(7 Jul) పదివేలలోపు ర్యాంకుండే విద్యార్థులందరికీ చెల్లింపులు371-డి నిబంధన వర్తింపు1000 మంది ఈసెట్ విద్యార్థులకు కొత్తగా సహకారంముఖ్యమంత్రి...
(7 Jul) పదివేలలోపు ర్యాంకుండే విద్యార్థులందరికీ చెల్లింపులు371-డి నిబంధన వర్తింపు1000 మంది ఈసెట్ విద్యార్థులకు కొత్తగా సహకారంముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలుఉపముఖ్యమంత్రి కడియం వెల్లడిషెడ్యూలు ప్రకారమే ఇంజినీరింగు కౌన్సెలింగుఈనాడు - హైదరాబాద్, న్యూస్టుడే - వరంగల్లంగాణ రాష్ట్రంలో దళిత, గిరిజన, వెనకబడిన తరగతుల, అల్పసంఖ్యాకవర్గాల విద్యార్థులకు 2015-16 విద్యాసంవత్సరంలో బోధనరుసుములు, ఉపకారవేతనాల పథకం(ఫీజు రియంబర్స్మెంటు)పై ప్రభుత్వం విధాననిర్ణయం తీసుకుంది. పథకాన్ని నిరుటి మాదిరే యథాతథంగా అమలుచేస్తామని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఎంసెట్లో పదివేలలోపు ర్యాంకర్లందరికీ పూర్తిగా బోధనరుసుములు, ఉపకారవేతనాలను అందిస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఎలాంటి ఆందోళనవద్దని, ర్యాంకుల కుదింపు ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టీకరించారు.దాదాపు 14 లక్షలమంది విద్యార్థులకు ప్రయోజనం కలిగించే బోధనరుసుములు, ఉపకారవేతనాల పథకంపై 2015-16 విద్యాసంవత్సరానికి సంబంధించి విధానం నిర్ణయం కోసం దస్త్రం ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద ఉంది. ఈనెల ఎనిమిదోతేదీ నుంచి ఇంజినీరింగు సీట్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతున్నందున బోధనరుసుములు, ఉపకారవేతనాలపై ఆయన నిర్ణయం వెల్లడికావాలి. ర్యాంకుల కుదింపునకు అధికారుల సిఫార్సుల నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్రఉత్కంఠ ఏర్పడింది. ఈనేపథ్యంలో సోమవారం ఉదయం నిజామాబాద్ జిల్లాలో ఉన్న సీఎం కేసీఆర్ దీనిపై ఉన్నతాధికారులతో చర్చించి, నిర్ణయం తీసుకున్నారు. వెంటనే బోధనరుసుముల ఉపసంఘం కమిటీ ఛైర్మన్, ఉన్నతవిద్యాశాఖను నిర్వహిస్తున్న ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరితో మాట్లాడారు. బోధనరుసుములపై విధాననిర్ణయం తీసుకున్నామని, పథకాన్ని గతంలో మాదిరే కొనసాగించాలని, కొత్తగా ఆంక్షలేం వద్దని ఆదేశించారు. ర్యాంకుల కుదింపు ప్రతిపాదనలు సరికాదని, ముఖ్యమైన పథకంలో వీలైనంత ఎక్కువ మంది పేద విద్యార్థులకు సాయంచేయడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉండాలన్నారు. ఈమేరకు కడియం హన్మకొండలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు. ఉమ్మడిరాష్ట్రంలోని నిబంధనలను 2014-15లో అమలుచేశామని, అలాగే ఈ ఏడాదీ ఎంసెట్లో 10వేలలోపు ర్యాంకర్లందరికీ ఫీజు చెల్లిస్తున్నామన్నారు. గురుకులాలు, సంక్షేమ వసతిగృహాల్లో ఉండి చదువుకుంటున్న విద్యార్థులకు పూర్తిస్థాయిలో బోధనరుసుములు చెల్లిస్తామన్నారు. ప్రభుత్వ సాయంతో కార్పొరేటు ఇంటర్ కళాశాలల్లో చదివిన విద్యార్థులకు పూర్తిసాయం అందిస్తామన్నారు. నిరుటి మాదిరే 371-డి నిబంధనలను అమలుచేస్తామని, వరసగా నాలుగేళ్లు ఇక్కడ చదివి ప్రవేశాలు తీసుకుంటే వారికి పథకాన్ని అమలుచేస్తామన్నారు. ఏపీలో నాలుగేళ్లు వరసగా చదివి పీజీ కోసం ఇక్కడి(తెలంగాణ)కి వస్తే వారికి ఈ పథకం వర్తించదన్నారు.ఈసెట్ ద్వారా ప్రవేశాలు పొందినా..: పాలిటెక్నిక్ నుంచి ఈసెట్ ద్వారా ఇంజినీరింగ్లో ప్రవేశాలు పొందే 1000మంది విద్యార్థులకు కొత్తగా బోధనరుసుముల పథకాన్ని అమలుచేస్తామని ఉపముఖ్యమంత్రి కడియం చెప్పారు. గతేడాది దీనిపై అభ్యర్థనలు రావడంతో సీఎం నిర్ణయం తీసుకున్నారని, వేయిమంది ఎంపిక అంశంపై విధివిధానాలను రూపొందిస్తామని అన్నారు.ఉన్నత విద్యామండలి, జేఎన్టీయూలకు సమాచారం: ఫీజు రియంబర్స్మెంటుకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయంపై ఉన్నతవిద్యామండలి, జేఎన్టీయూహెచ్కి సమాచారమిచ్చామని, షెడ్యూలు మేరకే ఈనెల 8(రేపటి)నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగు సాగుతుందని కడియం సోమవారం రాత్రి తెలిపారు.