మిగిలింది ఒక్కరోజే..

గోదావరి పుష్కరాల పనుల నిర్వాహణకు మిగిలింది ఇక ఒక్క రోజు మాత్రమే. ఇప్పటికే పలు మార్లు గడువు పొడిగించినప్పటికీ ఇంకా పూర్తికాకపోవడంతో చిట్టచ...

migilindi
okkaroje..
గోదావరి పుష్కరాల పనుల నిర్వాహణకు మిగిలింది ఇక ఒక్క రోజు మాత్రమే. ఇప్పటికే పలు మార్లు గడువు పొడిగించినప్పటికీ ఇంకా పూర్తికాకపోవడంతో చిట్టచివరగా ఈ నెల 10వ తేదీ అర్ధరాత్రి వరకు అన్ని రకాలైన పనులు పూర్తిచేయాలని ప్రభుత్వం తెగేసి చెప్పడంతో అధికారులు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. పుష్కరాలపనులను పూర్తిచేయాలని పదే పదే హెచ్చరిస్తున్నా అధికారులు పెడచెవిన పెట్టారు. ఇప్పటికిప్పుడు హడావుడిగా పనులు కొనసాగిస్తు మమ అనిపిస్తున్నారు. ఈ పనులను ఇప్పుడు చేయలేమని.. తీరగ్గా పుష్కరాల తర్వాత చేస్తామంటూ కొందరు గుత్తేదారులు చేతులెత్తేశారు. గోదావరి పుష్కరాలను ఈ నెల 14వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పుష్కరాలకు భారీగా వస్తారనే అంచనా. ఆ మేరకు కొత్తగా అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పుష్కరాలను ఘనంగా నిర్వహించి అందరిచేత మంచిపేరు సంపాదించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ పుష్కరాలకు గతంలో ఎన్నడూ లేనివిధంగా గోదావరి వెంట 30చోట్లా పుష్కరఘాట్లను ఏర్పాటు చేసింది. ప్రతి ఘాట్‌వద్దకు రహదారుల ఏర్పాటుతో పాటు తాగునీరు, మరుగుదొడ్లు, షెడ్లు ఇతర సౌకర్యాలను కల్పించడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ పనులను వివిధశాఖలకు బాధ్యతలు అప్పగించి పనులు నాణ్యతతో పాటు వేగంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాల్సి ఉంది. వాస్తవానికి అన్నిరకాలైన పనులను గత నెల 15వ తేదీనాటికి పూర్తిచేయాల్సి ఉన్నా.. ఆ నెలాఖరు వరకు పొడిగించారు. అయినా పూర్తిచేయలేని దుస్థితి. మళ్లీ గడువు పెంచుతూ ఈ నెల 10వ తేదీ ఆర్దరాత్రి వరకు పూర్తిచేయాలని ఏ ఒక్క పని అసంపూర్తిగా ఉండటానికి వీల్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సారి గతంలో మాదిరిగా కాకుండా స్వయంగా మంత్రులు హరీశ్‌రావు, జోగురామన్నలు ఈ నెల 11వ తేదీన అన్ని ఘాట్లను పరిశీలించనున్నారు. అప్పటిలోగా ఒక్క చిన్న పనికూడా అసంపూర్తిగా ఉండటానికి వీల్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం అంతా అటువైపునే దృష్టి సారించింది. పవిత్ర పుణ్యక్షేత్రమైన బాసరలో ఇంకా అన్ని రకాలైన పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక్కడికి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి రోజు ఐదు లక్షల మందికంటే ఎక్కువగానే భక్తులు హాజరయ్యే అవకాశాలున్నాయంటున్నారు. తెలంగాణతో పాటు సీమాంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా వస్తారనే అంచనా. అయినా.. అత్యంత ప్రధానమైన బాసరలో కూడా పనులు అసంపూర్తిగానే