అబ్దుల్ కలాం అస్తమయం

కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోవడానికి శ్రమించండి అన్న పిలుపుతో యావత్ దేశ యువత మెదళ్లను ఇగ్నైట్ చేసిన ప్రఖ్యాత శాస్త్రవేత్త.. మాజీ ...

apj


కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోవడానికి శ్రమించండి అన్న పిలుపుతో యావత్ దేశ యువత మెదళ్లను ఇగ్నైట్ చేసిన ప్రఖ్యాత శాస్త్రవేత్త.. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఇక లేరు! ఇస్రో కీర్తి ప్రతిష్ఠలను యావత్ ప్రపంచానికి చాటిన భారత మిస్సైల్‌మ్యాన్.. వినీలాకాశంలో కనుమరుగైపోయారు! 

ఆయనకు అత్యంత ఇష్టమైన బోధన ప్రక్రియలో ఉండగానే కుప్పకూలిపోయారు! తన బాటను మార్గదర్శకం చేసి.. తన మాటను ప్రేరణకు ప్రతిరూపంగా నిలిపిన స్ఫూర్తిదాత కన్నుమూశారు! అత్యంత కఠినమైన పేదరికాన్ని సవాలు చేసి.. ప్రపంచం ఎన్నదగిన శాస్త్రవేత్తగా ఎదిగి.. భారత రాష్ట్రపతి పదవిని నిర్వహించి ఆ పదవికే వన్నె తెచ్చిన మహా మనీషి.. ఇక సెలవన్నారు! 
-షిల్లాంగ్ ఐఐఎంలో ప్రసంగిస్తుండగా గుండెపోటుతో కుప్పకూలిన కలాం
-దవాఖానకు తరలించి.. చికిత్స అందిస్తుండగానే మృతి
-నేడు వాయుసేన ప్రత్యేక హెలికాప్టర్‌లో ఢిల్లీకి భౌతికకాయం
-వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన కేంద్రం 
-సంతాపం ప్రకటించిన రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్

షిల్లాంగ్, జూలై 27: మాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాత క్షిపణి శాస్త్రవేత్త భారతరత్న పురస్కార గ్రహీత ఏపీజే అబ్దుల్ కలాం సోమవారం కన్నుమూశారు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లోని ఐఐఎం (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్)లో సోమవారం సాయంత్రం 6.30గంటలకు నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ఆయనకు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలారు. దీంతో ఆయనను సమీపంలోని బెథానీ దవాఖానకు తరలించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తుండగానే ఆయన కన్నుమూశారు. 

apj1


అప్పటికే సైన్యానికి చెందిన వైద్యులు, నార్త్‌ఈస్ట్ ఇందిరాగాంధీ రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్ (ఎన్‌ఈఐజీఆర్‌ఐహెచ్‌ఎంఎస్) వైద్యులు బెథానీ దవాఖానకు వచ్చి కలాంకు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. తీవ్రమైన గుండెపోటుతో 7.45గంటలకు ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దవాఖానకు రాష్ట్ర గవర్నర్ వీ షణ్ముగనాథన్, స్పీకర్ అబు తాహెర్, హోంమంత్రి రోషన్ వర్జిరి తరలివచ్చారు. కలాం భౌతికదేహాన్ని గువాహటి నుంచి మంగళవారం ఉదయం 5.30గంటలకు ఎయిర్‌ఫోర్స్ ప్రత్యే క హెలికాప్టర్‌లో ఢిల్లీకి తరలించనున్నారు. 

apj2


కాగా, కలాం మృతికి నివాళిగా కేంద్ర ప్రభుత్వం వారంరోజులు సంతాపదినాలుగా ప్రకటించింది. కలాం షిల్లాంగ్ వెళ్లేముందు చివరిసారిగా ట్వీట్ చేశారు. అందులో తాను షిల్లాంగ్ వెళ్తున్నానని, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో లవబుల్ ప్లానెట్ ఎర్త్ అంశంపై ప్రసంగించనున్నట్లు పేర్కొన్నారు. కలాం ప్రజల రాష్ట్రపతి అని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, దేశానికి మార్గదర్శకుడు అని ప్రధాని నరేంద్రమోదీ నివాళులు అర్పించారు. కలాం జీవితం స్ఫూర్తిదాయకమని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసిహన్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. దేశానికి ఆయన అందించిన సేవలు ఎన్నటికీ మరువలేమని అన్నారు. 

