ఏడాదిలో ఒక్క ప్రాజెక్టునూ ఆమోదించలేదుహైకోర్టు విభజనను నాన్చుతున్నారుఎంపీలతో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం గడిచిన ఏ...
ఏడాదిలో ఒక్క ప్రాజెక్టునూ ఆమోదించలేదుహైకోర్టు విభజనను నాన్చుతున్నారుఎంపీలతో ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం గడిచిన ఏడాది కాలంలో తెలంగాణ రాష్ట్రానికి సహకరిచిందేమీలేదని, కనీసం విభజన హామీలను కూడా నెరవేర్చలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నట్లు సమాచారం. గురువారమిక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆయన అధికారిక నివాసంలో తెరాస ఎంపీల బృందం కల్సింది. ఈనెల 21వ తేదీ నుంచి జరగబోయే పార్లమెంటు సమావేశాలపై ఈ సందర్భంగా చర్చించారు. హైకోర్టు విభజనపై సహకరించాలని కోరడానికి తాము ఇంతకుముందే గవర్నర్‌ను కలిశామని ముఖ్యమంత్రికి ఎంపీలు చెప్పారు. దీనికి ముఖ్యమంత్రి స్పందిస్తూ... హైకోర్టు అంశాన్ని ఎప్పుడో తేల్చాల్సింది కానీ నాన్చుతూ వస్తున్నారని అసహనం వ్యక్తం చేసినట్లు తెల్సింది. రాజ్యాంగం ప్రకారం ప్రతీ రాష్ట్రానికి ప్రత్యేకంగా హైకోర్టు ఉండాలని, తెలంగాణ ఏర్పడి సంవత్సరమైనా హైకోర్టు ఏర్పాటు అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించడంలేదని చెప్పారు. రాష్ట్రాల మధ్య తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించడంపై కేంద్రం దృష్టిసారించాల్సిందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఏడాదిగా తెలంగాణకు సంబంధించి ఒక్క ప్రాజెక్టును కూడా కేంద్రం ఆమోదించలేదన్నారు. అతికష్టంపై విద్యుత్ప్లాంట్లకు సంబంధించి పర్యావరణ అనుమతులు మాత్రమే వచ్చాయని చెప్పారు. ఇంతకుమించి ఏమీ జరగలేదని, ఇక తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ ఆదాయపన్ను చెల్లించలేదన్న కారణంతో ప్రభుత్వ ఖజానా నుంచి ఆర్బీఐ రూ.1274 కోట్లను మళ్లించిందని, ఇదెలా చేస్తారని, కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా ఇది జరగదని అన్నారు. కార్పొరేషన్ల విభజనపై వేసిన షీలాబిడే కమిటీ ఇంకా నివేదిక ఇవ్వలేదని, కమలనాథన్ కమిటీ కూడా అలాగే ఉందన్నారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేక ఉదాహరణలున్నాయని, వీటన్నింటిపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పారు. తెలంగాణ ప్రజల గొంతును పార్లమెంటు వేదికగా వినిపించాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ప్రయత్నిద్దామని, కేంద్ర ప్రభుత్వ వైఖరిని అంశాలవారీగా ఎండగట్టాలని చెప్పారు.హైకోర్టు విభజనపై చొరవ తీసుకోండి... గవర్నర్‌ను కోరిన తెరాస ఎంపీలు: హైకోర్టు విభజనపై ఏపీ ప్రభుత్వం నుంచి ఆశించిన మేరకు సహకారం లభించడంలేదని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని, అవసరమైనమేర చొరవ తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను గురువారం తెరాస పార్లమెంటరీ పార్టీ కోరింది. ముఖ్యమంత్రిని కలవడానికి ముందు తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, పార్టీ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి, ఎంపీలు బి.వినోద్‌కుమార్, కె.కవిత, కె.విశ్వేశ్వర్‌రెడ్డి, డాక్టర్ నర్సయ్యగౌడ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, నగేశ్ తదితరులు రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హైకోర్టు విభజనపై వివరాలు అందజేయాలని ఏపీని కోరిందని, దాంతో కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ జూన్ 11వ తేదీన ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారని, తర్వాత 25వ తేదీన గవర్నర్‌కు కూడా లేఖ రాశారని గుర్తు చేశారు. అయినా నుంచి ఎలాంటి స్పందనలేదన్నారు. ఎంపీల అభ్యర్థనపై గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు తెల్సింది. తాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఈ అంశంపై చర్చిస్తానని చెప్పినట్టు ఎంపీలు మీడియా ప్రతినిధులకు తెలిపారు.