ఉన్నాయంటే అధికారులు, గుత్తేదారుల నిర్లక్ష్యం ఏపాటితో అర్థం చేసుకోవచ్చు. పుష్కర ఘాట్ల పనులు ఇంకా పూర్తికాలేదు. మెట్లు నిర్మిస్తూనే ఉన్నారు. రాత్రి వేళల్లోనూ పనులు నిర్వహిస్తున్నారు. గోదావరిలో బారీకేడ్ల పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. మరుగుదొడ్ల పనులు ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. వాటిని రెండ్రోజుల్లో పూర్తిచేయడం సాధ్యం కాదని అధికారులే చెబుతున్నారు. తాగునీటికి సరిపడా ఆర్‌వో ప్లాంట్ల పనులు కూడా సగానికిసగం అసంపూర్తిగానే ఉన్నాయి. ఆర్‌ అండ్‌ బి రహదారుల పనులు అధ్వానంగా మారియి. గడువులోగా పూర్తిచేసే పరిస్థితి లేదు. పుష్కరాల తర్వాతనే వేస్తామని గుత్తేదారులు చేతులెత్తేశారు. ఇక్కడ బస్టాండ్‌ నుంచి అన్నదానం సత్రం వరకు నిర్మించాల్సిన రహదారి పూర్తికాకున్నా నిలిపేశారు. పుష్కరాల తర్వాతనే మొదలు పెడతామని గుత్తేదారులు స్పష్టం చేశారు. ఇక్కడ అన్ని రోడ్లు అసంపూర్తిగానే ఉన్నాయి. రెండు వరుసల తారు రోడ్డు వేయాల్సి ఉన్నా.. ఇప్పటికీ ఒకే వరుసను మాత్రమే పూర్తి చేసి.. రెండో వరుస తారును పుష్కరాల తర్వాత వేస్తామని గుత్తేదారులు ఖరాకండీగా చెపుతున్నారు. పంచాయతీరాజ్‌ రోడ్లు కూడా పూర్తికాలేదు. కంకర పోశారు. ఇంకా పూర్తిస్థాయిలో పూర్తికాలేదు. పార్కింగ్‌ ఏర్పాటు అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటికీ చదును చేయకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దేవాలయంలో ఇంకా క్యూలైన్ల పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. విద్యుత్తు స్తంభాలు వేసినా.. మిగిలిన పనులు పూర్తిచేయలేదు. ఆర్‌ అండ్‌ బి పనుల తీరు అధ్వానంగా ఉన్నాయి. పుష్కరాల లోపు పనులు పూర్తిచేయడం సాధ్యమయ్యే పని కాదు. ఆరంభం నుంచి ఆశాఖ అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. అన్ని శాఖల కంటే ముందే పనులు మొదలు పెట్టినా జాప్యమే కొనసాగింది. పుష్కరాల సందర్భంగా రహదారులు భవనాల శాఖ (ఆర్‌ అండ్‌ బి) ఆధ్వర్యంలో రూ.62కోట్లతో 11 రహదారుల పనులు చేపట్టారు. ఈ పనులను వాస్తవానికి గతనెల 15వ తేదీన పూర్తికావాల్సి ఉన్నా.. ఇప్పటికి ఎక్కడి పనులు అక్కడే అన్న చందంగా మారింది. ఇప్పటి వరకు కేవలం రెండు పనులు మాత్రమే పూర్తిచేయగా.. మిగిలిన తొమ్మిది పనులు అసంపూర్తిగానే దర్శనిస్తున్నాయి. రెండువరుసల బీటీ వేయాల్సి ఉండగా ఒక్క వరుస మాత్రమే వేశారు. మిగిలిన పనులను ఇప్పుడు చేయలేమని.. పుష్కరాల తర్వాతనే చేస్తామని గుత్తేదారులు చేతులెత్తేశారు. మూత్రశాలకు తలుపు బిగించకున్నా చర్యలు తీసుకుంటామని ఓ వైపు ప్రభుత్వం గట్టిగా హెచ్చరిస్తున్నా.. ఆర్‌ అండ్‌ బి శాఖ అధికారుల నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. ఒక వరుస బీటీనే వేసి పనులు అసంపూర్తిగా వదిలేయడం వల్ల భక్తుల తాకిడికి పుష్కరాలు పూర్తయ్యే వరకు