(6 Jul) ఆదిలాబాద్ జిల్లా గురించి తనకు పూర్తిగా అవగాహన ఉందని.. ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేయడానికి రాష్ట్ర అధికారుల బృందంతో కలిసి వస్తా...
(6 Jul) ఆదిలాబాద్ జిల్లా గురించి తనకు పూర్తిగా అవగాహన ఉందని.. ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేయడానికి రాష్ట్ర అధికారుల బృందంతో కలిసి వస్తానని.. మూడు నాలుగు రోజులపాటు ఇక్కడే ఉండి అధ్యయనం చేసి సమస్యలను పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా ప్రజలకు భరోసా ఇచ్చారు. ప్రస్తుతమున్న ప్రాజెక్టులను కొనసాగిస్తూనే.. కొత్తగా ప్రాజెక్టులు తీసుకొచ్చి జిల్లాలో అంగుళం మిగలకుండా సాగునీటిని అందిస్తానని హామీ ఇచ్చారు. దేశానికి కశ్మీరు ఎలాగో తెలంగాణకు ఆదిలాబాద్ అలాంటిదని.. భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. కరీంనగర్ జిల్లాలో హరితహారం బస్సుయాత్ర ముగించుకున్న కేసీఆర్ జిల్లాకు నాలుగు గంటలు ఆలస్యంగా వచ్చారు. ఆయన బస్సు యాత్ర దండేపల్లి మండలం గూడెం, జన్నారం, కడెం, మామడలలో కొనసాగింది. అప్పటికే రాత్రి పొద్దుపోవడంతో నిర్మల్‌కు వెళ్లకుండానే నిజామాబాద్‌కు వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సుయాత్ర ఆదివారం సాయంత్రం జిల్లాకు చేరుకుంది. వచ్చీరాగానే 30 వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు నిర్మించిన గూడెం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. అక్కడ మొక్క నాటిన సీఎం సమీపంలో మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు, కడెంలో ఎమ్మెల్యే రేఖా నాయక్‌ల అధ్యక్షతన జరిగిన బహిరంగ సభల్లో మాట్లాడారు. జిల్లాలో తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించాలనుకున్న ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుతో జిల్లాకు కలిగే ప్రయోజనాలు లేవని కొట్టిపారేశారు. అక్కడ నిర్మిస్తే 600 కిలోమీటర్ల దూరంలోని చేవెళ్లకు నీటిని తీసుకెళ్లడం సాధ్యం కాదనే విషయాన్ని వెలిబుచ్చారు. కేసీఆర్ మాట్లాడుతున్న సమయంలో గతంలో ప్రకటించిన విధంగానే తుమ్మిడిహెట్టి వద్దనే ప్రాణహితను నిర్మించాలని.. కొత్తగా కాళేశ్వరం వద్ద నిర్మిస్తే జిల్లాకు అన్యాయం జరుగుతుందని న్యూడెమ్రోకసీ నేతలు ఫ్లెక్సీలను ప్రదర్శించారు. దీనిపై కేసీఆర్ తీవ్రంగానే స్పందించారు. జల సాధన సమితి నాయకుడు నైనాల గోవర్ధన్‌పై విమర్శలు చేశారు. ప్రాణహిత ప్రాజెక్టును జిల్లాలో నిర్మించినా ప్రయోజనం ఉండదనే విషయాన్ని స్పష్టం చేశారు. కేసీఆర్ తన ప్రసంగం ద్వారా జిల్లాకు ప్రతి ఎకరాకు సాగునీటిని అందించేందుకు కృషి చేస్తాననే హామీ ఇచ్చారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా జిల్లా వెనుకబడిన విషయాన్ని గుర్తుచేశారు. ఏ జిల్లాలోనూ లేనటువంటి వనరులు జిల్లాలో ఉన్నాయని.. సగటున 12 సెంటీ మీటర్ల వర్షపాతం ఉన్నా జిల్లా కరవు బారిన పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని వాగులు, వంకలను అనుసంధానం చేయడం ద్వారా 1.50 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించవచ్చని అన్నారు. ఎస్సారెస్పీ ద్వారా నిర్మల్ ప్రాంతంలో లక్ష ఎకరాలకు సాగునీటిని అందించనున్నామన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులను కొనసాగిస్తూనే కొత్తగా ప్రాజెక్టులు తీసుకొచ్చి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని హామీఇచ్చారు. ఖానాపూర్ వద్ద గోదావరిపై ఉన్న సదర్మాట్పైనా అధ్యయనం చేసి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం తాను హరితహారం కార్యక్రమంలో పాల్గొనడానికే జిల్లాకు వచ్చానని.. దివాకర్‌రావు అడిగినట్లు ఇప్పటికిప్పుడు నిధులు ఇవ్వలేనని కేసీఆర్ చెప్పారు. ఏదో ఒక్క రోజులో వచ్చిపోతే కాదని.. గోదావరి పుష్కరాల తర్వాత మళ్లీ జిల్లాకు వస్తానన్నారు. రాష్ట్ర అధికారుల బృందంతో జిల్లాలోనే మూడు నాలుగు రోజుల పాటు ఇక్కడే ఉండి అభివృద్ధిపై అధ్యయనం చేస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో తిరిగితేనే సమస్యలు తెలుస్తాయని చెప్పారు. ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వాల తీరును ఎండగట్టారు. కాంగ్రెస్, తెదేపా పాలకులు, నేతల నిర్లక్ష్యం వల్లే అన్ని వనరులున్న ఆదిలాబాద్ జిల్లా వెనుకబాటుకు గురైందని కేసీఆర్ అన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో వైఎస్ కొంపముంచారని విమర్శించారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా.. వారితో ఒప్పందం లేకుండానే పనులు మొదలు పెట్టి అంతర్రాష్ట్ర వివాదానికి కారణమయ్యారన్నారు. దీని పేరుతో నాయకులు రూ.4 వేల కోట్లను జేబుల్లో వేసుకున్నట్లు దుయ్యబట్టారు. ప్రాజెక్టులుంటే కాల్వలు ఉండేవి కాదని.. కాల్వలుంటే ప్రాజెక్టులు లేవని గత ప్రభుత్వాల తీరును ఎండగట్టారు. తాము మాత్రం చెప్పింది చేస్తామన్నారు. ఇందుకు నిదర్శనమే లోయర్ పెన్‌గంగ అని గుర్తుచేశారు. ఆదిలాబాద్ జిల్లాలోనూ అడవులు తగ్గాయని.. ఇప్పుడు అడవులను కాపాడాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఉన్న అడవులను కోల్పోయి తెలివితక్కువ పనులు చేయవద్దని కోరారు. అడవుల అభివృద్ధికి రూ.100 కోట్లు ఖర్చుచేయనున్నట్లు చెప్పారు. దేశానికి కశ్మీరు ఎలాగో తెలంగాణకు ఆదిలాబాద్ కూడా అలాగేనని.. జిల్లాను మరో కశ్మీరుగా అభివృద్ధి పరచి.. పర్యటకులను ఆకర్షించేలా చేస్తానన్నారు. కార్యక్రమంలో మంత్రులు హరీష్‌రావు, జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీలు బాల్క సుమన్, నగేశ్, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, దివాకర్‌రావు, రాఠోడ్ బాపురావు, కోవ లక్ష్మీ, రేఖానాయక్, నల్లాల ఓదెలు, విఠల్‌రెడ్డి, దుర్గం చిన్నయ్య, జిల్లా పాలనాధికారి జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.