ప్రత్యూషపై పత్రికల్లో వచ్చిన కథనాలపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం.. స్వయంగా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తికి లేఖ రా...
ప్రత్యూషపై పత్రికల్లో వచ్చిన కథనాలపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం.. స్వయంగా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. సవతి తల్లి, కన్నతండ్రి చేతుల్లో హింసకు గురైన 19 ఏండ్ల ప్రత్యూష ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర హోంశాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బీ భోసలే, జస్టిస్ ఎస్వీ భట్ ఆధ్వర్యంలోని ధర్మాసనం పేర్కొంది. ఒక యువతికి యాసిడ్ తాగించారంటే .. ఆమెపై సవతి తల్లి ఎంత క్రూరంగా వ్యవహరించిందో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించింది. మహిళలపై చులకనభావమే ఇలాంటి ఘటనలకు కారణమని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. ప్రత్యూషపై పత్రికల్లో వచ్చిన కథనాలపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం.. స్వయంగా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. సుమోటోగా విచారించాలని అభ్యర్థించారు. దీంతో కోర్టు సుమోటోగా చేపట్టి విచారణ ప్రారంభించింది. తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేశారు.