ఆదిలాబాద్ పట్టణం, : నిరుపేద ముస్లింలు పవిత్ర రంజాన్ పండగను ఆనందంగా నిర్వహించుకునేందుకే ప్రభుత్వం తరఫున వస్త్రాల పంపిణీ చేస్తున్నట్లు మంత్...
ఆదిలాబాద్ పట్టణం, : నిరుపేద ముస్లింలు పవిత్ర రంజాన్ పండగను ఆనందంగా నిర్వహించుకునేందుకే ప్రభుత్వం తరఫున వస్త్రాల పంపిణీ చేస్తున్నట్లు మంత్రి జోగురామన్న తెలిపారు. ప్రతి కుటుంబంలో చిరునవ్వు కనిపించాలనేది ప్రభుత్వ ఆకాంక్ష అని వివరించారు. నిరుపేద, ధనిక అనే తారతమ్యం లేకుండా పండుగను సంతోషంగా నిర్వహించుకోవడంతోపాటు బంగారు తెలంగాణ కోసం, వర్షాలు కురిసేందుకు పండగ రోజన దేవున్ని ప్రార్థించాలని ముస్లింలను కోరారు. వర్షాలు కురిస్తేనే ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండగలుగుతారని వివరించారు. ఆదిలాబాద్ పట్టణంలోని జిల్లాపరిషత్ సమావేశపుహాలులో శుక్రవారం పట్టణంలోని 1000 ముస్లిం కుటుంబాలకు ప్రభుత్వం తరఫున పురుషులకు 5 మీటర్ల వస్త్రం, మహిళలకోసం రెండు చీరెలలతో ఉన్న సంచులు అందజేశారు. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ తమది పేదల సంక్షేమ ప్రభుత్వమని అన్నారు.
పాలనాధికారి జగన్మోహన్ మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున ఇదివరకే ఇఫ్తార్విందు ఏర్పాటుచేయగా మంచి స్పందన లభించిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ పురపాలక సంఘం అధ్యక్షురాలు రంగినేని మనిషా, తెరాస పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోకభూమారెడ్డి, మౌలాన అబూజర్, మూలాన అక్భర్, తెరాస పట్టణ అధ్యక్షుడు సయ్యద్సాజిదొద్దీన్, పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు జహుర్, జహీర్రంజాని, సిరాజ్ఖాద్రీ, ముజాహిద్షా, నసీర్, పార్టీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.