొక్కులు తీర్చుకుంటున్నారు. హంపీ పీఠాదిపతి విద్యారణ్య విరూపాక్ష భారతి స్వామి రెండ్రోజులుగా బాసరలోనే ఉంటున్నారు. తాత్కాలిక ఆర్టీసీ బస్టాండు నుంచి భక్తులు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ జగన్మోహన్ ఘాట్లు, దేవాలయాన్ని చుట్టేలా ఉచిత బస్సులు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీను బట్టి అవసరమైనన్ని బస్సులను ఏర్పాటు చేస్తామని కలెక్టర్ చెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాలతో బాసరకు వచ్చే భక్తులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వరుసగా మూడు రోజులపాటు సెలవులు రావడంతో భక్తులసంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నట్లు అధికారులు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టు పారిశుద్ధ్య, భద్రత, ట్రాఫిక్ ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికుడు సాయిలు (25) విధులు నిర్వర్తిస్తూ పాముకాటుతో మృత్యువాత పడ్డారు. ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ఘాట్లను పరిశీలించారు. చి నిర్మల్ మండలం సోన్‌కు కర్ణాటకకు చెందిన ఉత్తర మఠాధిపతి సత్యాత్మతీర్థ స్వామిజీ వచ్చారు. గోదావరి నదిలో పుణ్యస్నానం చేశారు. ఆయనతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి దాదాపు వెయ్యి మంది భక్తులు వచ్చి పుష్కర స్నానాలు చేశారు. మండలంలోని మాదాపూర్ ఘాట్ వద్ద చెత్తకు నిప్పు అంటుకోవడంతో కొంత గందరగోళం నెలకొంది. అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పేశారు. చి గూడెం ఘాట్‌ను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వచ్చి సందర్శించారు. ఇక్కడ భక్తులు గోదావరిలోకి వెళ్లి స్నానం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని ఆయనను కోరారు. తగిన భద్రత ఏర్పాట్లు చేసి భక్తులు గోదావరిలోకి వెళ్లి స్నానం చేసుకునేలా అవకాశం కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. చి చెన్నూరు ఉత్తరవాహినికి మూడో రోజు భారీగా భక్తులు వచ్చారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మిలు కుటుంబ సమేతంగా వచ్చి పుష్కరస్నానం ఆచరించారు. జిల్లా ఎస్పీ తరుణ్ జోషి పుష్కర ఘాట్‌ను సందర్శించారు. పడవలో నదీ తీరాన్ని పరిశీలించారు. చి మంచిర్యాలలో పుష్కరఘాట్‌కు భక్తులు భారీగా తరలివచ్చి స్నానాలు ఆచరించారు. ఎమ్మెల్యే దివాకర్‌రావు ఘాట్ వద్దకు వెళ్లి పరిశీలించారు. చి జన్నారం మండలం బాదంపల్లి పుష్కర ఘాట్‌ను మంత్రి ఐకేరెడ్డి సందర్శించారు. పుష్కరాల తర్వాత బాదంపల్లి గోదావరి రేవును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. చి కడెం మండలం లింగాపూర్, బెల్లాల పుష్కర ఘాట్లను జిల్లా పాలనాధికారి జగన్మోహన్ పరిశీలించారు. గోదావరిలో స్నానం చేసేటప్పుడు సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ భద్రత కల్పించాలని ఆదేశించారు. భక్తులకు అన్ని వసతులు కల్పించాలన్నారు. సిబ్బంది విధులకు రావడంలో జాప్యం చేస్తుండటంతో కలెక్టర్ వారిని మందలించారు. పుష్కరస్నానాలకు పరిసర గ్రామాల నుంచి జనం భారీగా తరలివస్తున్నారు. చి ఖానాపూర్ పుష్కరఘాట్‌ను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే రేఖానాయక్‌లు పరిశీలించారు. ఇబ్బందులు కలగకుండా చూడాలని భద్రత సిబ్బందికి సూచించారు. మొదటి ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. చి లక్ష్మణచాంద మండలంలో అన్ని ఘాట్లకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. మునుపల్లి పుష్కరఘాట్ వద్ద వృద్ధుడు ఫిట్స్‌తో పడిపోవడంతో అంబులెన్స్‌లో నిర్మల్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేశారు.