మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతాంవాగ్దానాలన్నీ నెరవేరుస్తున్నాంఅల్లా దయ వల్ల తెలంగాణ సాధించుకున్నాంప్రభుత్వ ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి...
మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతాంవాగ్దానాలన్నీ నెరవేరుస్తున్నాంఅల్లా దయ వల్ల తెలంగాణ సాధించుకున్నాంప్రభుత్వ ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు
హైదరాబాద్డాది కాలంలో తమ ప్రభుత్వం చేసింది కొంతేనని, చేయాల్సింది ఇంకా ఎంతో ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. వాగ్దానాలన్నీ నెరవేరుస్తున్నామని, మున్ముందు మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతామని భరోసానిచ్చారు. అల్లా దయ వల్ల తెలంగాణ సాధించుకున్నామని, రాష్ట్రానికి ఆయన ఆశీర్వాదం ఉందని అన్నారు. అందరి సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తామని చెప్పారు. నిజాం కళాశాల మైదానంలో ఆదివారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందులను ఏర్పాటు చేశామని, పాత సంస్కృతీ సంప్రదాయాలను కొనసాగించే చిరు ప్రయత్నమిదని, మరింతగా విస్తరిస్తామని వివరించారు. తెలంగాణరావాలని అందరం కోరుకొన్నామని, అల్లా దయ వల్ల అది నెరవేరిందని చెప్పారు. ఈ సందర్భంగా గాంధీజీ హైదరాబాద్ సంస్కృతి గురించి చెప్పిన మాటలను గుర్తు చేశారు. ''మత సామరస్య జీవనంలో హైదరాబాద్ ప్రపంచానికే ఆదర్శం. అద్భుతమైన గంగాయమున సంగమ సంస్కృతి ఇక్కడ తప్ప మరో చోట కనిపించదు'' అంటూ 1927లో మహాత్మాగాంధీ హైదరాబాద్‌లోని వివేకవర్థిని పాఠశాలను సందర్శించినప్పుడు ప్రశంసించారని కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్‌ను చూసి ఉత్తరభారతీయులు నేర్చుకోవాలని గాంధీజీ అనాడే చెప్పారని అన్నారు. ఏడాది పాలనలో సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ ..''తెలంగాణలో విద్యుత్ సమస్యను అధిగమించాం. ఇకపై కరెంటు కోతలుండవు. రైతుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నాం. వారి పొలాలన్నింటికీ సరిపడా సాగు నీరందిస్తాం. అన్ని వర్గాలను ఆదుకుంటాం''అని తెలిపారు. 'నేను మీ బిడ్డను, నాకు మీ ఆశీస్సులు కావాలి. మీ సహకారం ఉంటే మరింత ముందుకు సాగుతాం' అని సీఎం చెప్పారు. కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్, ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, ఎంపీలు కె.కేశవరావు, అసదుద్దీన్, ఎమ్మెల్సీలు సలీం, పూలరవీందర్, ఇతర నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఏకేఖాన్, ఉమర్‌జలీల్, ముస్లిం ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేద ముస్లింలకు ముఖ్యమంత్రి దుస్తులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన ముస్లింలతో కలిసి విందులో పాల్గొన్నారు.ఏటా ప్రభుత్వం తరఫునే :సీఎంబంజారాహిల్స్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మరో ఇఫ్తార్ విందులోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. ఇటువంటి కార్యక్రమాలు ప్రజల మధ్య ప్రేమానురాగాలను పెంపొందిస్తాయని తెలిపారు. ప్రభుత్వం తరఫున భవిష్యత్తులోనూ వీటిని కొనసాగిస్తామన్నారు. ఇఫ్తార్ విందు నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం..మస్జిద్ ఈ మదీనా మసీదుకు అప్పగించింది. ప్రభుత్వ అధికారులతో పాటు మసీదు కమిటీ అధ్యక్షుడు మహ్మద్ మునీరుద్దీన్, ప్రధాన కార్యదర్శి యావర్ అలీ, కోశాధికారి సయ్యద్ నవీద్ హష్మీ తదితరులు పాల్గొన్నారు.