హైదరాబాద్, జూలై 8: జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్‌పై ఆ పార్టీ కార్యకర్తలు బుధవారం జ...
హైదరాబాద్, జూలై 8: జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్‌పై ఆ పార్టీ కార్యకర్తలు బుధవారం జూబ్లిహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాల్క సుమన్‌పై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలు మాట్లాడుతూ పవన్‌ను విమర్శించే స్థాయి సుమన్‌కు లేదన్నారు. తమ అధినేతకు వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.