హైదరాబాద్ : గోదావరి పుష్కరాలు నాలుగో రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. బాసర నుంచి భద్రాద్రి వరకు పుష్కర శోభ సంతరించుకుంది. పుష్కరఘాట్లన్నీ భక...
హైదరాబాద్ : గోదావరి పుష్కరాలు నాలుగో రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. బాసర నుంచి భద్రాద్రి వరకు పుష్కర శోభ సంతరించుకుంది. పుష్కరఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతోన్నాయి. ఉదయం 4 గంటల నుంచే భక్తులు పుణ్యస్నానం ఆచరిస్తున్నారు. ఆలయాల్లో భక్తులు బారులు తీరారు. మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.