-కేంద్రమంత్రి స్మృతి ఇరానీ న్యూఢిల్లీ, : శాస్త్రీయ విద్యాబోధన కోసం దేశవ్యాప్తంగా మోడల్ సైన్స్ ల్యాబ్లు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మానవ ...
-కేంద్రమంత్రి స్మృతి ఇరానీ న్యూఢిల్లీ, : శాస్త్రీయ విద్యాబోధన కోసం దేశవ్యాప్తంగా మోడల్ సైన్స్ ల్యాబ్లు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. గురువారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ ల్యాబ్ల వల్ల పాఠశాలల విద్యార్థుల్లో గణితం, సామాన్యశాస్ర్తాల్లో సృజనాత్మకత పెంపొందుతుందన్నారు. విద్యా పథకాల కింద ఈ కార్యక్రమాన్ని మొదట ఈశాన్యరాష్ర్టాల్లో ప్రవేశపెడతామనీ, అక్కడ జిల్లాకొక ల్యాబ్ ఏర్పాటు చేస్తామని తర్వాత దేశవ్యాప్తంగా విస్తరిస్తామని చెప్పారు. రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ను మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ప్రారంభించగా, కేంద్ర మంత్రులు హర్షవర్ధన్, రాంశంకర్ కఠారియా, జితేంద్రసింగ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. స్మృతి ఇరానీకి శస్త్రచికిత్స: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి గుర్గావ్లోని మెడిసిటి దవాఖానాలో స్వల్ప శస్త్రచికిత్స జరిగింది. థైరాయిడ్ సమస్యవల్ల ఆమె మూడురోజుల క్రితం దవాఖానలో చేరినట్లు తెలిసింది. ప్రస్తుతంఆమె కోలుకుంటున్నారని, త్వరలోనే డిశ్చార్జీ అవుతారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.