-పరిశోధన ప్రారంభించిన మార్స్ రోవర్ క్యూరియాసిటీ వాషింగ్టన్, జూలై 30: అంగారక గ్రహంపై మారియాస్ పాస్ అనే ప్రాంతంలో కనుగొన్న సిలికా రాతి ...
-పరిశోధన ప్రారంభించిన మార్స్ రోవర్ క్యూరియాసిటీ
వాషింగ్టన్, జూలై 30: అంగారక గ్రహంపై మారియాస్ పాస్ అనే ప్రాంతంలో కనుగొన్న సిలికా రాతి పలకల లక్ష్యాలపై నాసా మార్స్ రోవర్ క్యూరియాసిటి విస్తృత పరిశోధనల్ని ప్రారంభించింది. పక్క పక్కనే ఉన్న గట్టి ఇసుకరాయి, మృదు స్వభావమున్న రాయిని మారియాస్ పాస్ వద్ద మార్స్ హ్యాండ్ లెన్స్ ఇమేజర్ (మహ్లి) ద్వారా గుర్తించామని క్యూరియాసిటీ బృంద సభ్యులు పేర్కొన్నారు. వీటిని ఎల్క్గా పరిశోధకులు
వ్యవహరిస్తున్నారు. ఆరు మీటర్ల ఎత్తు ఉన్న గుట్టపైకి రోవర్ చేరుకుని రెండు ప్రత్యేక రాతి పలకలను విశ్లేషించింది. ఆ తర్వాత సిలికాన్, హైడ్రోజన్‌తో కూడిన లేజర్ ఫైరింగ్ కెమిస్ట్రీ అండ్ కెమెరా (కెమ్కామ్), డైనమిక్ అల్బెడో న్యూట్రాన్స్ (డీఏఎన్) అనే పరికరంతో ఫైర్ చేశామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 2012 ఆగస్టు 6న అంగారక గ్రహంపై ల్యాండ్ అయిన తర్వాత కెమ్కామ్ దృష్టికి వచ్చిన 1000 లక్ష్యమని, ఇప్పటికే 260000 సార్లు లేజర్‌తో ఫైర్ చేశామన్నారు.
సిలికాన్, ఆక్సిజన్ మూలకాల సమ్మేళనంతో ఉన్న సిలికా రాతిపలకలను ప్రాచీనకాలంలో ఆర్గానిక్ మెటీరియల్‌ను నిల్వ ఉంచేందుకు వినియోగించేవారని తెలిపారు. అంగారకుడిపై అటువంటి పలకలున్నాయని స్పష్టమైన నిర్ధారణకు వస్తే తమ బృందం మరింత పరిశోధన కొనసాగిస్తుందని న్యూమెక్సికోకు చెందిన లాస్ అల్మాస్ నేషనల్ ల్యాబొరేటరీకి చెందిన రోజర్ వీన్స్ తెలిపారు. సాధారణంగా భూమిపైనే కనిపిస్తాయి. ఇప్పటివరకు అంగారక గ్రహంపై ఇలాంటి రాతిపలకలున్న విషయం తమ దృష్టికి రాలేదు అని క్యూరియాసిటీ బృంద సభ్యులు పేర్కొన్నారు.