పాలమూరుపై బాబు కుట్ర: హరీశ్‌

ఎత్తిపోతల ప్రాజెక్టు కట్టి తీరుతాం.. బాబుకు వలస కూలీల ఉసురు తాకుతుంది వంకర బుద్ధి.. ఓర్వలేని మనస్తత్వం ఆయనది ఇది కొత్తది కాదు.. ఉమ్మడ...

paalamurupai baabu kutra: harish
  • ఎత్తిపోతల ప్రాజెక్టు కట్టి తీరుతాం..
  • బాబుకు వలస కూలీల ఉసురు తాకుతుంది
  • వంకర బుద్ధి.. ఓర్వలేని మనస్తత్వం ఆయనది
  • ఇది కొత్తది కాదు.. ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో
  • వచ్చే నెలలో టెండర్లు పిలుస్తాం: హరీశ్‌ 
  • అడ్డుకునే హక్కు మీకెక్కడిది?: జూపల్లి 
  • నేడు పాలమూరు జిల్లా బంద్‌కు పిలుపు 
హైదరాబాద్‌/మహబూబ్‌నగర్‌,: మహబూబ్‌నగర్‌ జిల్లాకు సాగు, తాగు నీరు, హెచ్‌ఎండీఎ పరిధిలోనూ తాగునీటి సమస్య తీర్చే పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును ఎట్టిపరిస్థితిలోనూ కట్టి తీరుతామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లను వచ్చే నెలలో పిలుస్తామని, ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణకు అథారిటీని కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి రాసిన లేఖపై స్పందించిన కేంద్రజలసంఘం (సీడబ్ల్యూసీ).. తెలంగాణ ప్రభుత్వాన్ని వివరణ కోరుతూ లేఖ పంపింది. ఈ మేరకు గురువారం తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన హరీశ్‌రావు.. తెలంగాణ, ఆంధ్రా రెండూ తనకు రెండు కళ్లు అంటూ చెప్పే చంద్రబాబు పాలమూరు జిల్లాకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ద్రోహబుద్ధితో వ్యవహరిస్తున్న ఆయనకు.. వలస కూలీల ఉసురు తగులుతుందన్నారు. ఈ ప్రాజెక్టును నిలిపి వేయాలని కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబు పాలమూరు ప్రజల నోటికాడిబుక్కను లాగేసే కుట్ర చేస్తున్నారని, ఆయన కూడా హైదరాబాద్‌లోనే ఉంటున్నారని, అయినా నగర ప్రజల తాగునీటికి కూడా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టుకు అనుమతి లేదని చెప్తున్న ఆంధ్రా సీఎం.. మరి పట్టిసీమ ప్రాజెక్టుకు ఏ అనుమతులు తీసుకున్నారని ప్రశ్నించారు. ఇలాగే వ్యవహరిస్తే.. హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రా ప్రజలే చంద్రబాబును రాళ్లతో తరిమికొట్టే పరిస్థితి వస్తుందన్నారు. 'హైదరాబాద్‌ నగరం అభివృద్ధి చెందొద్దని, ఇక్కడి ప్రజలు ఇబ్బందిపడాలని, ఐటీ పరిశ్రమలు రావొద్దన్న కుట్రతో చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తానుండే ప్రాంతానికి తాగునీళ్లొదనే వారుంటారా? ప్రపంచంలో అలాంటి వారు ఉన్నారంటే అది చంద్రబాబేనని ధ్వజమెత్తారు. చంద్రబాబు లాంటి వారి వల్లనే పాలమూరు వలసల జిల్లాగా మారిందన్నారు. ఆయన పాలమూరును దత్తత తీసుకున్నా ఏమీ చేయలేదని విమర్శించారు. కుక్కతోక వంకర అన్న రీతిలో.. వంకర బుద్ధితో పక్కవాడు బాగుంటే ఓర్వలేని మనస్తత్వం ఉన్న ఆంధ్రా సీఎం.. పాలమూరు ప్రాజెక్టును అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. దేశంలోనే అత్యఽధికంగా వలసలు వెళ్లేది పాలమూరు జిల్లా నుంచేనని, అలాంటి జిల్లాను ఆదుకోవాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ఈ ప్రాజెక్టును చేపడుతున్నారని పేర్కొన్నారు. అయినా ఇదేం కొత్త ప్రాజెక్టు కాదని, గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే ఈ ప్రాజెక్టు సర్వేకు 6.91 కోట్లు కేటాయించారని, తర్వాత సీఎంగా కిరణ్‌కుమార్‌రెడ్డి జీవో 72ను జారీ చేసి ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తాజాగా 32,500 కోట్లతో పాలమూరు ప్రాజెక్టును చేపడుతోందని ఆయన తెలిపారు. కాగా, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు సమైక్యరాష్ట్రంలోనే అనుమతి వచ్చినా, కొత్త ప్రాజెక్టు అంటూ చంద్రబాబు సీడబ్ల్యూసీకి లేఖ రాయడం దుర్మార్గపు చర్య అని పాలమూరు టీఆర్‌ఎస్‌ నేతలు ధ్వజమెత్తారు. భారీ పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఎస్‌.