హైదరాబాద్: తెలంగాణ ఈ-సెట్ 2015 కౌన్సెలింగ్ నేడు ప్రారంభం కానుంది. కౌన్సెలింగ్ ఈ 6వ తేదీ వరకు కొనసాగనుంది. కౌన్సెలింగ్‌కు హాజరైన విద్యార...
హైదరాబాద్: తెలంగాణ ఈ-సెట్ 2015 కౌన్సెలింగ్ నేడు ప్రారంభం కానుంది. కౌన్సెలింగ్ ఈ 6వ తేదీ వరకు కొనసాగనుంది. కౌన్సెలింగ్‌కు హాజరైన విద్యార్థులు ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు పెట్టుకునే అవకాశం. కౌన్సెలింగ్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. బీసీ, ఓసీ విద్యార్థులు రూ. 800, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 400ను రిజిస్ట్రేషన్ ఫీజుగా విధిగా చెల్లించాలి. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు కింది సర్టిఫికెట్లతో హాజరుల కావాలి.
- టీఎస్ఈసెట్ ర్యాంకు కార్డు, హాల్‌టికెట్
- డిప్లమో ఇన్ ఇంజనీరింగ్ మార్కుల మెమోలు, ప్రొవిజనల్ సర్టిఫికెట్
- ఎస్ఎస్సీ మెమో
- 4 నుంచి డిప్లమో వరకు స్టడీ సర్టిఫికెట్లు
- టీసీ
- స్థానిక ధృవీకరణ పత్రం
- తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన కులధృవీకరణ పత్రం
- 1 జనవరి, 2015 తర్వాత జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం
- ఆధార్‌కార్డు.
కౌన్సెలింగ్ షెడ్యూల్:
నేడు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమయ్యే కౌన్సిలింగ్లో 1వ ర్యాంకు నుంచి 3000 ర్యాంకు వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు 3001 ర్యాంకు నుంచి 6000 ర్యాంకు వరకు. అదేవిధంగా రేపు ఉదయం తొమ్మిది గంటలకు జరిగే కౌన్సెలింగ్‌లో 6001 ర్యాంకు నుంచి 9000వ ర్యాంకు వరకు. మధ్యాహ్నాం 12.30 గంటలకు 9001వ ర్యాంకు నుంచి 12000వ ర్యాంకు వరకు. 6వ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు జరిగే కౌన్సెలింగ్‌లో 12001వ ర్యాంకు నుంచి 15000వ ర్యాంకు వరకు. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమయ్యే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో 15001 నుంచి చివరి ర్యాంకు వరకు కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నారు.
పీహెచ్, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్, గేమ్స్ విభాగాల్లోని విద్యార్థులు హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌లో గల సాంకేతిక విద్యాభవన్‌లో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని అధికారులు పేర్కొన్నారు.