(6 Jul) హైదరాబాద్ : గ్రీసులో ఆర్థిక సంక్షోభం మరింత పెరగనుంది. రుణభారంతో అల్లాడుతున్న గ్రీసు దేశంలో రెఫరెండం ప్రక్రియ ముగిసింది. రుణదాతలు ...
(6 Jul) హైదరాబాద్ : గ్రీసులో ఆర్థిక సంక్షోభం మరింత పెరగనుంది. రుణభారంతో అల్లాడుతున్న గ్రీసు దేశంలో రెఫరెండం ప్రక్రియ ముగిసింది. రుణదాతలు పేర్కొన్న వ్యయ నియంత్రణ చర్యలపై రెఫరెండం నిర్వహించారు. ఐఎంఎఫ్, యూసీబీ సంస్థల నిబంధనలపై ప్రజాభిప్రాయ సేకరణకు రెఫరెండం నిర్వహించారు. మిత వ్యయ చర్యలను గ్రీస్ ప్రజలు వ్యతిరేకించారు. ప్రజాభిప్రాయ సేకరణలో 'నో'కు అధిక మెజార్టీ మద్దతు లభించింది. యూరో జోన్ నుంచి గ్రీస్ బయటకు రానుంది. ఈ క్రమంలో రేపు యూరో జోన్ దేశాలు సమావేశం కానున్నాయి. గ్రీసు ప్రజల ప్రజాభిప్రాయ సేకరణ ఫలితంపై చర్చించనున్నారు. గ్రీసు ప్రధానిగా సిప్రస్ కొనసాగనున్నారు.