నిరంజన్‌రెడ్డి, ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డిలు మహబూబ్‌నగర్‌లో గురువారం విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టును అడ్డుకునే హక్కు ఆయనకెక్కడిదంటూ నిలదీశారు. చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ, ఆ పార్టీకి చెందిన జిల్లా నేతలు టీడీపీకి రాజీనామా చేయాలని, తాము చేపట్టబోయే పాలమూరు ప్రాజెక్టు ఉద్యమంలో పాల్గొనాలని సూచించారు. చంద్రబాబు తలకిందులు తపస్సు చేసినా, ఆయన తాత వచ్చినా ప్రాజెక్టును పూర్తిచేసి తీరుతామని తేల్చిచెప్పారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు మహబూబ్‌నగర్‌ జిల్లాను దత్తత తీసుకున్న చంద్రబాబు.. అదే జిల్లాలో ప్రాజెక్టు పనులు అడ్డుకోవడమంటే సిగ్గూ, శరం ఉండాలని మండిపడ్డారు. నాడు జిల్లాలో పేదరికాన్ని చూపించిన చంద్రబాబు, ప్రపంచబ్యాంకు నుంచి నిధులు తెచ్చారని, ఆ నిధులను ఆంధ్ర ప్రాంతంలో వెచ్చించారని ఆరోపించారు. పాలమూరు ఎత్తిపోతల కోసం ఎంతటి ఉద్యమానికైనా సిద్ధమని ప్రకటించారు. పునర్విభజన చట్టం ప్రకారం పాలమూరు ఎత్తిపోతల కొత్త ప్రాజెక్టు కానేకాదన్నారు. చంద్రబాబుకు అసలు ఇంగ్లీషు వచ్చా? అని ప్రశ్నించారు. తెలంగాణ టీడీపీ నాయకులు ప్రజల వైపు ఉంటారో, చంద్రబాబువైపు ఉంటారో చెప్పాలని ఎమ్మెల్యే శ్రీనివా్‌సగౌడ్‌ డిమాండ్‌ చేశారు. పాలమూరు ఎత్తిపోతలను అడ్డుకునే శక్తి ఎవరికీ లేదన్నారు. కాగా, చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడాన్ని నిరసిస్తూ శుక్రవారం పాలమూరు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చినట్లు టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు శివకుమార్‌ ప్రకటించారు. వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థల యాజమాన్యాలు సహకరించాలని ఆయన కోరారు. ఈ బంద్‌కు జిల్లా జేఏసీ, ప్రయివేటు విద్యాసంస్థలు, విద్యార్థిసంఘాలు మద్ధతు ప్రకటించాయి. మరోవైపు.. చంద్రబాబు విధానాలను నిరసిస్తూ గురువారం జిల్లావ్యాప్తంగా పలుచోట్ల టీఆర్‌ఎస్‌, టీఆర్‌ఎ్‌సవీ కార్యకర్తలు ఆయన దిష్టిబొమ్మలను దహనం చేశారు. కాగా, వరంగల్‌ జిల్లా ములుగులో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటాన్ని దహనం చేశారు.

COMMENTS

పేరు

Adilabad AUDIO RELEASES ENTERTAINMENT GOSSIPS Health HYDERABAD INTERNATIONAL Job Search Jobs KARIMNAGAR KHAMMAM MAHABOOBNAGAR MEDAK MOVIE REVEWS NALGONDA NATIONAL NIZAMABAD Rangareddy SINGARENI NEWS TECHNOLOGY TELANGANA NEWS VIDEO SONGS WARANGAL worldcup2015
false
ltr
item
Tdaily.In - Telangana News: పాలమూరుపై బాబు కుట్ర: హరీశ్‌
పాలమూరుపై బాబు కుట్ర: హరీశ్‌
http://acdn.newshunt.com/fetchdata5/20150710/jyothy/telangana/images/350x350_IMAGE41797832.png
Tdaily.In - Telangana News
https://telugunewvideos.blogspot.com/2015/07/blog-post_41.html
https://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/2015/07/blog-post_41.html
true
2091677902228022841
UTF-8
Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS CONTENT IS PREMIUM Please share to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy