చంద్రబాబు మరో భారీ కుట్ర - బహిర్గత పర్చిన వికీలీక్స్ ! ప్రపంచ వ్యాప్తంగాఅనేక కుంభకోణాలను, అక్రమాలను బైట పెట్టిన వికీలీక్స్ సంస్థ ఇప్పుడ...
చంద్రబాబు మరో భారీ కుట్ర - బహిర్గత పర్చిన వికీలీక్స్ !
ప్రపంచ వ్యాప్తంగాఅనేక కుంభకోణాలను, అక్రమాలను బైట పెట్టిన వికీలీక్స్ సంస్థ ఇప్పుడు చంద్ర బాబు నాయుడు కుట్రను బయట పెట్టింది. అక్రమ పద్దతిలో ఫోన్లు ట్యాపింగ్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్దపడ్డారని వికీలిక్స్ పరిశోధనలో వెల్లడైంది. దానికోసం 7.5 కోట్ల రూపాయలతో టెక్నాలజీని కొనుగోలు చేయడం కోసం సింగపూర్ లోని హాకింగ్ డాట్ కామ్ అనే సంస్థతో సంప్రదింపులు జరిపినట్టు వికీలీక్స్ బయట పెట్టింది. నమస్తే తెలాంగాణ పత్రిక కథనం ప్రకారం.... ఈ మెయిల్స్, సెల్ ఫోన్లు, లాండ్ ఫోన్లను ట్యాపింగ్ చేసే టెక్నాలజీని సింగపూర్ కంపెనీ నుండి కొనుగోలు చేయడం కోసం జరిపిన ఈ మెయిల్ సంప్రదింపులను వికీలీక్స్ బయట పెట్టింది. హైదరా బాద్ జూబ్లీ హిల్స్ లోఉన్న ఓర్టస్ కంపెనీ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఈ మొత్తం వ్యవహారానికి మధ్యవర్తిగా వ్యవహరించారని వికీలీక్స్ చెప్పింది. జూన్ 12 న సింగపూర్ హాకింగ్ డాట్ కామ్ చీఫ్ మగ్లిట్టా తో ప్రభాకర్ రెడ్డి మెయిల్ ద్వారా సంప్రదింపులు జరిపాడు. తమ క్లైంట్ అయిన ఏపీ పోలీసుల కోసం అత్యవసరంగా 50 సెల్ ఫోన్లను ట్యాపింగ్ చేసేందుకు అవసరమైన టెక్నాలిజీ కావాలని ప్రభాకర్ రెడ్డి అడిగారు. అందుకోసం 7.5 కోట్ల రూపాయలు చెల్లించేందుకు ఒప్పందం చేసుకొని ఆర్డర్ కూడా బుక్ చేశారు... వికీలీక్స్ శుక్రవారం బైటపెట్టిన 10 లక్షల ఈ మెయిల్లలో చంద్రబాబు చేసిన కుట్ర కూడా బహిర్గతమైంది
హాకింగ్ డాట్ కాం కథేంటి ?
ఇటలీలోని మిలాన్ కేంద్రంగా గిజ్మోడో హాకింగ్‌టీమ్ సంస్థ పనిచేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా పోలీసులు, ఇంటెలిజన్స్ సంస్థలకు ఫోన్లను ట్యాప్ చేసే సాప్ట్‌వేర్‌ను చట్టబద్ధమైన పద్ధతుల్లో అమ్ముతున్నామని బాహాటంగా చెప్తున్నా ఈ సంస్థ బ్లాక్‌బెర్రీ, అ్రండాయిడ్, ఆపిల్ పోన్లలో నిఘాపెట్టే సాప్ట్‌వేర్‌ను లోడ్‌చేసే పరికరాలు అమ్ముతారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికే రష్యా, సౌదీ అరేబియా తదితర దేశాలకు ఇలాంటి సాప్ట్వేర్ అమ్మింది. ఆసియాలో ఈ సంస్థకు సింగపూర్‌లో రిప్రజెంటేటివ్ కార్యాలయం ఉంది. దానికి చీఫ్‌గా మగ్లిట్టా పనిచేస్తున్నారు.
ఇక జూబ్లీ హిల్స్ లో ఉన్న ఓర్టస్ కంపెనీ కథేంటి?
ఇది ఐటీ కన్సల్టెన్సీ సంస్థ. దీని రిజిస్టర్ ఆఫీస్ జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్ 7 లోని బీ6 ఇంటినెంబర్‌తో ఉంది. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా రిజిస్టర్ అయిన ఈ సంస్థ డైరెక్టర్లుగా కాసు ప్రభాకర్‌రెడ్డి, జోత్స్నరెడ్డి, కుంజిబెట్టు విష్ణుదాస్ ప్రభు ఉన్నారు. ఇప్పుడు ఏపీ పోలీసుల కోసం సింగపూర్ సంస్థ నుండి హ్యాకింగ్ టెక్నాలజీ కొనుగోలు చేసింది.
అయితే ఓటు కు నోట్లు వ్యవహారంలో అడ్డంగా దొరికి పోయిన తర్వాత ప్రతీకారం తో రగిలి పోతున్న బాబు ఈ ట్యాపింగ్ సామాగ్రి ని తెలంగాణ నాయకుల మీద ప్రయోగించడానికే ఉపయోగించనున్నారా అనే అనుమానం రావడం సహజం
ఇక వికీలీక్స్ ఇన్ని విషయాలు బహిర్గతం చేసిన తర్వాత ఇప్పుడు చంద్రాబాబు ఏంచేస్తారు ? తమ ఫోన్లు ట్యాపింగ్ ఎలా చేస్తారంటూ కొంత కాలంగా హంగామా సృష్టిస్తున్న ఆయన దీని పై ఏం జవాబు చెప్తారు? నిజంగా ఆసక్తికరమే !
Source : avaninews.com