apj3


కలాం మరణం జాతికి తీరనిలోటు అని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతా పం వ్యక్తం చేశారు. క్షిపణుల తయారీ రంగంలో నైపుణ్యం ఉన్న కలాం.. గొప్ప మానవత్వం ఉన్న మనిషి అని కొనియాడారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, టీఆర్‌ఎస్ ఎంపీలు కవిత, వినోద్, ప్రొఫెసర్ సీతారాంనాయక్, బాల్క సుమన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు డాక్టర్ వేణుగోపాలాచారి, రామచంద్రు తెజావత్ సంతాపం తెలిపారు. కేంద్రమంత్రులు సుష్మాస్వరాజ్, ధరేంద్రప్రధాన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం, గవర్నర్ జయలలిత, రోశయ్య కేరళ సీఎం ఊమెన్ చాందీ, బెంగాల్, బీహార్ సీఎంలు మమతాబెనర్జీ, నితీశ్ తదితరులు సంతాపం ప్రకటించారు. 

apj4


కాగా, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, వైద్యారోగ్య శాఖ మంత్రి లకా్ష్మరెడ్డి, కాంగ్రెస్ నేత జానారెడ్డి, వైసీపీ నేత జగన్మోహన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, బీజేసీ శాసనసభా పక్షనేత లక్ష్మణ్, సీపీఐ నేత చాడా వెంకటరెడ్డి, సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం, అఖిల భారత పంచాయత్ పరిషత్ జాతీయ కార్యదర్శి జాస్తీ వీరాంజనేయులు, టీ ఫ్యాప్సీ అధ్యక్షుడు అనిల్‌రెడ్డి సంతాపం తెలిపారు.

ప్రేరణకు ప్రతిరూపం.. కలాం

-రామేశ్వరం టు రాష్ట్రపతిభవన్ సుదీర్ఘ ప్రస్థానం
-అలుపులేకుండా సాగిన అసామాన్యుడి జీవనయానం
న్యూఢిల్లీ, జూలై 27: సామాన్యుడిగా పుట్టి అంతులేని శిఖరాలను అవలీలగా అందుకున్న అసామాన్యుడు ఏపీజే అబ్దుల్ కలాం. తమిళనాడులోని రామేశ్వరంలో అక్టోబర్ 15, 1931లో జన్మించిన ఆయన పూర్తి పేరు.. అవుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. చిన్ననాటినుంచే ఆకాశ విహంగాలపై ఆసక్తి ప్రదర్శించిన కలాం.. ఉపాధ్యాయుడి తోడ్పాటుతో ఆ దిశగా అడుగులు వేశారు. మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి తనకిష్టమైన భౌతికశాస్త్రం, ఏరోస్సేస్‌లో ఇంజినీరింగ్ పట్టా తీసుకున్న తర్వాత డీఆర్‌డీవో (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్)లో చేరారు. 

apj5


డీఆర్‌డీవో హైదరాబాద్‌లోనూ పనిచేసిన ఆయనకు నగరంతో అవినాభావ సంబంధం ఉన్న ది. ప్రధానంగా రక్షణ, అంతరిక్ష పరిశోధనలపై దృష్టి పెట్టిన కలాం.. ఆ తర్వాత భారత క్షిపణి కార్యక్రమాల్లో విస్తృతంగా తన సేవలు అందించారు. పృథ్వి, అగ్ని, ఆకాశ్, నాగ్, త్రిశూల్ తదితర క్షిపణుల అభివృద్ధి విశేషమైన సేవలు అందించినందుకు ఆయనకు మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరువచ్చింది. అగ్ని బాలిస్టిక్ క్షిపణి భారత శక్తిసామర్థ్యాలు ప్రపంచానికి తెలిశాయి. 

