ఇబ్రహీంపట్నం: కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం మం డలం వేములకుర్తి శివారులోని గోదావరి నదిలో బాలమ్మ రేవు (పుష్కర ఘాట్) సమీపంలో మొసలి దొరకడం కలక...
ఇబ్రహీంపట్నం: కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం మం డలం వేములకుర్తి శివారులోని గోదావరి నదిలో బాలమ్మ రేవు (పుష్కర ఘాట్) సమీపంలో మొసలి దొరకడం కలకలం రేపింది. గురువారం ఉదయం నీటిలో చేపల కోసం మత్స్యకారులు వలలు వేశారు. ఓ మొసలి పిల్ల వలకు చిక్కింది. సుమారు ఐదు కిలోల బరువున్న మొసలి పిల్లను ఒడ్డుకు చేర్చి అధికారులకు సమాచారం అందించారు. పుష్కరాల ప్రత్యేకాధికారి, డీఆర్డీఏ పీడీ అరుణశ్రీ, తదితరులు అక్కడికి చేరుకొని మొసలి పిల్లను పరిశీలించారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి దానిని గోదావరి నదిలోని చింత కుర్రు (పారే నీటి) ప్రాంతంలో వదిలి పెట్టారు. పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు ఘాట్ల వద్దే స్నానాలు చేయాలని, నదిలోపకి వెళ్ల వద్దని ప్రత్యేక అధికారి అరుణశ్రీ సూచించారు. గోదావరి నదిలో మొసళ్లు తిరుగుతున్నాయంటూ తహసీల్దార్ శంకర్ హెచ్చరించిన రెండ్రోజులకే వేములకుర్తి బాలమ్మ రేవులో మొసలి కన్పించడంతో భక్తులు ఒకింత భయాందోళనకు గుర య్యారు. పుష్కర ఘాట్ల వద్దకు మాత్రమే భక్తులను అనుమతించాలని, లోపలికి వెళ్లనీయవద్దని పుష్కర ఘాట్ల అధికారులకు ప్రత్యేక అధికారి సూచించారు.