ప్రపంచంలోని అత్యుత్తమ హోటల్ ఎక్కడుంది? అమెరికాలోనా.. జపాన్లోనా.. అని వెతుక్కోవాల్సిన పనిలేదు. అది మన దేశంలోనే ఉంది. తాజాగా ట్రావెల్+లీజర...
ప్రపంచంలోని అత్యుత్తమ హోటల్ ఎక్కడుంది? అమెరికాలోనా.. జపాన్లోనా.. అని వెతుక్కోవాల్సిన పనిలేదు. అది మన దేశంలోనే ఉంది. తాజాగా ట్రావెల్+లీజర్ మ్యాగజైన్ రీడర్స్ సర్వే నిర్వహించగా.. రాజస్తాన్ ఉదయ్‌పూర్‌లోని ఒబెరాయ్ ఉదయ్‌విలాస్ టాప్ హోటల్‌గా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. వివిధ హోటళ్లలోని ఆతిథ్యం, వసతి, ప్రాంతం, ఆహారం, సేవలు ఆధారంగా పర్యాటకులు రేటింగ్‌ను ఇచ్చారు. ఈ హోటల్‌కు అతిథులను ప్రత్యేకమైన బోటులో తరలిస్తారు. అక్కడ్నుంచి అంతా ఇక రాజవైభోగమే. రాజమహల్లోని ఆతిథ్యం అద్భుతమని సదరు మ్యాగజైన్ పాఠకులు పేర్కొన్నారు. 2015 టాప్-10 జాబితాలో ఒబెరాయ్ గ్రూప్‌నకే చెందిన జైపూర్‌లోని రాజ్‌విలాస్ హోటల్ 5వ స్థానాన్ని దక్కించుకుంది.