హైదరాబాద్: ఆలీ నవాజ్ జంగ్ కృషివల్లే ఇవాళ తెలంగాణకు నీళ్ల ప్రాజెక్టులు వచ్చాయని మంత్రి హరీష్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా వర్సిట...
హైదరాబాద్: ఆలీ నవాజ్ జంగ్ కృషివల్లే ఇవాళ తెలంగాణకు నీళ్ల ప్రాజెక్టులు వచ్చాయని మంత్రి హరీష్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా వర్సిటీకి లేదా సంస్థకు ఆలీ నవాజ్ జంగ్ పేరు పెడతామని ప్రకటించారు. సీఎం కేసీఆర్ వేగాన్ని అందుకోవాలంటే ఇంజినీర్లు సమన్వయంతో పనిచేయాల్సి ఉందని సూచించారు. తెలంగాణలో నీటి ప్రాజెక్టుల కోసం చంద్రబాబునాయుడి దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతిలేదని సీమాంధ్ర నేతలు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో హంద్రీ-నీవా, పోతిరెడ్డిపాడు, గాలేరు-నగరి ప్రాజెక్టులకు అనుమతిలేదని మంత్రి వివరించారు. వాటికి నీళ్లు ఆపితే తాము కూడా నీళ్లు ఆపేందుకు సిద్దమని స్పష్టం చేశారు. ఇరిగేషన్, రహదారులు, ఎలిక్ట్రిసిటీ, వాటర్‌గ్రిడ్ పథకాల అమలులో ఇంజినీర్లదే కీలక పాత్ర అని పేర్కొన్నారు.