కూడా ఉండవనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సకాలంలో పనులు చేయడంలో నిర్లక్ష్యం వహించిన గుత్తేదారులపైన చర్యలు తీసుకోకపోగా.. గడువు మీద గడువు పెంచుతూ గుత్తేదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. గ్రామాల నుంచి పుష్కరఘాట్ల వరకు రహదారుల పనులు పంచాయతీరాజ్‌ శాఖ పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ఆ శాఖ అధికారులు సకాలంలో పనులు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహిరించి.. ఇప్పుడు పుష్కరాల లోపు పనులు చేయలేమని చేతులెత్తేశారు. రూ.20.18 కోట్లతో 55 రహదారుల పనులు చేపట్టారు. ఇప్పటి వరకు 29 పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన పనులు వివిధ దశలో ఉన్నాయి. ఈ పనుల్లో ఏమాత్రం నాణ్యత ప్రమాణాలు పాటించిన దాఖలాలు లేవు. ఇప్పటి వరకు మట్టిపోసి మారేడుకాయ చేశారు. కొన్ని పనులు పుష్కరాల లోపు పూర్తిచేయలేమని గుత్తేదారులు తేల్చిచెప్పారు. ఒక్క పనికూడా అసంపూర్తిగా ఉండటానికి వీల్లేదని ప్రభుత్వం చెబుతున్నా.. అధికారులు బేఖాతర్‌ చేశారు. పనులు పూర్తిచేయనందుకు గుత్తేదారులపైన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పుష్కరాల తర్వాత చేసుకునే వెసులుబాటు ఇవ్వాలని ఈఎన్‌సీను కోరడం విమర్శలకు తావిస్తోంది. ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ ఆధ్వర్యంలో తాగునీటి పనులతో పాటుగా మరుగుదొడ్ల నిర్మాణాలను చేపట్టారు. ఆశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న రూ.4కోట్ల పనుల్లో రూ.2కోట్ల మేరకు బాసరలోనే ఉన్నాయి. 980 మరుగుదొడ్లనిర్మాణానికి ఇప్పటి వరకు 790 మరుగుదొడ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అయితే.. ఏదో తూతూ మంత్రంగా చేశామంటే సరిపోదని.. అన్ని పనులు సంపూర్ణంగా చేసి తీరాలని ప్రభుత్వం చెప్పడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయిదారు ఘాట్లు మినహా మిగిలిన చోట్లా తాగునీటి కోసం ఆర్‌వో ప్లాంట్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. సగానికి సగం అసంపూర్తిగానే ఉన్నాయి. జిల్లాలో 34చోట్లా 30పుష్కరఘాట్ల పనులు నిర్వహిస్తున్నారు. పుణ్యస్నానాలకు అత్యంత ముఖ్యమైనవి పుష్కరఘాట్లే. వీటి పనులను నీటిపారుదల శాఖ అధికారుల ఆధ్వర్యంలో చేస్తున్నారు. ఇప్పటికీ సగానికి సగం ఘాట్ల పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. చెన్నూరు, వేలాలలో పుష్కర ఘాట్లకు నీటి ప్రవాహానికి సంబంధమే లేదు. గోదావరి దాదాపు 2కి.