ఈ క్షిపణులన్నీ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకావడం గమనార్హం. ఎల్‌ఏసీ (లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్) ప్రాజెక్టులోనూ తనవంతు సాయం అందించారు. 1998లో వాజ్‌పేయ్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పోఖ్రాన్‌లో చేపట్టిన అణ్వాయుధ ప్రయోగంలో కీలకపాత్ర పోషించారు. ఆయన సేవలకు కేంద్రం భారతరత్న సహ పలు ప్రతిష్ఠాత్మకమైన అవార్డులు అందజేసింది. 40 యూనివర్సిటీలు ఆయన గౌరవ డాక్టరేట్లు అందజేయడం విశేషం. 

ప్రజల రాష్ట్రపతిగా..

రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ పదవీకాలం ముగిసిపోవడంతో ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రపతి అభ్యర్థిగా కలాంను అనూహ్యంగా తెరపైకి తెచ్చింది. యూపీఏ, లెఫ్ట్ పక్షాలు ఆజాద్ హింద్‌ఫౌజ్‌లో పనిచేసిన లక్ష్మీసెహగల్‌ను బరిలోకి దించగా.. కలాం 1,07,366ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2002 నుంచి 2007 వరకు భారతదేశ 11వ రాష్ట్రపతిగా సేవలందించారు. ఆ సమయంలో రాష్ట్రపతిభవన్‌ను సందర్శకుల కోసం తెరిచారు. రాష్ట్రపతిభవన్‌లో 12 ఉద్యానవనాలు ఉండగా.. అందులో ఒకదానిని ప్రత్యేకం గా వికలాంగుల సందర్శన కోసం కేటాయించాలని ఆదేశించారు. కలాంకు చిన్నపిల్లలంటే ఎంతో ఇష్టం. 

వారితో ఎక్కువసమయం గడిపేందుకు ఇష్టపడేవారు. ప్రతివారం ప్రత్యేకంగా 300నుంచి400మంది వరకు విద్యార్థులతో సమావేశమయ్యేవారు. వారిలో దేశవ్యాప్తంగా 100వరకు వచ్చేవారు. విద్యార్థులు రాసే లేఖలకు సైతం ఆయన సమాధానాలు ఇచ్చేవారు. రాష్ట్రపతిగా ఉన్న సమయంలో 21 క్షమాభిక్ష పిటిషన్లు రాగా, అందులో బెంగాల్ రేపిస్ట్ ధనంజయ్ చటర్జీ పిటిషన్‌ను తిరస్కరించారు. మిగతావాటిని పరిశీలించలేదు. అందులో ఉగ్రవాది అఫ్జల్‌గురు పిటిషన్ కూడా ఉంది. 

అనేక విశిష్ఠతల సమాహారం..

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ జాకీర్‌హుస్సేన్ తర్వాత భారతరత్న అందుకున్న రాష్ట్రపతి.. అబ్దుల్‌కలాం కావడం విశేషం. ఒక శాస్త్రవేత్త, ఒక అవివాహితుడు రాష్ట్రపతిగా ఎన్నికైంది కూడా కలాం కావడం మరో విశేషం. రాష్ట్రపతిగా పదవీకాలం ముగిసిన తర్వాత తనకు ఇష్టమైన బోధనావృత్తిని ఎంచుకున్నారు. అహ్మదాబాద్, షిల్లాంగ్, ఇండోర్ ఐఐఎం, బెంగళూరు ఐఐఎన్, అన్నా యూనివర్సిటీ, జేఎన్‌ఎన్‌లో విజిటింగ్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఐఐటీ హైదరాబాద్, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో బోధనలు చేశారు. వింగ్స్ ఆఫ్ ఫైర్ పేరిట తన జీవితకథను పుస్తకరూపం ఇచ్చారు. తొలుత ఇంగ్లిష్‌లో ఆ తర్వాత 13 భాషల్లో అనువదించారు. ఇంగ్లిష్‌లో ఆ పుస్తకం లక్ష కాపీలు అమ్ముడుపోవడం విశేషం.

