(7 Jul) ఈ దిశగా చర్యలు తీసుకొన్న తొలి రాష్ట్రం ఇదేఐటీ మంత్రి కేటీఆర్ వెల్లడిసైబర్ భద్రతపై సీఆర్‌రావు సంస్థతో ఒప్పందంశ్యాంసంగ్ డిజిటల్...
(7 Jul) ఈ దిశగా చర్యలు తీసుకొన్న తొలి రాష్ట్రం ఇదేఐటీ మంత్రి కేటీఆర్ వెల్లడిసైబర్ భద్రతపై సీఆర్‌రావు సంస్థతో ఒప్పందంశ్యాంసంగ్ డిజిటల్, నాస్కాం ఫౌండేషన్..ఉబెర్ సంస్థలతో అవగాహనా ఒప్పందాలు
హైదరాబాద్బర్ నేరగాళ్ల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు వెబ్సైట్లకు రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకొన్న మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. రాష్ట్రాన్ని డిజిటలైజేషన్ చేసే దిశగా అడుగులేస్తున్న ప్రభుత్వం.. సైబర్ వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకొంటుందన్నారు. డిజిటల్ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంస్థలతో అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. ప్రముఖ క్యాబ్ సంస్థ ఉబెర్, సైబర్ సెక్యూరిటీపై సీఆర్‌రావు సంస్థ, యువ గ్రాడ్యుయేట్లలో నైపుణ్యం పెంపునకు శ్యాంసంగ్ సంస్థల ప్రతినిధులు పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు చేశారు. స్వచ్ఛ డిజిటల్ తెలంగాణకు సంబంధించి మాదాపూర్‌లోని టెక్‌మహీంద్ర ప్రధాన క్యాంపస్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో స్వచ్ఛ ఐటీ పార్కులే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు వివరించారు. ఈ దిశగా సత్ఫలితాలు సాధించిన ఆయా సంస్థల ప్రతినిధులను చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వరరెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ, మంత్రి కేటీఆర్ సన్మానించారు. సీఆర్‌రావు సంస్థ ఛైర్మన్, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ సి.రంగరాజన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొన్న చర్యలు అభినందనీయమన్నారు. ఒప్పందంలో భాగంగా సైబర్ సెక్యూరిటీ అకాడమీని ఏర్పాటు చేసి సైబర్ వారియర్స్ పేరిట నిపుణులను నియమిస్తామన్నారు.రూ.300కోట్ల ఉబెర్ పెట్టుబడులుతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందంలో భాగంగా ప్రముఖ క్యాబ్ సర్వీసెస్ సంస్థ ఉబెర్ హైదరాబాద్ కేంద్రంగా వచ్చే ఐదేళ్లలో రూ.300 కోట్లకు పైగా (50 మిలియన్ అమెరికన్ డాలర్లు) పెట్టుబడి పెట్టనుంది. సురక్షితమైన ప్రయాణంతో బాటు పదివేలమందికి ఉద్యోగావకాశాలు వస్తాయని ఆ సంస్థ పేర్కొంది. 2016 నాటికి తెలంగాణ నైపుణ్య, విజ్ఞాన అకాడమీ (టాస్క్)తో కలసి సుమారు 2వేల మందికి ఉపాధి కల్పిస్తామంది. ఉబెర్ వాహన పైనాన్స్ ద్వారా అర్థికంగా తోడ్పాటు అందనుంది.సైబర్ సెక్యూరిటీపై ...సైబర్ సెక్యూరిటీపై తెలంగాణ ప్రభుత్వం సీఆర్ రావు అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్సెస్ (ఏఐఎంఎస్సీఎస్) సంస్థతో అవగాహన కుదుర్చుకుంది. దీనిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వ డేటాబేస్‌ను పరిరక్షిస్తుంది. ఏఐఎంఎస్సీఎస్ కొత్తగా సైబర్ సెక్యూరిటీ అకాడమీని ఏర్పాటు చేయనుంది. మంత్రి కేటీఆర్, సంస్థ ఛైర్మన్, మాజీ గవర్నర్ సి.రంగరాజన్‌ల సమక్షంలో సంస్థ డైరెక్టర్ అల్లం అప్పారావు, ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్లు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.శ్యాంసంగ్ డిజిటల్ అకాడమీతోఒప్పందంలో భాగంగా విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి దోహదపడేందుకు శ్యాంసంగ్ డిజిటల్ అకాడమీ తోడ్పాటును అందిస్తుంది. యువ గ్రాడ్యుయేట్లకు ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు ఇది దోహదపడుతుందని టాస్క్ సీఈఓ సుజీవ్ నాయర్ తెలిపారు. కొత్తతరం సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తోందని శ్యాంసంగ్ వైస్ప్రెసిండెంట్ దీపక్ భరద్వాజ్ అన్నారు. తెలంగాణలో ప్రతికుటుంబంలో ఒకరు డిజిటల్ అక్షరాస్యులుగా మార్చేందుకు నాస్కాం ఫౌండేషన్ తోడ్పాటును అందించనుంది. రాష్ట్ర ప్రభుత్వంతో కుదిరిన అవగాహన ఒప్పందంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌రంజన్, నాస్కాం ఫౌండేషన్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా సంతకాలు చేశారు.