ఓకే గొడుగు కిందకి వివిధ ప్రభుత్వ శాఖల ఉపాధి శిక్షణ కార్యక్రమాలు యువకులకి శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు దేశ విదేశాల్లోని ...
ఓకే గొడుగు కిందకి వివిధ ప్రభుత్వ శాఖల ఉపాధి శిక్షణ కార్యక్రమాలు యువకులకి శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు దేశ విదేశాల్లోని అత్యుత్తమ విధానాల సమ్మేళనంగా శిక్షణ కార్యక్రమాల విధానం శిక్షణ కార్యక్రమాలకోసం ఓక వృత్తినైపుణ్య యూనివర్సిటీగా ఏర్పాటు శ్రీరామానంద తీర్ద రూరల్ ఇన్టిట్యూట్ సందర్శించిన మంత్రి కె.తారక రామారావు నల్లగొండ జిల్లాలోని భూదాన్ పోచంపల్లిలోని శ్రీరామానంద తీర్ద రూరల్ ఇన్టిట్యూట్ ని పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు సందర్శించారు. శ్రీరామానంద తీర్ద రూరల్ ఇన్టిట్యూట్ ని భవిష్యత్తులో తెలంగాణలోని యువత యెక్క శిక్షణ కార్యక్రమాల్లో అధిక భాగసామ్యాన్ని అందిస్తామని తెలిపారు. జాతీయస్ధాయిలో కేంద్రం స్కిల్ డెవలప్ మెంట్ కోసం ప్రత్యేకంగా ఓక శాఖను ఏర్పాటు చేసిందని.. తమ ప్రభుత్వం సైతం యువకులకి ప్రభుత్వ రంగంతోపాటు.ప్రయివేటు రంగంలోనూ తెలంగాణ యువకులు రాణించేలా వారికి శిక్షణ ఇచ్చేందుకు పలు ప్రణాళికలు సిద్దం చేస్తున్నదని తెలిపారు. ఇందుకోసం రాష్ర్టస్ధాయిలో తెలంగాణ స్కిల్ డెవలప్ మెంట్ మిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ స్కిల్ డెవలప్ మెంట్ మిషన్ ద్వారా గతంలో రీమ్యాప్ అనే పేరుతో వివిధ ప్రభుత్వ శాఖల అద్యర్యంలో జరుగుతన్న ఉపాధి శిక్షణ కార్యక్రమాలను ఓకే గొడుగు కిందకి తీసుకురానున్నట్లు మంత్రి తెలియజేశారు. తెలంగాణ స్కిల్ డెవలప్ మెంట్ మిషన్ కార్యక్రమంలో శ్రీరామానంద తీర్ద రూరల్ ఇన్టిట్యూట్కి ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కేవలం శిక్షణ ఇవ్వడమే కాదని..శిక్షణ అనంతరం వారికి ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు చేపడతామని. అవసరమైతే శిక్షణ పూర్తి చేసుకున్న కొంత కాలనికి వారికి మరోసారి కాలనుగుణంగా రిప్రెష్ మెంట్ కోర్సులను అందించేలా తమ ప్రణాళిక ఉంటుందని తెలిపారు. ఉపాధి శిక్షణ కార్యక్రమాలకోసం ప్రభుత్వం భారీ ఖర్చు చేయనున్న నేపథ్యంలో దేశ విదేశాల్లోని అత్యుత్తమ విధానాల సమ్మేళనంగా ఓక పాలసీని ఏర్పాటు చేయాలని..ఇందుకు సంభందించిన ఓక నివేదిక సాద్యమైనంత త్వరగా తనకి అందివ్వాలని మంత్రి అదికారులను అదేశించారు. జాతీయస్ధాయి స్కిల్ మిషన్ కార్యక్రమంతో సమన్వయం చేసుకుంటూ తెలంగాణ యువకులకి నిరుద్యోగులకి అవసరమైన తీరుగా శిక్షణ అందించేందుకు తాము ప్రయత్నిస్తామని మంత్రి తెలిపారు. క్యాపంస్ లో దాదాపు రెండు గంటలకి పైగా మంత్రి వివిధ విభాగాలను సందర్శించారు. అక్కడ శిక్షణ తీసుకుంటున్న విద్యార్దులు, యువకులతో సంభాషించారు. ఏక్కడనుండి వచ్చారు,శ్రీరామానంద తీర్ద రూరల్ ఇన్టిట్యూట్ గురించి ఏవిధంగా తెలిసింది, శిక్షణ అందుతున్న తీరు.సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. శిక్షణ అందిస్తున్న భోధకుల గురించి వారి వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి.. డిమాండ్ ఉన్న రంగాల్లో ఏలాంటి కోర్సులను నడుపుతున్నారు..వాటికి అనుగుణంగా ఏవిదంగా తమని తాము అప్ డేట్ చేసుకుంటున్నారో తెలుసుకున్నారు.పర్యటనలో మంత్రి వెంట పంచాయితీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్ తో పాటు పలువురు ఉన్నాతాధికారులున్నారు.