అబ్దుల్ కలాం మాట..

-యువతకు ముఖ్యంగా నేనిచ్చే సందేశం ఏంటంటే.. భిన్నంగా ఆలోచించే సాహసం చేయండి. ఆవిష్కరణల్లో సాహసం చూపండి. ఎవరూ వెళ్లని దారిలో వెళ్లండి. అసాధ్యమనుకొనే దానిని కనిపెట్టేందుకు సాహసం చేయండి. సమస్యలను జయించండి. విజయాన్ని ఒడిసి పట్టండి. ఈ గొప్ప లక్షణాలను యువత తప్పక అలవర్చుకోవాలి.

-నా దృష్టిలో నాయకుడంటే లక్ష్యమున్నవాడు. అభిరుచి ఉన్నవాడు. సమస్యను చూసి భయపడకుండా దానిని ఎలా ఓడించాలో తెలిసినవాడు. పూర్తి చిత్తశుద్ధితో పనిచేయటం నాయకుడికి ఉండాల్సిన అత్యంత ముఖ్య లక్షణం.
-గొప్ప వ్యక్తులకు మతమంటే స్నేహాన్ని పెంపొందించేంది. అల్పులకు అది కొట్లాడుకొనేందుకు ఒక సాధనం.
-ఒకదేశం అవినీతి రహితం కావాలన్నా, గొప్ప మేధస్సులతో నిండాలన్నా సమాజంలో ముగ్గురివల్లనే సాధ్యమని నేను బలంగా నమ్ముతాను. వారే తల్లి, తండ్రి, గురువు.

-ప్రస్తుతం నిజమైన వైజ్ఞానిక కార్యకలాపాలన్నీ ఇంగ్లిష్‌లోనే కొనసాగుతున్నందున మనకు ఇంగ్లిష్ తప్పనిసరి. మన భాషల్లో నిజమైన వైజ్ఞానిక కార్యకలాపాలు మొదలవ్వటానికి మరో రెండు దశాబ్దాలు పడుతుందని నేను భావిస్తున్నాను. అప్పుడు మనం కూడా జపనీస్‌లాగా ముందుకు సాగవచ్చు. 
-మనిషికి కష్టాలూ అవసరమే.. ఎందుకంటే కష్టాలు ఉన్నప్పుడే విజయాలను ఆస్వాదించగలడు.
-విద్యార్థికి ఉండవల్సిన అతిముఖ్య లక్షణాల్లో ఒకటి ప్రశ్నించటం. విద్యార్థులారా ప్రశ్నించడం నేర్చుకోండి.
-మనం స్వేచ్ఛగా లేకపోతే.. ఎవరూ మనల్ని గౌరవించరు.
-కవిత్వమనేది అత్యున్నతమైన సంతోషం నుంచి లేదా అత్యంత విచారం నుంచే వస్తుంది.
Key Tags
Former President ,APJ abdhul kalaam died ,heart attack,Pranab Mukherjee, Prime Minister Modi,meghalaya,shillang

COMMENTS

పేరు

Adilabad AUDIO RELEASES ENTERTAINMENT GOSSIPS Health HYDERABAD INTERNATIONAL Job Search Jobs KARIMNAGAR KHAMMAM MAHABOOBNAGAR MEDAK MOVIE REVEWS NALGONDA NATIONAL NIZAMABAD Rangareddy SINGARENI NEWS TECHNOLOGY TELANGANA NEWS VIDEO SONGS WARANGAL worldcup2015
false
ltr
item
Tdaily.In - Telangana News: అబ్దుల్ కలాం అస్తమయం
అబ్దుల్ కలాం అస్తమయం
http://namasthetelangaana.com/updates/2015/July/28/apj.jpg
Tdaily.In - Telangana News
https://telugunewvideos.blogspot.com/2015/07/blog-post_178.html
https://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/2015/07/blog-post_178.html
true
2091677902228022841
UTF-8
Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS CONTENT IS PREMIUM Please share to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy