(7 Jul) ప్రజలను కోరేది మొక్కలు నాటాలని మాత్రమేపచ్చదనం లేకనే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి: ముఖ్యమంత్రి కేసీఆర్హరితహారం ఘనతను దేశమంతా వివరి...
(7 Jul) ప్రజలను కోరేది మొక్కలు నాటాలని మాత్రమేపచ్చదనం లేకనే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి: ముఖ్యమంత్రి కేసీఆర్హరితహారం ఘనతను దేశమంతా వివరిస్తావునిప్రకటించిన కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ఈనాడు, నిజామాబాద్: ''రాష్ట్రంలో గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాకాలంలో ఎండలు మండిపోవడం ఏమిటి? కచ్చితంగా ఇవి మన మనుగడకు ప్రమాద ఘంటికలే. ఇప్పుడు అందరూ మేల్కొనపోతే, మొక్కల్ని పెంచకపోతే మున్ముందు పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. వూరూరా, వాడవాడలా, కొండలు, కోనలు, వాగులూ వంకలూ ఆడ, ఈడ, యాడ అని చూడకుండా ఎక్కడపడితే అక్కడ మొక్కలు నాటండి'' అని ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారంపై తనదైన శైలిలో పిలుపునిచ్చారు. సోమవారం నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆయన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేల్పూరు మండలం మోతె, వేల్పూరు, ఆర్మూరు, నిజామాబాద్, కామారెడ్డిలలో నిర్వహించిన బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి ప్రసంగించారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తన మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు అహర్నిశలూ శ్రమిస్తామని, అన్ని పనులూ చక్కదిద్దుతామని, ప్రజలు కూడా ఒక్క విషయంలో కష్టపడాలని, విరివిగా చెట్లు నాటి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. తాను అనుకున్న ప్రణాళిక ప్రకారం హరితహారం కార్యక్రమం విజయవంతమైతే రాష్ట్రమంతా పచ్చదనం సంతరించుకుని సుభిక్షంగా ఉంటుందని, రోళ్లు పగిలే ఎండలు ఉండే రోహిణి కార్తెలో సైతం వర్షాలు పడతాయని కేసీఆర్ జోస్యం చెప్పారు.మీడియా చేతులు కలపాలిహరితహారం మహత్తరమైన కార్యక్రవుమని దీన్ని విజయవంతం చేయడంలో మీడియా కూడా భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. చెట్లు నాటే కార్యక్రమంపై అవగాహన కల్పిస్తూ, స్ఫూర్తిదాయక కథనాలు రాస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. నాలుగేళ్లలో ప్రతి గ్రామంలో 1.60 లక్షలు, ప్రతి నియోజకవర్గంలో 2 కోట్లు.. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు నాటితే వూరూరా వనాలై పిలిస్తే వానలు వస్తాయని అన్నారు.దొడ్డ ముఖ్యమంత్రులు దొడ్డు బియ్యం ఇచ్చారు: సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని కేసీఆర్ అన్నారు. సంక్షేమ రంగాలపై రూ.28 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. గతంలో రాష్ట్రాన్ని ఏలిన ముఖ్యమంత్రులు దొడ్డ వారని, పలు సంక్షేమ పథకాలకు వారు దొడ్డు బియ్యం సరఫరా చేశారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. తాను బక్కగా ఉన్నానని, అందుకే సన్నబియ్యం ఇస్తున్నానని వ్యంగ్యంగా అన్నారు.నిర్బంధ ఉచిత విద్యనువేల్పూరు నుంచి అమలుచేస్తాంముఖ్యమంత్రి కేసీఆర్ మోతెలో మొక్కలు నాటిన అనంతరం గ్రామస్థులకు పలు వరాలు ప్రకటించారు. 2001లో ఈ గ్రామ మట్టితో తెలంగాణ సాధన పేరుతో ముడుపుకట్టిన నేపథ్యంలో ఈ వూరు తన వూరని పేర్కొన్నారు. గ్రామంలో రైతులందరికీ 100 శాతం రాయితీతో బిందుసేద్యం, ఇళ్లలేని వారి అందరికీ రెండు పడకలు ఇళ్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గ్రామంలో ఇతర సౌకర్యాల కోసం రూ.4 కోట్ల వరకూ నిధులు కేటాయించారు. అనంతరం వేల్పూరులో రైతులందరికీ 100 శాతం రాయితీతో బిందు సేద్యం, పసుపు ఆర పెట్టుకోవడానికి 200 ఫ్లాట్‌ఫారాలు నిర్మిస్తామని హావీు ఇచ్చారు. గ్రామంలో సకల హంగులతో కూడిన పాఠశాలను చూసి కేసీఆర్ అబ్బురపడ్డారు. వచ్చే ఏడాది ఇక్కడ నుంచే ఉచిత నిర్బంధ విద్యను ప్రవేశపెడతానని తెలిపారు.కేసీఆర్ నిర్ణయం భేష్-కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్తెలంగాణ సాధనకు ముఖ్యమంత్రి కేసీఆర్ అలుపెరగని పోరాటం చేశారని, ప్రత్యేక రాష్ట్రం సాధించిన ఘనత ఈయనకే దక్కుతుందని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ కొనియాడారు. మోతె, వేల్పూరు, ఆర్మూరులలో నిర్వహించిన హరితహారం కార్యక్రమాల్లో జవదేకర్ ముఖ్యమంత్రితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ వచ్చిందని కేసీఆర్ వూరికే కూర్చోకుండా ఇదే స్ఫూర్తితో ఉద్యమ పంథాలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయం అన్నారు. తెలంగాణలో అటవీ విస్తీర్ణాన్ని 24 శాతం నుంచి 33 శాతం వరకూ పెంచేందుకు చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి కోట్ల సంఖ్యలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం గొప్ప విషయన్నారు. తాను దేశంలో ఎక్కడకు వెళ్లినా హరితహారం గురించి వివరించి, అక్కడకు వెళ్లి చూడాలని కోరతానని జవదేకర్ అన్నారు. గత పాలకులు వైఖరి కారణంగా పర్యావరణ పరిరక్షణకు కేటాయించిన రూ.35 వేల కోట్లు బ్యాంకు ఖాతాల్లో మగ్గుతున్నాయని, న్యాయపరమైన చిక్కుల్ని అధిగమించి ఈ నిధులను హరితహారాన్ని ప్రోత్సహిస్తున్న రాష్ట్రాలకు కేటాయిస్తామని తెలిపారు.నిజాంసాగర్‌లో 365 రోజులు నీళ్లునిజామాబాద్ జిల్లాకు వరదాయిని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టు ఎండిపోవడం దురదృష్టకరమని కేసీఆర్ అన్నారు. దీని పైభాగంలో ఆంధ్ర పాలకులు సింగూరు జలాశయాన్ని నిర్మించి నిజాంసాగర్‌కు నీరు రాకుండా చేశారని విమర్శించారు. ఈ జలాశయం నుంచి రాజధానికి తరలించే నీటిని ఆపేసి, ఈ నీటిని నిజాంసాగర్‌కు విడుదల చేస్తే ఏడాది మొత్తంలో ఇందులో నీళ్లు ఉంటాయని తెలిపారు. హైదరాబాద్‌కు కృష్ణానది జలాలు తరలింపు పూర్తికాగానే, సింగూరు నుంచి నీటిని నిజాంసాగర్‌కు మళ్లించి నిజామాబాద్‌ను సస్యశ్యామలంచేస్తామని కేసీఆర్ భరోసా ఇచ్చారు.