వరంగల్: తెలంగాణ రాష్ట్రంలో ప్రతిభగల ఇంజినీర్లు ఎంతో మంది ఉన్నారని స్పీకర్ మధుసూధనాచారి అన్నారు. సీమాంధ్రుల పాలనలో మన ఇంజినీర్లపై వివక్ష చ...
వరంగల్: తెలంగాణ రాష్ట్రంలో ప్రతిభగల ఇంజినీర్లు ఎంతో మంది ఉన్నారని స్పీకర్ మధుసూధనాచారి అన్నారు. సీమాంధ్రుల పాలనలో మన ఇంజినీర్లపై వివక్ష చూపించారని విమర్శించారు. ఇవాళ గణపురం మండలం కేటీపీఎస్‌లో సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత దేశం గర్వించదగ్గ ఇంజినీర్ విశ్వేశ్వరయ్య అని అంతటి పేరు ప్రఖ్యాతులు సాధించిన ఆరాధ్య దైవం నవాజ్ జంగ్ అని కొనియాడారు. నవాజ్ జంగ్ ప్రతిభను గుర్తించే ఆయనను ఇంజినీర్ల ఆరాధ్య దైవం అని సీఎం కొనియాడారని, ఆయన జయంతిని ఇంజినీర్స్ డేగా ప్రకటించారని వివరించారు. ప్రతీ వర్షపు నీటిబొట్టును ఒడిసిపట్టి సాగునీటి ప్రాజెక్టులు, చెరువులకు తరలించేలా కృషి చేశారని తెలిపారు.