హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు తీపి కబురు అందించారు. కాని ఆ కబురే రోజు రోజుకు మరింత చేదవుతో...
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు తీపి కబురు అందించారు. కాని ఆ కబురే రోజు రోజుకు మరింత చేదవుతోంది. స్వయంగా సీఎం చెప్పినా...కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు మరింత ఆలస్యం కానున్నాయి. పలు సాంకేతికపరమైన అంశాలు ప్రతిబంధకంగా మారి జులైలో రావాల్సిన ఉద్యోగ నోటిఫికేషన్లు...ఎప్పుడొస్తోయో తెలియని పరిస్థితి నెలకొంది. ఉద్యోగాలు వస్తాయని కొన్నేళ్లపాటు నిరుద్యోగులు పోరుబాట పట్టారు. ఇప్పుడు రాష్ట్రం వచ్చింది. కాని వారికి ఉద్యోగాలు మాత్రం రాలేదు. ఏ చిన్న ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా తమ జీవితాలను సెటిల్ చేసుకుందామని కోటి ఆశలతో ఇన్నిరోజులు పుస్తకాలతో కుస్తీలు పట్టారు. ఇక నోటిఫికేషన్ రావడమే లేటు పరీక్ష రాసి ఉద్యోగం కొట్టేస్తామనే మంచి ధీమాతో ఉన్నారు. కాని వారి కలలు నిజం కావడానికి సరైన ముహుర్తమే రావడం లేదు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగుల్లో నిరాశ.. రాష్ట్రం ఏర్పాటయి జరిగిన ఏడాది గడిచింది. ఒక్క నోటిఫికేషన్ వెలువడలేదు. దీంతో నిరుద్యోగుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. యానివర్సిటీల్లో అనేక అందోళనలు మిన్నంటుతున్నాయి. డిగ్రీలు, పీజీలు చేతపట్టుకొని వేలాది మంది నిరుద్యోగ యువత రోజువారీగా కూలీలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మరో ప్రైవేట్రంగంలోనూ ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగులు లోలోపలే కుమిలిపోతున్నారు. డీఎస్సీ నిర్వహణకు మరింత సమయం-కడియం.. రాష్ట్ర అవతరణ దినోత్సవాల వేదికపై నుంచి సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు శుభవార్త వినిపించారు. వచ్చే నెలలో అంటే జూలై లో 25 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తున్నట్టు ప్రకటించారు. కాని కేసీఆర్ చేప్పినంత ఈజీ కాదని అధికారులు చేబుతున్నారు. తెలంగాణలో ప్రధానంగా 371 'డి' రాష్ట్రపతి ఉత్తర్వులు, నిరుద్యోగ వయోపరితి పెంపు, రూల్ అఫ్ రోస్టర్ విధానం పై ఇంత వరకు ఒక క్లారిటీ లేదు. ఇలా పలు న్యాయపరమైన సమస్యలు నోటిఫికేన్ల జారీ పక్రియకు ప్రతిబంధకంగా మారాయని అధికారులు చెప్పుకొస్తున్నారు. మరోవైపు కమలనాథ్ కమిటీ రాష్ట్ర స్థాయి ఉద్యోగుల పంపిణీ మరింత ఆలస్యం చేస్తున్నాయి. ఇవన్నీ అడ్డంకులు తొలగిపోవాలంటే దాదాపు మరో రెండు, మూడు నెలల సమయం పట్టవచ్చని సమాచారం. ఇటు విద్యా శాఖలోనూ డీఎస్సీ నిర్వహణకు కూడా మరింత సమయం పట్టొచ్చని మంత్రి కడియం అంటున్నారు. నోటిఫికేషన్ లు విడుదల చేయాలని డిమాండ్... మొత్తానికి ఈ సాంకేతిక కారణాలు, కమల్నాథన్ కమిటీ అడ్డంకులు ఎలావున్నా...నిరుద్యోగులు మాత్రం తీవ్ర అందోళనలో పడ్డారు. ఇప్పటికైనా..ప్రభుత్వం స్పందించి ఉద్యోగ నోటిఫికేషన్ల అంశాన్ని సీరియస్గా తీసుకొని యుద్ధప్రాతిపదికన నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.