(14 Jul) ఉపాదిహామి సిబ్బందికి మద్దతుగా ప్రత్యక్ష కార్యాచరణకు సిద్దం ఆదిలాబాద్ : వేయిసార్లు దళితున్ని ముఖ్యమంత్రిగా చేస్తానని ప్రకటించి ప...
(14 Jul) ఉపాదిహామి సిబ్బందికి మద్దతుగా ప్రత్యక్ష కార్యాచరణకు సిద్దం ఆదిలాబాద్ : వేయిసార్లు దళితున్ని ముఖ్యమంత్రిగా చేస్తానని ప్రకటించి పచ్చి మోసం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ మోసగాడని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకఅధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. ఉద్యమంలో ముందున్న దళితున్ని ముఖ్యమంత్రి చేసి తాను పర్యవేక్షిస్తానని ప్రకటించి తెలంగాణ రాగానే ముఖ్యమంత్రి సీటుపై కూర్చుని దళితులని అనిచి వెెస్తున్నారని మందకృష్ణ ఆరోపించారు. ఉపాధిహామి సిబ్బంది సమస్యలపట్ల ముఖ్యమంత్రి నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆయన కొడుకు కేటీఆర్ పంచాయతీ రాజ్ శాఖ నిర్వహిస్తుండటంతో అడిగేవారు లేకుండాపోయారని ఆయన ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ కుటుంబానికి మాత్రమే అందాలమెక్కిస్తున్నారని అన్నారు. ఉపాధిహామి సిబ్బందికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టి ఒక రోజు దీక్షలు చేపడుతామని ఆ యన హామి ఇచ్చారు. జిల్లాకేంద్రంలో నిర్వహించిన శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలన , దొంగల పాలనసాగుతుందని ఎందరో మంది అవినీతి పరులకు అండదండలిస్తున్న ముఖ్యమంత్రి మాదిగ వర్గానికి చెందిన రాజయ్యను మాత్రం వివరణ కోరకుండా బర్తరఫ్ చేసిన దళిత ద్రోహి అని మందకృష్ణ మాదిగ అభివర్ణించారు. ఉద్యమంతో సంబంధం లేని అగ్రవర్ణాలకు మంత్రి పదవులు ఇచ్చిన ఆయన ఉద్యమంలో పనిచేసిన నల్లాల ఓదేలు , దుర్గం చిన్నయ్యలకు మొండిచేయి చూపారని , అదేవిధంగా ఒక్క మహిళకు కూడ మంత్రి పదవి ఇవ్వలేదని మందకృష్ణ ఆరోపించారు. ఈమేరకు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించిన ఎంఆర్పీఎస్ , ఎన్ఎస్ఎఫ్ల ఆధ్వర్యంలో మాదిగ , మాలలకు ప్రభుత్వంలో ప్రాతినిధ్యం కల్పించాలని చేపట్టిన దీక్షలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఇంద్రకరణ్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి ఓదేలును అవమానపర్చారని అడుగడుగున మాదిగ ,మాలలకు అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.