(2 Jul) నీతి బాహ్యమైన చర్యలకు పాల్పడడమే కాకుండా రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా తాను ఓ పెద్ద మగాడినని మీసం మెలేయడం ఆయన దిగజారుడుత...
(2 Jul) నీతి బాహ్యమైన చర్యలకు పాల్పడడమే కాకుండా రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా తాను ఓ పెద్ద మగాడినని మీసం మెలేయడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో బెయిల్‌పై విడుదలైన తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సిగ్గుపడాల్సింది పోయి మీసం మెలిస్తున్నారని మండిపడ్డారు. ఏం గొప్ప పనిచేశాడని హైదరాబాద్ నిండా పోస్టర్లు, ర్యాలీలు..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం వరంగల్‌కు వచ్చిన ఆయన హన్మకొండలోని సుందరయ్యభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. అవినీతి కంపుతో రాజకీయాలు పరాకాష్టకు చేరాయని, కాంగ్రెస్ నేత ధర్మపురి శ్రీనివాస్ పార్టీ మారడం సరికాదన్నారు. ఒకప్పుడు పార్టీ సిద్ధాంతాలు, పద్ధతులు నచ్చక పార్టీలు మారేవారు.. ఇప్పుడేమో పదవుల కోసం పార్టీలు మారుతున్నట్లు బహిరంగంగానే ప్రకటిస్తున్నారని అన్నారు.