మీ వెడల్పు కలిగి ఉండటంతో పుష్కరఘాట్ల వద్దకు నీళ్లొచ్చే పరిస్థితి లేదు. ఇటువంటి ప్రదేశాల్లో నీటిని పుష్కరఘాట్లవైపు మళ్లించాల్సి ఉన్నా.. పట్టించుకున్నవారే లేరు. పుణ్యస్నానం ఆచరించిన తర్వాత భక్తులు దైవ దర్శనం చేసుకుంటారు. అయితే.. దేవాలయాల్లో ఇప్పటికీ పనులు పూర్తికాలేదు. బాసర వంటి పుణ్యక్షేత్రంలోనే బారీకేడ్లు, క్యూలైన్ల ఏర్పాటు పనులు ఇప్పటికీ పూర్తికాలేదు. బాసరలో శాశ్వత షెడ్లు నిర్మించాల్సి ఉన్నా.. కేవలం చలువ పందిర్లతోనే సరిపెడుతున్నారు. వాటిని కూడా తక్కువ ఎత్తులోనే వేయడం ఇబ్బంది కరంగా మారింది. పుష్కరాల పనులను తూతూ మంత్రంగా చేసి చేతులు దులుపుకొని అధిక లాభాలు పొందొచ్చనే ఉద్దేశంతోనే గుత్తేదారులు పనులకు పోటీ పడ్డారు. ఎలాగో దక్కించుకొని చేయడంలో తీవ్ర జాప్యం చేశారు. నేతల ప్రమేయంతో పుష్కరఘాట్లను విచ్చలవిడిగా తెచ్చుకున్నారు. అవసరాలకు మించి కొందరు అధికార పార్టీ నేతలు ఘాట్లు తెప్పించుకోవడంతో అదే సంఖ్యలో అభివృద్ధి పనులు మంజూరయ్యాయి. అధికార పార్టీకి చెందిన నేతలే ఎక్కువగా పనులు నిర్వహిస్తుండటంతో అంతా ఇష్టారాజ్యంగా మారింది. సాధారణంగా గుత్తేదారులు పనులు సక్రమంగా చేయకపోతే.. అధికారులు జోక్యం చేసుకుని మందలిస్తూ పనులు అనుకున్నట్లు చేయిస్తారు. కానీ.. పుష్కరాల పనుల్లో మాత్రం అధికార పార్టీ నేతలు, పాలకులే తెరవెనుక ఉండటంతో గుత్తేదారులు చెప్పినట్లుగానే అధికారులు వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంజూరైన పనుల్లో ఓ బడా నేత సమీప బంధువే 70శాతం వరకు పనులు దక్కించుకున్నారు. ఇక ఆ గుత్తేదారు ఆడిందే ఆటగా మారింది. కొన్నింటిని పర్సంటేజీలు పుచ్చుకుని బినామీలతో పనులు జరిపించారు. ఉప గుత్తేదారులు కూడా నిర్లక్ష్యం వహించడంతో సకాలంలో పనులు పూర్తిచేయలేని దుస్థితి నెలకొంది. అధికార పార్టీకి చెందిన వారమయితే.. కాంట్రాక్టు పనులు చేసుకోవద్దని ఎక్కడైనా ఉందా అని జిల్లాకు చెందిన ఓ బడా నేత బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. అయితే.. అధికారాన్ని ఉపయోగించి సకాలంలో పనులు చేయకపోవడం, నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంపైన స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

COMMENTS

పేరు

Adilabad AUDIO RELEASES ENTERTAINMENT GOSSIPS Health HYDERABAD INTERNATIONAL Job Search Jobs KARIMNAGAR KHAMMAM MAHABOOBNAGAR MEDAK MOVIE REVEWS NALGONDA NATIONAL NIZAMABAD Rangareddy SINGARENI NEWS TECHNOLOGY TELANGANA NEWS VIDEO SONGS WARANGAL worldcup2015
false
ltr
item
Tdaily.In - Telangana News: మిగిలింది ఒక్కరోజే..
మిగిలింది ఒక్కరోజే..
http://acdn.newshunt.com/fetchdata5/20150709/eena/adilabad/images/350x350_IMAGE41757054.png
Tdaily.In - Telangana News
https://telugunewvideos.blogspot.com/2015/07/blog-post_9.html
https://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/2015/07/blog-post_9.html
true
2091677902228022841
UTF-8
Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS CONTENT IS PREMIUM Please share to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy