భక్తులకు వీసమెత్తు అసౌకర్యం కలగకుండా చూడటమే ప్రభుత్వ భాద్యత ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు ఈ రోజు సచివాలయం నుండివీడియో కాన్ఫరెన్స్ గోదావర...
భక్తులకు వీసమెత్తు అసౌకర్యం కలగకుండా చూడటమే ప్రభుత్వ భాద్యత ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు ఈ రోజు సచివాలయం నుండివీడియో కాన్ఫరెన్స్ గోదావరి పుష్కరాలకు గడువు సమీపిస్తుండటంతో నిర్వహణ కు సంబంధించిన లోటు పాట్ల పై ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు ఈ రోజు సచివాలయం నుండి జిల్లాల్లోని కలెక్టర్లు, ఇరిగేషన్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇఎన్ సీ లు మరళిదర్ రావు,విజయప్రకాశ్, సీఇ పురుశోత్తం రాజు, ఓఎస్డీ శ్రీదర్ రావు దేశ్ పాండే లు ఉన్నారు. ఈ రివ్యూ సందర్భంగా వివిధ అంశాలపై మంత్రి హరీష్ రావు అధికారులకు తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్తితులలోనూ పుష్కరాలకు వచ్చే భక్తులకు వీసమెత్తు అసౌకర్యం కలగకుండా చూడటమే ప్రభుత్వ భాద్యత అని గుర్తు చేశారు. బాసరలో నీరు లేకపోవడం పై ఈ సమీక్షలో ప్రధానంగా చర్చించారు. మహారాష్ట్ర ప్రభుత్వం తో చర్చలు నడుస్తున్నట్టు మంత్రి జిల్లా అధికారులకు తెలిపారు. రేపటి లోగ స్పష్టత వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఎస్ ఆర్ ఎస్పీ , కడేం, ఎల్లంపల్లి నుండి నీటిని పుష్కర ఘాట్లకు మళ్లించాలని మంత్రి హరీష్ రావు అధికారులకు అదేశాలు జారీ చేశారు. యుద్దప్రాదిపదికన నీటి మళ్లింపు కార్యక్రమన్ని ప్రారంభించాలని తెలిపారు. చివరి నిమిషం వరకు పనులను పెండిగ్ లో పెట్టే సంప్రదాయన్ని విడిచిపెట్టాలని సూచించారు. 12 తెది లోపు పనులు పూర్తి కావలని అన్నారు. పుష్కర ఘాట్ల వద్ద ఉన్న పరిస్ధితిని అడిగి తెలుసుకున్నారు. కావల్సిన సూ,నలను జారీ చేశారు. మున్సిపల్ అధికారులు, సానిటేషన్ అధికారులు వారికి కేటాయించిన పుష్కర ఘాట్ ల వద్ద ఉన్న లేదని అని అడిగి తెలుసుకున్నారు. స్నానాల గదులకు సంబంధించిన విషయములో ఎక్కడ కూడా అజాగ్రత్త వహించరాదని సూచించారు, పుష్కర ఘాట్లను పరిశుభ్రంగా ఉంచడంలో అధికారులు చిత్త శుద్ధితో పని చేయాలని అన్నారు. గత పుష్కరాలతో పోల్చుకుంటే ఈ సారి నాలుగైదు రెట్ల భక్తులు వచ్చే అవకాశం ఉందని అందుకోసం ఎక్కువ శ్రమించాలని అన్నారు. పుష్కర ఘాట్ల వద్ద వేస్తున్న కొత్త రోడ్ల పక్కన నాణ్యమైన మొరం వేయాలని ఆదేశించారు. ప్రమాదాల నివారణకు ఇది ఉపయోగ పడుతుందని వివరించారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. ట్రాఫిక్ నియంత్రణ పై పోలీసుల సహకారం తీసుకొని ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్త వహించాలన్నారు. దేశంలోని చాలా ప్రాంతాలనుండి భక్తులు పుష్కరాలకు వస్తారు కాబట్టి వారి కోసం సైన్ బొర్డ్స్ తెలుగుతో పాటు ఇంగ్లిష్, హింది భాషలలొ ఏర్పాటు చేయాలనే విషయం పై ఆర తీసారు . పిండప్రధానం చేసే పురోహితులకు గుర్తింపు కార్డులని ఇవ్వాలని తెలిపారు. పురోహితులకు చెల్లించాల్సిన మొత్తానికి సంబంధించిన ధరల పట్టికను తయారు చేసి పుష్కర ఘాట్లలో పెట్టాలనే విషయన్ని గుర్తు చేశారు. గోదావరి పుష్కరాలకు సంబంధించిన వివరాలతో బస్టాండ్లలోను, రైల్వే స్టేషన్ లలోనూ ఇన్ఫర్మేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని గతం లో ఆదేశించారు. ఈ విషయం గురించి అడిగి తెలుసుకున్నారు. జిల్లా కేంద్రంతో పాటూ పుష్కర ఘాట్ల వద్ద కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్తితులను సమీక్షించాలని తెలిపారు. పుష్కరాలు జరిగే జిల్లాలలో టోల్ ఫ్రీ తో కూడిన హెల్ప్ లైన్ నెంబర్ ను ప్రచారంలో పెట్టాలని తెలిపారు.